BREAKING NEWS

సంబరంగా "శంబర జాతర"

ఇప్పుడు సిటీలన్ని ఒకప్పుడు పల్లెలే కదా... పల్లెటూర్లలో ఆచారాలు, సంప్రదాయాలు, భక్తి అన్నీ ఎక్కువే. కాలక్రమంలో పట్నం సంస్కృతి పెరగడంతో ఆచార వ్యవహారాలలో మార్పులు వచ్చాయి.

కానీ భక్తి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పల్లెటూర్లలో ఇప్పటికీ గ్రామ దేవతల ఉత్సవాలు అంబరాన్ని అంటే విధంగా సంబరంగా జరుపుకుంటున్నారు. అలాంటి మహిమ గల గ్రామ దేవత పండగే శంబర పొలమాంబ అమ్మవారి జాతర...

ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సుమారు 100 సంవత్సరాల్లో క్రితం నుంచే ఈ ఉత్సవాలు చేయడం ప్రారంభం అయినట్టు ఆ గ్రామ ప్రజలు చెప్తుంటారు. 
                      విజయనగరం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శంబర పోలమాంబ జాతర సోమవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా తొలేళ్ల ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి తొలి ఏరు పూసి రైతులు, యాత్రికులు పూజలు చేశారు. సావిడి వీధిలో ఈ ఘట్టం మొదలైంది.

పూజారి చేతుల మీదుగా అందుకున్న అక్షింతలను తీసుకెళ్లి ప్రజలు భద్రంగా దాచుకుని పంటల i8సమయంలో వాటిని పొలాల్లో చల్లుతారు. దీంతో, పంటలు బాగా పండుతాయని ఇక్కడివారి విశ్వాసం. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం జరిగింది..

ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సిరిమానును పూజారి జన్ని పేకాపు భాస్కరరావు అధిరోహించనున్నారు. రెండురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏడువందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి 200 బస్సులను నడుపుతోంది. 

        ఇలవేల్పు గా పేరుగాంచిన పైడితల్లి అమ్మవారి ఉత్సవం తర్వాత జిల్లాలో శంబర జాతరనే పెద్ద పండుగగా జరుపుకుంటారు జిల్లా వాసులు. ఈ పండగకు దాదాపు లక్షపై చిలుకు భక్తులు అమ్మవారిని దర్శించికోవడానికి తరలివస్తుంటారు. సోమవారం తొలి యేలు జరిపి మంగళవారం సిరిమానోత్సవం నిర్వహిస్తారు.
ఈ సిరిమానోత్సవం తిలకించడానికి చుట్టూ ప్రక్కల జిల్లాల ప్రజలు, మరో వైపు ఒడిశా నుండి అధిక సంఖ్యలో భక్తులు తరిలివస్తారు. 

 రాష్ట్ర పండుగగా ప్రమోట్ చేయడానికి కలెక్టరు గారు ప్రయత్నిస్తున్నారని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జాతర ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలియజేసారు.

                       దాదాపుగా 30 అడుగుల ఎత్తులో ఉండే సిరిమాను పై పూజారి కూర్చుంటారు. భక్తులందరూ సిరిమాను మీద ఉన్న పూజారిని ఆ అమ్మవారి ప్రతిరూపంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో సిరిమాను ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇక్కడే ఒక విచిత్రం ఉంది.

అంత ఎత్తులో కూర్చున్నా స్ పూజారికి ఎటువంటి భయం ఉండదు. భక్తులు అందరూ అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు అరటి పళ్ళు, కొబ్బరికాయలు, చీరలు లాంటివి విసురుతూ ఉంటారు. అయినా సరే సిరిమాను పై ఉన్న పూజారికి చిన్న గాయం కూడా తగలదు. ఇదంతా ఆ అమ్మవారి మహిమ అంటారు ఆ గ్రామ ప్రజలు. సిరిమాను పై కూర్చునే పూజారి ముందు రోజు నుంచే కఠిన ఉపవాసం ఆచరించి సిద్ధంగా ఉంటారు... సిరిమాను ను దర్శించడమే అదృష్టంగా భావిస్తారు భక్తులు....

                 ఒక్కో ఊర్లో  ఒక్కో జాతర నిర్వహిస్తూ ఉంటారు. మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, భక్తి భావాన్ని పెంచడానికి ఇలాంటి జాతరలు, ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయి... 

Photo Gallery