BREAKING NEWS

ఓసి లకు 10% కోటా

రిజర్వేషన్.... ఆర్థికంగా వెనుకబడిన వారికి, సామాజిక స్థానంలో దిగువన ఉన్నవారికి ప్రభుత్వం కల్పించే అవకాశం... ఆర్థికంగా  సామాజికంగా ఎదిగేందుకు వారికి ఇదో అవకాశం.

ఒకప్పుడు వెనుకబాటు తనానికి ఆర్థిక కారణాలు కన్నా సామాజిక కారణాలే ఎక్కువ అయ్యి ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికంగా తారతమ్యాలు కన్నా ఆర్థిక తారతమ్యాలు వలనే ప్రజలు ఎక్కువ వెనుకబాటు తనానికి గురవుతున్నారు. 

              నేపథ్యంలో గత కొన్ని దశాబ్దాలుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణాల వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న ఆకాంక్షలు, వాదనలు అడపా దడపా వినిపించేవి.... సోషల్ మీడియా వచ్చాక వాదనలు మరింత స్పీడ్ అయ్యాయి.

అయితే ఓసి లలోనే విడివిడిగా కులాల ప్రాతిపదికన డిమాండ్లు తప్ప పూర్తి స్థాయిలో ఓవరాల్ గా ఐక్యంగా లేనందు వల్ల వాదనలు ఎప్పుడూ బలమైన ప్రతిపాదకగా కూడా మారలేదు... కాబట్టి రాజకీయ నాయకుడు కూడా కనీసం దిశగా ఆలోచన కూడా చేయలేదు...

మిగిలిన వర్గాల ఓటు బ్యాంక్ గల్లంతు అవుతుందేమో అన్న భయం వలన గాని, ఓసి లకు ఎన్ని వరాలు ఇచ్చినా అంత తేలికగా ఓట్లు రాలవని , వారికి రాజకీయంగా మాత్రం ప్రయోజనం ఉండదు అని ఎవ్వరూ వైపుగా అడుగులు వేయలేదు. 

                అలాంటిది స్వాతంత్ర భారతదేశంలో మొట్ట మొదటి సారిగా, మొదటి నుంచి సంచలన & ఆకస్మిక నిర్ణయాలతో దేశ ప్రజలకు నిద్ర పట్టనివ్వని ప్రధాని నరేంద్ర మోడీ మరొక అతి పెద్ద సంచలనంగా, ఎవరి ఊహకి అందని విధంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని "సోమవారం (07.01.19)" ప్రకటించారు. తద్వారా ఎన్నికల ముందు ప్రతిపక్షాలపై, విపక్షాలపై తిరుగులేని అస్త్రాన్ని సంధించారు...

నిర్ణయం వెలువడగానే రాజకీయ విభేదాలు, విరోధాలు కు అతీతంగా మోడీని తీవ్రంగా వ్యతిరేకించే కేజ్రీవాల్ , ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మరో మాట లేకుండా స్వాగతించడం విశేషం ఇంకా శుభ పరిణామం కూడా....

కేవలం ఎన్నికల స్టంట్ గా ప్రకటనతో మాత్రమే సరిపెట్టకుండా మరుసటి రోజే (08.01.19) లోక్ సభలో బిల్ ప్రవేశపెట్టడం , అంతకు ముందే బిజెపి, కాంగ్రెస్ లు తమ ఎంపి లకు విప్ జారీ చేయడం, 5 గంటల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం డివిజనల్ పద్దతిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో హాజరైన 323 మంది ఎంపీ లలో కావల్సిన 2/3 వంతుల మెజారిటీ సాధించి బిల్లు పాసవ్వదం అన్నీ చకచకా జరిగిపోయాయి... 

             ఇంక రాజ్యసభలో బిల్ పాసవ్వడం, ఆపై సగం రాష్ట్రాల మద్దతు అవసరం.. కాంగ్రెస్ కూడా మద్దతు తెలపడం సగానికి పైగా రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండడం వల్ల ప్రక్రియలు కూడా కేవలం లాంఛనం మాత్రమే అయ్యే అవకాశాలు ఉన్నాయి.

              అయితే ఈ రిజర్వేషన్ల వలన ప్రాథమిక సమాచారం ప్రకారం సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం, 5 ఎకరాల లోపు పంట భూమి, 100 గజాల లోపు నోటిఫై భూమి, 200 గజాల లోపు అన్ నోటిఫై భూమి.... ఈ పరిమితులకు లోబడి ఉన్న జనరల్ కేటగిరీ  విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లో ఈ 10 శాతం రిజర్వేషన్ లబ్ధి పొందగలరు... తద్వారా ఎవ్వరూ పట్టించుకోని మధ్య తరగతి ఒక ఆశ చిగురించింది అని చెప్పచ్చు...

ఇది దుర్వినియోగం కాకుండా నిజంగా అవసరం ఉన్న లబ్ధిదారులకు చేరుకునేలా సద్వినియోగం అవుతుందని , ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ... ఏది ఏమైనా భారత దేశపు రిజర్వేషన్ల చరిత్రలో ఇదొక నూతన అధ్యాయానికి నాంది... 

Photo Gallery