BREAKING NEWS

ఏపి ఫైబర్ గ్రిడ్.ఎన్నో ప్రత్యేకతలు

ఏపి ఫైబర్ గ్రిడ్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్ట్. కేవలం 149 రూపాయలకే టివి, లాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు అందించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయింది. ఇంత పెద్ద ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా నిమిషాలలో మన ముందు ఫోటోలు, వీడియోలతో సహా ప్రత్యక్షం అవుతున్నాయి... ఈ సదుపాయాన్ని మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు టెక్నాలజీ నీ ఉపయోగించుకుని పల్లెలు కూడా అభివృద్ది చెందాలి అనే సదుద్దేశంతో ఏపి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యింది... మన ఫైబర్ గ్రిడ్ కు ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.... 


మన రాష్ట్రం ప్రారంభించిన  ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మరియు IPTV ప్రొవైడర్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ఆంధ్రప్రదేశ్ చేసింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం.... భారతదేశంలో ఎక్కువ  బ్రాడ్‌బ్యాండ్ సేవలు వినియోగం కోసం ఫైబర్ గ్రిడ్ ను స్టార్ట్ చేసిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రా ప్రదేశ్.... ప్రతిష్టాత్మక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రికార్డ్ లు సాధించింది... అవేంటో చూద్దాం పదండి...
 
స్పీడ్ (ఇంటర్నెట్) అవసరం
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైట్ పేపర్ ప్రకారం, 2014 జూన్‌లో విభజన సమయంలో వైర్డు బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి 9% కన్నా తక్కువగా ఉంది.. ఈ రోజుల్లో అందరికీ స్పీడ్ ముఖ్యం.... క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ అయిపోవాలి.... సైట్ హై స్పీడ్ లో లోడ్ అవ్వాలి... కానీ వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అంత స్పీడ్ అందుకోవడం కష్టం.. అందుకే కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రంలో ఈ రకం బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది...  లాండ్ లైన్ ల కూడా దాదాపుగా లేవనే చెప్పాలి... రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉపయోగకరమైన కంటెంట్ వినియోగించడం కోసం నాణ్యత తక్కువగా ఉంటోంది... పైగా అందుబాటులో కూడా ఉండడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ హై స్పీడ్ లో దూసుకుపోతూ ఉంటే మన భారతదేశం  మాత్రం 114వ స్థానంలో ఉంది. దీంతో నిఘా కెమెరాల పనితీరు కూడా ఆశించినంత స్థాయిలో లేదు... సగటున 2.5MBPS స్పీడ్ మాత్రమే ఉన్నప్పుడు 2015 లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపట్టింది... 


ఒక సమాచార సంఘంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని నిర్ధారించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) ను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ఏర్పాటు చేసింది. ఇంట్లో రెగ్యులర్ గా నెట్ వినియోగించేవారు కోసం అతి తక్కువ ధరలో మరియు హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను విస్తరించడం మరియు డిజిటల్ కు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

AP ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రభావం
 
అతి తక్కువ ధరలో అంటే నెలకు కేవలం 149 రూపాయలకే మూడు రకాల సేవలను అందించే మొట్ట మొదటి ప్రాజెక్టు ఇదే.... 24000 కి పైగా ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయడం కేవలం 9 నెలల్లోనే పూర్తి చేశారు. ఇది కూడా ఈ ప్రాజెక్ట్ కి దక్కిన మరో రికార్డ్ .. ఇక ఇన్స్టలేషన్ ధరను తగ్గించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 3.7 లక్షల విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని ప్రభుత్వం ఈ ఫీట్ సాధించింది. 
భూగర్భ కేబుల్ నెట్వర్క్ కోసం వినియోగించే మొత్తం బడ్జెట్ లో 10 రెట్లు తక్కువ బడ్జెట్ అంటే జస్ట్ 328 కోట్ల రూపాయలు మాత్రమే ఆప్టిక్ ఫైబర్ కోసం ప్రభుత్వం వెచ్చించింది... 


 రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారు 5.8 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలను కలుపడం ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నీ ఏపి ఫైబర్ గ్రిడ్ చాలా సులభం చేసేసింది. దాదాపుగా 2300 స్కూల్స్ ఇప్పుడు వర్చువల్ గా క్లాస్ లు బోధిస్తున్నారు అంటే ఫైబర్ గ్రిడ్ వలనే... 8 లక్షల మంది పైగా విద్యార్థులు చాలా సులభంగా పాఠాలు అర్థం చేసుకోగలుగుతారు ..  ఇంటర్నెట్ ను వినియోగించుకుంటూ విజ్ఞానాన్ని కూడా 
పెంపొందించుకుంటున్నారు... 

కేవలం నెట్వర్క్ స్పీడ్ గా అందించడమే కాదు. ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది ఈ ప్రాజెక్ట్... ఏపి ఫైబర్ గ్రిడ్ లో ప్రత్యక్షంగా , పరోక్షంగా సుమారు 25000 మంది ఉపాధి పొందుతున్నారు. వేరే ఉద్యోగాల్లో నైపుణ్యం కోసం 10 వేల మంది యువతకు ప్రత్యేక శిక్షణ కూడా అందించింది... ఈ రోజుల్లో పబ్లిక్ వైఫై చాలా ముఖ్యం.. అందుకే గూగుల్ భాగస్వామ్యంతో దాదాపు 30 వేల ప్రభుత్వ ఉచిత వైఫై కోసం పైలట్ ప్రాజెక్ట్ లు కూడా చేపట్టింది. ఆ దిశగా కృషి చేస్తోంది. అది కూడా అందుబాటులోకి వచ్చేస్తే 24x7 ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యే ఉండచ్చు. మనకు కావాల్సిన , అవసరం అయిన సమాచారాన్ని సులభంగా పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది... 

రాష్ట్ర జి. డి.పి పెరుగుదలలో కూడా ఫైబర్ గ్రిడ్ ప్రభావం చూపింది... ప్రపంచ బ్యాంక్ యొక్క ఒక నివేదిక ప్రకారం " బ్రాడ్ బ్యాండ్ సేవలలో పది శాతం విస్తరిస్తే,  అది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల GDP లో  1.38 %  పెరుగుదల కి దోహదపడుతుంది. "
గత నాలుగున్నరేళ్ల లో,  ఏ.పి. లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా 5.7 % ఇంటర్నెట్ సేవలు విస్తరించడం వలన రాష్ట్ర జి.డి.పి. 0.08% పెరిగింది.


 

Photo Gallery