BREAKING NEWS

మంచి - చెడు... అంతా మన చేతుల్లోనే

యూత్... తలచుకుంటే ఏమైనా సాధించగలరు... వారి జీవితంతో పాటు సమాజంలో అనేక మార్పులు చేసుకోగల, చేయగల సత్తా వారికే ఉంది.. మంచి వైపు వెళ్ళాలి అనుకున్నా... చెడు మార్గంలో పయనించాలి అన్నా వారి చేతుల్లోనే ఉంటుంది.

టీనేజ్ నుంచి యంగేజ్ వరకు ఎన్నో రకాల మనుషులను కలుస్తూ ఉంటారు. వారితో స్నేహం కూడా కుదురుతుంది. అయితే అన్ని స్నేహాలు మంచికే దారి తీస్తాయా... ప్రస్తుతం యువతలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి.. వారి ఆలోచనా సరళి విధంగా మారుతోంది... 

             టీనేజ్ లోకి వచ్చిన ప్రతి వాళ్లు తమకు ఇక ఎదురేలేదు అనే రేంజ్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇంజనీరింగ్ లో అడుగుపెట్టాక చెప్పాల్సిన అవసరమే లేదు. కాలేజీకి రావడం రాకపోవడం అంతా విద్యార్థుల ఇష్టమే... నచ్చితేనే కాలేజ్.. లేదా బంక్ లు కొట్టడమే... కట్ చేస్తే అరకొర మార్కులతో అతి కష్టం మీద ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తుంటారు...
ఇక అక్కడి నుంచి మొదలౌతాయి అసలు కష్టాలు... బాగా చదువుకున్న వారు పర్వాలేదు... మంచి ఉద్యోగంలో స్థిరపడతారు... ప్రతి సంవత్సరం లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు.

ఉద్యోగాల వేట మొదలు పెడుతున్నారు... క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొడితే ఓకే... లేదా ఆఫీస్ చుట్టూ తిరగడమే... ఉన్నవి లక్ష ఉద్యోగాలు అయితే ఇంజనీరింగ్ చదువుతున్నది మాత్రం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటున్నారు. అంటే కేవలం లక్ష మంది మాత్రమే సెటిల్ అవుతున్నారు.

మరి మిగిలిన వారి సంగతి?? చదివింది ఒకటి .. చేసే ఉద్యోగం మరొకటి... ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి అసలు మాత్రం పొంతన లేని కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంటాడు... మెకానికల్ చదివినవాడు సాఫ్ట్వేర్ కోర్సులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు. అలాంటప్పుడు వాళ్లు చదివిన చదువులు ఎందుకు???

                స్నేహం గురించి మాట్లాడుకున్నాం కదా... మన స్నేహితులను చూసి మనం ఎలాంటి వాళ్ళం అనేది ఒక అవగాహన కు రావచ్చు అంటారు.. నిజమే.. సాధారణంగా మన ఆలోచనలకు తగినట్లుగా ఉండే వారితోనే మనం ఫ్రెండ్షిప్ చేస్తుంటాం... మనం మంచిగా ఆలోచిస్తే రకమైన ఫ్రెండ్స్, తప్పు దోవలో ఆలోచిస్తే రకమైన ఫ్రెండ్స్ మనకు ఉంటారు. అయితే ప్రస్తుతం ఎక్కడో కొంత మంది తప్ప అందరూ మంచి ఆలోచనలతో కష్టపడి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు...

యువతలో మార్పు వస్తోంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ... చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడం లేదు. కష్టపడి పనిచేయాలి గాని రోజుల్లో అవకాశాలకు కొదవే లేదు... డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గుర్తించి చాలా మంది సొంతంగా అవకాశాలు క్రియేట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి..
స్విగ్గీ, జోమోతో, ఉబర్ ఈట్స్ ఇలా ఎన్నో సంస్థల్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదిస్తున్నారు. అదే సమయంలో వేరే మంచి ఉద్యోగానికి కొంతమంది ప్రయత్నిస్తే , డబ్బులతో చదువుకుంటున్నారు కూడా ఉన్నారు... 
                       ఆన్లైన్, స్మార్ట్ ఫోన్ లు.... చెడిపోవడానికే కాదు. సొంత కాళ్లపై నిల్చోవడానికి కూడా ఉపయోగపడుతుంది.... ఇవి కూడా మన ఫ్రెండ్స్ లాంటివే... మన ఆలోచనా విధానం బట్టే వాటిని ఉపయోగిస్తాం... కాబట్టి స్మార్ట్ ఫోన్లను , టెక్నాలజీని నిందించడం మానేసి వాటిని సక్రమంగా ఉపయోగిస్తామా లేదా వినాశనానికి ఉపయోగిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది... 
                

Photo Gallery