BREAKING NEWS

అసెంబ్లీ భవనానికి 116 సంవత్సరాలు ...!

హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరము. ఇది  హస్తకళలకు, నాట్యానికి బాగా ప్రసిద్ధి. భారత దేశంలో ఐదవ అతిపెద్ద మహానగరం. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. హుస్సేన్ సాగర్ ఏ రెండిటినీ వేరు చేస్తుంది. హైదరాబాదుకు మధ్యలో చార్మినారు ఉంది. దీనిని మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించడం జరిగింది.

సాధారణంగా హైదరాబాదు పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది  పబ్లిక్ గార్డెన్స్, చార్మినార్, లాడ్ బజార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, బిర్లా ప్లానిటేరియం, రామోజీ ఫిలిం సిటీ, శిల్పారామం, లుంబిని పార్క్ మొదలైనవి గుర్తొస్తాయి. కానీ అద్భుతమైన కట్టడం మన అసెంబ్లీ భవనం గురించి పూర్తిగా తెలుసుకుని కూడా ఉండరు. అయితే మరి మన అసెంబ్లీ భవనం గురించి అనేక విషయాలు చూడండి. దాని యొక్క విశిష్టత, చరిత్ర ఇలా అనేక విషయాలు మీ కోసం. మరి ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి.
 
అసెంబ్లీ భవనం:
 
అసెంబ్లీ భవనాన్ని 1905 వ సంవత్సరం జనవరి 25వ తేదీన అంకురార్పణ జరిగింది. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వీటిలో అసెంబ్లీ భవనం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్ గా ప్రకటించిన నేపథ్యం లో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతల పై పలు విశేషాలు మీ కోసం. అయితే అసెంబ్లీ భవనం కట్టి ఇప్పటికి 116 సంవత్సరాలు అయింది. దీనిని నిర్మించి ఒక శతాబ్దం పైనే పూర్తయింది అన్నమాట. అప్పుడెప్పుడో కట్టిన అసెంబ్లీ భవనం ఇంకా చెక్కుచెదర లేదు. రాజసం ఉట్టి పడే రాజధానికి  ప్రత్యకం అసెంబ్లీ భవనం. 
 
ఇక చెప్పక పోతే చాలానే చెప్పాలి. ఈ విషయాలు మీరు ఎప్పుడు విని ఉండరు. హైదరాబాద్ నగరం లోనే ఇది ఒక ప్రఖ్యాత కట్టడం. 1905 జనవరి 25న అంకురార్పణ దీనికి జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ పచ్చని ప్రకృతి నడుమ ఈ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పుడెప్పుడో మొదలయ్యింది ఇప్పటికి కూడా ప్రజా ప్రతినిధులు ఈ వేదికని ఉపయోగిస్తూ ఉన్నారు. 
 
అసెంబ్లీ భవన నిర్మాణ శైలి:
 
అసెంబ్లీ భవనాన్ని ఎప్పుడైనా గమనిస్తే అతి అందమైన గోపురాలు ఆకాశాన్ని తాకే శిఖరాలు తో ఉంటుంది. అంతే కాదు అందంగా తీర్చి దిద్దిన డ్రోన్ల తో ఇది బాగా ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. ఈ అసెంబ్లీ భవన్ కి చేసిన డిజైన్ చూస్తే ఎంతటి వారైనా ముగ్దులు అవ్వాల్సిందే. దేశ విదేశాల నుండి వచ్చే వారి మనసుని కూడా ఇది గెలుచుకుంటుంది. మొగలాయి రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలుల తో దీన్ని కట్టించడం జరిగింది. ప్రముఖులను, పర్యాటకులను కూడా ఈ నిర్మాణం ఆశ్చర్యపరుస్తోంది.
 
టౌన్ హాల్ నిర్మాణం కోసం రాజస్థాన్ నుండి రాళ్లను తెప్పించారు. రెండవ అంతస్తులో నిర్మించిన టౌన్ హాల్ చుట్టూ 20 గదులు ఉంటాయి. గోపురాలు కోసం బంకమట్టి వినియోగించారు. గోపురాలూ కమాన్లు మొగలాయిల వాస్తు శైలిని సంతరించుకుంటే...  గోడల పై వేసిన కళాత్మక దృశ్యాలు, లతలు డిజైన్లు అన్నీ కూడా రాజస్థానీ శైలి లో రూపొందించడం జరిగింది. అయితే దీనిని అన్ని వాతావరణానికి తగినట్లుగా నిర్మించడం మరో గొప్ప విషయం. లోపలికి చక్కటి గాలి, వెలుతురూ వచ్చేలా దీన్ని రూపొందించారు. చలి కాలం లో వెచ్చగా వేసవి కాలంలో చల్లగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే కదా....!
 
అసెంబ్లీ భవనం ఫోటోతో పోస్టల్ స్టాంప్:
 
1913లో భవన నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటు లో వచ్చిన తర్వాత ఈ భవనం ఫోటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజలు అందరికీ తెలిసేలా అసెంబ్లీ భవనం ఫోటో తో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పట్లో ఒక అణా.  
 
ఈ భవనాన్ని కట్టక ముందు 1940 వ సంవత్సరంలో ఢిల్లీకి వెళ్లిన మహబూబ్ అలీ ఖాన్ సంస్థానాధీశుల దర్బార్ సమావేశాల లో ఆయన అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు అలా టౌన్ హాల్  నిర్మాణానికి బీజం పడింది. ఆ తరువాత హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగు చేసి ఆ భవనాన్ని కట్టించారు. అప్పటికే చాలా భవనాలు ఉన్నాయి కానీ మంత్రులు ఉన్నతాధికారులు నగర ప్రముఖులు సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వేదిక లేదు అని 1905 లో మహబూబ్ అలీఖాన్ 45 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు నగర వాసులు బహుమానంగా ఈ అందమైన భవనం నిర్మాణాలు చేపట్టారు. 
 
అయితే సమాజం లో ఉన్న ఉన్నత వర్గాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా దీనికి విరాళాలు సమర్పించారు అంతే కాదు అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు సహాయం చేసారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్‌ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్‌ హాల్‌గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది.