BREAKING NEWS

*తారక* మంత్రం:

తెలుగు సాహిత్య ప్రక్రియలలో జీవిత చరిత్ర,  స్వీయచరిత్రలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు.... ఆయన బాటలో తదనంతరం ఆత్మకథలను, జీవిత చరిత్రలను ఎంతోమంది రచించారు... వాటి ఆధారంగా తర్వాతి తరంలో కథలను గ్రహించి సినిమాగా తీసిన ఉదంతాలు ఉన్నాయి.... సమకాలీన వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలను తీయడాన్ని ఇప్పుడు *బయోపిక్* అని పిలుస్తున్నారు... అయితే, గతంలో కూడా జీవిత చరిత్రలను తెరమీద సినిమాగా చూపించారు... పరుగుల రాణి పి.టి. ఉష, అశ్వని నాచప్ప, సుధా చందన్ గారి మయూరి, ఒకప్పుడు తీస్తే, ms ధోనీ, మహానటి వంటి బయోపిక్ లు ఈ మధ్య వచ్చినవి... ఆ వరుసలో  వెండితెర వేల్పు , ఆంధ్రుల అభిమాన తార, తెలుగు వారి నిండు గౌరవాన్ని నిలబెట్టిన ఆరడుగుల అందాల రాముడు నందమూరి తారక రామారావు... NTR... కథానాయకుడు అనే పేరు మీద సినిమాగా రావడం ఆనందదాయకం... అయితే బయోపిక్ లో ఆ వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ చూపించి నప్పుడే , కష్టానికి తగ్గ ఫలం దక్కుంతుంది.. . 

ఈ బయోపిక్ లో  ఎడిటింగ్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం వంటి విషయాలు ప్రేక్షకుల మన్నలను అందుకొనే విధంగా ఉన్నాయి.... తండ్రి పాత్రలో బాలయ్య ఒదిగి కనిపించడానికి ప్రయత్నించిన తీరు బాగుంది... అయితే, సమకాలీన నటులలో ముఖ్యమైన వాళ్లను చూపించకపోవడం ఆలోచించాల్సిన విషయమే...  NTR కు ప్రతి పాత్రమీద ప్రత్యేక శ్రద్ధ ఉండేది.. కాబట్టే ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయేవారనడంలో అతిశయోక్తిలేదు... కానీ బాలయ్య విషయంలో ఈ తేడా  ఇట్టే కనిపిస్తోంది.... ఉదా.. నర్తనశాల సినిమా నాటికి NTR  నవయవ్వనంలో  ఉన్నందున, అటు బృహన్నలపాత్రలోనూ, ఇటు అర్జునుడి పాత్రలోనూ చూడముచ్చటగా ఉండటమే కాకుండా వాచకాభినయలాతో చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేశారు... అయితే బాలయ్య నేటి వయస్సు ప్రభావం సునాయసంగా తెలియజేస్తోంది.... కొన్ని డైలాగ్ డెలివరీ లో బాలయ్యే కనిపించాడు...  దీనికి ఉదాహరణ.... అడవి రాముడు సినిమా షూటింగ్ కు వెళ్లూ, కార్లో ఒక చోట  *బ్లడీఫూల్* అని ఒక టెక్నీషియన్ని అంటాడు.... NTR కు టెక్నీషియన్లంటే గౌరవం, స్నేహభావమే ఉండేది....
  
సమకాలీన నటులైన కాంతారావు, రాజనాల, కృష్ణ శోభన్ బాబు లతో బాటు సత్యభామ పాత్రకు పేరెన్నిక గన్న జమునను చూపించలేదిందులో.... అంతే కాకుండా NTR కు పాటలన్నా, సాహిత్యమన్నా ఎనలేని అభిమానం.... తెలుగుజాతి మనది అనే పాటలో ఘంటసాల గారి కంఠంతో బాటు ఆయన గొంతుకూడా మనందరం వినే ఉంటాం... ఆ విషయాలను చూపలేదు.... ఇక సీతారామ కల్యాణం సినిమాలో రావణాసురుడి పాత్ర  విషయంలో , కృష్ణుడిగా నిన్ను చూసిన జనం రాక్షస పాత్రలో చూడలేరని డైరెక్టరంటే, తనే డైరెక్ట్ చేసినట్లుగ్ చూపించారు.... నిజానికి  1958 లోనే భుకైలాస్ సినిమాలో రామారావు రావణబ్రహ్మ..... పాత్ర వేసారు.... ఆ తర్వాత 1961 లో సీతారామ కల్యాణం.... ఇది గమనించాలి..... 

ఇక రామారావు గారి సంతానంలో ముగ్గురి ప్రస్తావనే చేసి ఊరుకున్నారు..... అష్టమ సంతానంగా బాలకృష్ణ జననం, సందర్భంలో నైనా మిగిలిన వాళ్లు, ఆడపిల్లల విషయం కనిపించదు.... ఈ సినిమా లో నేను తెలుసుకున్న జ్యోతిషాంశాలు రెండు... ఒకటి  రామారావుగారిది స్వాతీ నక్షత్రం.... బాలకృష్ణ గారిది మూలా నక్షత్రం మిధున లగ్నం..... 

కొన్ని  సన్నివేశాలు మాత్రం గుండెలను పిండేసేవిగా ఉన్నాయనటంలో సందేహం లేదు.... దివిసీమ లాంటివి.... కొన్ని పాత్రలకు రామారావు గొంతు అలానే ఉంచి, కొన్నింటికి  బాలయ్య చేత చెప్పించటం ఏమిటో అంతుచిక్కలేదు....  మొత్తానికి ఇదొక *తారక* మంత్రం..... సినిమా చూడాటానికి బాగుంది.....

Photo Gallery