BREAKING NEWS

అమ్మో.... ప్లాస్టిక్ పొల్యూషన్

ప్లాస్టిక్.... ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ ఒక్క వస్తువు తోనే మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి... బడ్డీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉండాల్సిందే...

కొనే వస్తువు చిన్నదైనా పెద్దదైనా క్యారీ బ్యాగ్ లో ప్యాకింగ్ చేయాల్సిందే. ఇంటి నుంచి వెళ్తూ కూడా బ్యాగ్ తీసుకువెళదాం అని కనీస ఆలోచన కూడా ఇక్కడి ప్రజలకు ఉండడం లేదు.. ఒక్క ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఏ కదా నష్టం ఏముంది లే అనుకుంటున్నారు కానీ ఆ క్యారీ బాగ్ లోనే అసలు ప్రమాదం పొంచి ఉంది...

సింగిల్ యూజ్ ప్లాస్టిక్... ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది... ఇంతకీ అసలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏమిటో తెలుసా.. ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పక్కనపడేసి వాటిని సింగిల్ యూత్ ప్లాస్టిక్ అంటారు..

మనం ఎప్పుడు ఉపయోగిస్తున్న చాలా వరకు వస్తువులు ప్లాస్టిక్ తోనే తయారు చేస్తున్నారు కదా అలాంటప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఇబ్బంది ఏమిటో అర్థం కాలేదా. సాధారణంగా ఏ వస్తువైనా ఎక్కువకాలం ఉపయోగిస్తే ఆ వస్తువు అంత బాగున్నట్టు.

కానీ ఈ సింగిల్ యూజ్ వలన ఒక్కసారి ఉపయోగించి ఆ తర్వాత పక్కన పడేస్తున్నారు దీని వలన కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది... ప్లాస్టిక్ వలన పర్యావరణానికి ఎంతో నష్టం చేకూరుతుంది.. రీసైకిల్ బుల్ ప్లాస్టిక్ వలన నష్టం లేకపోయినా ఒక్కసారి వాడి పడేసే ఈ పాలిథిన్ క్యారీబ్యాగుల వలన పర్యావరణం ఎక్కువగా దెబ్బతింటుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 50 మైక్రన్లు కన్నా తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లను ఉపయోగించడం చట్టవిరుద్ధం కానీ అధికారుల నిర్లక్ష్యమో ప్రజల అశ్రద్ధ తెలియదుగానీ ఈ నిబంధనలు మాత్రం ఎక్కడ సరిగ్గా అమలు కావడం లేదు.

ప్రకటనలు మాత్రం భారీగానే ఇస్తున్నారు అమలు జరిగిందా లేదా అనేది మాత్రం పరిశీలించడం పర్యవేక్షించడం మరచిపోతున్నారు. మనం ఇష్టానుసారంగా వాడేసి పడేస్తున్న ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు తిరిగి మనకే హాని తలపెడుతున్నాయి.

ప్లాస్టిక్ ఈ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే... నిజానికి అసలు భూమి లో కలుస్తుంది లేదు కూడా తెలియని పరిస్థితి... అందుకే ఒక్కోసారి భూమి తవ్వుతున్నప్పుడు పాలిథిన్ కవర్లు కనిపిస్తూనే ఉంటాయి.

సగటున సంవత్సరానికి ఒక్కో ఇండియన్ 11 కేజీల ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి... దేశంలోనే మొట్టమొదటిసారిగా గుజరాత్ లో ఈ పాలిథిన్ క్యారీ బ్యాగులను నిషేధించారు... ఆ తర్వాత విశాఖపట్నం లాంటి కొన్ని పర్యాటక ప్రాంతాల్లో పాక్షికంగా నిషేధించారు అంతే మైక్రాన్లు లిమిట్ పెట్టి నిర్దేశిత మైక్రాన్లు కన్నా తక్కువ ఉన్న వాటిని వినియోగించరాదు అని అర్థం.

ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి కాదు జీవవైవిద్యానికి కూడా ప్రమాదం కలుగుతోంది... మనం వాడి పడేసే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఒక్కోసారి కాలువల నుంచి సముద్రం లోకి చేరుతుంది... ఒక్కసారంటే పరవాలేదు నిత్యం కొన్ని లక్షలమంది ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వివిధ ప్రాంతాల నుంచి వివిధ కాలువల నుంచి భారీ మొత్తంలో సముద్రంలో చేరుతున్నాయి...వీటిని కూడా ఆహారమే అనుకుని తింటున్న ఎన్నో రకాల సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయి.

నిజమో అబద్ధమో తెలియదు గాని సోషల్ మీడియాలో ఫోటో వైరల్ గా మారింది... ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం పొట్టలో ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్టు ఆ ఫోటోలో స్పష్టంగా ఉంది... ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే... ఇటు భూమి మీద నివసించే ఆవులు గేదెలు ఇలాంటి ఎన్నో రకాల మూగ జీవులు ఈ ప్లాస్టిక్ బారినపడి మరణిస్తున్నాయి... భూమిలో కలగకపోగా భూసారాన్ని కూడా తగ్గిం చేస్తున్నాయి క్యారీ బ్యాగులు.

ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యూరోపియన్ ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకుంది... 2021 నాటికి ఆ దేశంలో ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అస్సలు కనిపించదు... అక్కడి ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడకానికి గుడ్ బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ల లక్ష్యం ఒక్కటే దేశంలోని కాలుష్యాన్ని తగ్గించాలి.. అందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా తగ్గించాలి.. అందుకే ప్రజలందరూ కూడా ఒక్క మాట మీద ఉన్నారు..

ప్లాస్టిక్ బదులుగా పేపర్ తో తయారుచేసే చేతి సంచులు ఉపయోగించవచ్చు లేదా వేరే ఇతర పర్యావరణహిత మెటీరియల్ తో తయారుచేసే చేతి సంచులు కూడా ఎన్నో ఉన్నాయి.. వీటిని వినియోగించడం వల్ల ఇటు పర్యావరణాన్ని రక్షించడం తో పాటు కొంతమంది కి ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది... ఓ సినిమాలో చెప్పినట్టు మనం ఈ భూమి మీద అద్దెకు మాత్రమే ఉంటున్నాం.

 మన భావితరాలకు మంచి వాతావరణంతో, మంచి వనరులతో, మంచి పర్యావరణంతో ఈ భూమిని అప్పజెప్పాలి బాధ్యత మనందరి మీదా ఉంది.. దీనిని నాశనం చేసే అధికారం ఏ ఒక్కరికి లేదు...

రెండు వందల గ్రాముల బరువున్న మొబైల్ ఫోన్లు మన తీసుకెళ్తాం.. 100 గ్రాముల కన్నా ఎక్కువ ఉన్న పర్స్ ఎప్పుడు మన జేబులో ఉంటుంది... కానీ కేవలం 10 గ్రాములు కూడా బరువులేని గుడ్డ సంచిని మనతోపాటు ఎందుకు తీసుకుని వెళ్ళం... ఒక్కసారి ఆలోచించండి... ఈ భూమి మనందరిది...

దీనిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనది మనదే.... ఇప్పటికైనా షాపింగ్ కి గాని కిరాణా కొట్టు కానీ వెళ్లేటప్పుడు మనతోపాటు ఒక సంచి తీసుకుని వెళ్ళడం అలవాటు చేసుకుందాం... మన భూమిని రక్షించుకుందాం...


 

Photo Gallery