BREAKING NEWS

నేటి తరం స్మార్ట్ వ్యసనం....

వ్యసనం... మందు... సిగరెట్ లాంటివి మాత్రమే కాదు.. ఏ పని అయినా అతిగా చేసినా... ఆ పని లేకుండా ఉండలేకపోయినా అది వ్యసనమే అవుతుంది... ఉన్న వ్యసనాలు చాలవు అన్నట్లు కొత్త కొత్త వ్యసనాలకు కూడా బానిసలు అవుతున్నారు నేటి తరం యువత... స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత వ్యసనాలు కూడా స్మార్ట్ గా మారిపోతున్నాయి..

సెల్ ఫోన్ల తోనే వ్యసనపరులుగా మారుతున్నారు. ఫోన్ వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చేశారు. ఒకటా రెండా.. లెక్కలేనన్ని యాప్ లు... లెక్కలేనన్ని ఛాలెంజ్ లు...

ఎంటర్టైన్మెంట్... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ కావల్సిన మినిమం అవసరం... టెక్నాలజీ పెరిగింది. అరచేతిలోనే ప్రపంచం ఇమిడిపోయింది... లెక్కలేనన్ని వినోదాలు మన దగ్గరికే వచ్చేస్తున్నాయి. ఇక కాలు బయట పెట్టడానికి ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ... ఈ ప్రపంచాన్నే మరచిపోతున్నారు.

రకరకాల యాప్ లు డౌన్లోడ్ చేసుకుంటూ వాటికే అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్క నిమిషం ఆ యాప్ గాని స్మార్ట్ ఫోన్ గాని లేకుండా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. ఒక యాప్ తర్వాత మరొకటి. ఒకదాన్ని బాన్ చేస్తే దాని స్థానంలో మరో కొత్త యాప్ రెడీ అయిపోతుంది... బానిసలుగా మారడమే కాదు... ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి రావచ్చు. 

టిక్ టాక్... ఏవో సినిమా , సీరియల్స్ డైలాగులను మన హావ భావాలతో ఎలా చేస్తామో రికార్డ్ చేసుకునే అప్లికేషన్... అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎక్కువ లైక్ లు, కామెంట్స్ కోసం వినూత్నంగా ఏమైనా అప్లోడ్ చేయాలి అన్న ఆలోచనతో ప్రాణాలకు కూడా తెగిస్తున్నారు... రాజస్థాన్ లో నడుస్తున్న ట్రాక్టర్ పైకి ఎక్కి టిక్ టాక్ వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నాడో వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆ ట్రాక్టర్ కిందే పడి మరణించాడు..

ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందరి కంటే భిన్నంగా  ఉండాలి, ఎక్కువ లైక్ లు రావాలి అన్న ఆలోచనే తప్ప ఏ వీడియో చేస్తున్నాం, ఏమైనా ప్రమాదం ఉందా లాంటివి ఏవీ కనిపించవు. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఎంత రిస్క్ అయినా చేయాల్సిందే. ఇది యూత్ I ట్రెండ్....

ఇక పబ్ జి గేమ్.... వందల మంది ఒకరికొకరు తెలియని వ్యక్తులు కలిసి ఒక టీం గా ఆడేదే పబ్ జి. యుద్ధంలో గెలవాలి... చికెన్ డిన్నర్ సాధించాలి... ఇదే అందరి గోల్.. అన్నం తినడం అయినా మానేస్తా గాని పబ్ జి మాత్రం మానలేం అంటున్నారు.

ఇది వరకు ఖాళీ సమయాల్లో గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ ఆడుకునేవాళ్ళం .. కానీ ఇప్పుడు "పబ్ జి" గేమ్ కి  ఖాళీ సమయాల్లో మాత్రమే ముఖ్యమైన పనులు చూసుకుంటున్నారు. ఈ గేమ్ ఆడి... ఆడి చివరకు మతి స్థిమితం లేకుండా పిచ్చి వాళ్లు అయిపోతున్నారు.... మరికొంతమంది డిప్రెషన్ లో కి వెళ్ళిపోతూ ఎన్నో మానసిక రోగాల బారిన పడుతున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పబ్ జి గేమ్ ను బ్యాన్ చేసింది అక్కడి ప్రభుత్వాలు... 

టిక్ టాక్, పబ్ జి కన్నా ముందు నుంచే ఈ సమస్య ఉంది. బ్లూ వేల్ ఛాలెంజ్, మోమో ఛాలెంజ్ , కికి ఛాలెంజ్ అంటూ ప్రాణాలతో చెలగాటం ఆడిన యాప్ లు ఉన్నాయి.

ఎంతో మంది ఏమీ తోచక కాలక్షేపం కోసం ప్రారంభించే ఈ యాప్ లు తర్వాత్తర్వాత వారి జీవితంలో ఒక పార్ట్ అయిపోతాయి. అక్కడి నుంచి మళ్లీ కథ మామూలే...          అడిక్ట్ అవ్వడం, వాటి చుట్టూ తిరగడంతో సమస్యలు కొని తెచ్చుకున్నారు... టెక్నాలజీ ఉన్నది మన అవసరాలు కోసం.

కష్టమైన పనులు కాస్త సులభతరం చేయడం కూడా.. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్..... స్మార్ట్ ఫోన్లను మనకి పనికొచ్చే విధంగా  ఉపయోగించుకోవాలి... అంతే తప్ప ఇలా ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోకండి.. all the very best...


 

Photo Gallery