BREAKING NEWS

వలస పక్షులతో నిండి ఉన్న అందమైన చిలికా సరస్సు గురించి మీకోసం...!

చిలికా సరస్సు సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రదేశాన్ని కుటుంబ సమేతంగా లేదా స్నేహితుల తో కలిసి చూడడానికి వెళ్ళండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. చిలికా సరస్సు ఎంతో అందమైన ప్రకృతితో నిండి ఉంటుంది. మరో పక్క అనేక ప్రాంతాల నుండి సందర్శకులు వచ్చి సందడి తెస్తారు. నిజంగా వలస పక్షుల తో ఎంతో అందంగా ఉంటుంది ఈ చిలికా సరస్సు.

అక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడు మీరు ఇక్కడికి వెళ్లి ఉండక పోతే ఒకసారి వెళ్ళండి. నిజంగా అద్భుతమన్న తక్కువే.  అయితే మరి ఈ  సరస్సు గురించి అనేక విషయాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా  ఆలస్యమెందుకు చిలికా సరస్సు గురించి పూర్తిగా చూసేయండి....
 
చిలికా సరస్సు ఎక్కడ ఉంది..?
 
చిలికా సరస్సు భారత దేశపు తూర్పు తీరం లో ఉన్న ఉప్పు నీటి సరస్సు. ఇది దయా నది ముఖ ద్వారం వద్ద ఒడిషా రాష్ట్రం లోని పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాలో విస్తరించి ఉంది. ఇది భారత దేశం లోనే అతి పెద్ద తీర ప్రాంత సరస్సు. దీని విస్తీర్ణం 1100 చదరపు కిలో మీటర్లు పైచిలుకు ఉంటుంది. ఈ చిలికా సరస్సుని చేరుకోవడం కష్టం ఏమి కాదు. నేషనల్ హైవే వద్దనే ఇది ఉంది. దూర ప్రాంతాలు వాళ్ళు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు అంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించండి. 
 
పక్షులకి నిలయం చిలికా సరస్సు: 
 
ఇక్కడ కనపడే పక్షులు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎక్కడెక్కడి నుంచో పక్షులన్నీ వచ్చి ఈ సరస్సు వద్ద ఎగురుతూ ఉంటే... వీటిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే చెప్పాలి. వలస పక్షులకు భారత ఉపఖండం లో చిలికా అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించిపోతున్న అనేక మొక్కలకు, జంతువులకు ఈ సరస్సు నిలయం అని మనం చెప్పవచ్చు. ఈ ఉప్పు నీటి సరస్సుని  తడి భూమిగా వర్గీకరించబడింది. ఈ సరస్సు శీతాకాలం లో కాస్పియన్ సముద్రం, ఇరాన్, రష్యా, సైబీరియా నుంచి వచ్చిన అనేక వలస పక్షులకు ఆవాసంగా మారింది. అయితే ఏకంగా వలస సీజన్లో 205 పక్షి జాతులని ఈ సరస్సు వద్ద సందర్శించవచ్చు అని అంచనా.
 
ఒక సర్వే ప్రకారం తేలినది ఏమిటంటే...?  ఇక్కడున్న పక్షుల్లో సుమారు 152  ఐన ఇరావడీ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. వీటికి తోడు, సరస్సులో 37 రకాల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి.
45 శాతం నేల పై ఉండేవి, 32 శాతం నీటి పక్షులు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా  23 శాతం ఒడ్డున నీటిలో నడుస్తూ వేటాడే తీర పక్షులు. అలానే సరస్సు లో 14 రకాల వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. 
 
ఒకటా రెండా ఈ సరస్సు గురించి అనేక విషయాలు తెలుసుకుని తీరాలి మీరు. ది న్యూ కాలెడోనియన్ బారియర్ రీఫ్ తరువాత, ప్రపంచం లోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సుల్లో ఇది రెండవది. దీన్ని తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.  ఈ సరస్సు పెద్ద ఎత్తున మత్స్య వనరుల తో కూడుకుని ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. దీని తీరం లోనూ ద్వీపాల్లో ఉన్న 132 గ్రామాలలోని లక్ష యాభై వేల పైచిలుకు మత్స్యకారులు ఈ సరస్సు జీవికనిస్తుంది. ఎంత గొప్ప విషయమో కదా..!
 
చిలికా సరస్సు వద్ద దీవులు: 
  
చిలికా సరస్సు వద్ద ఉన్న ఈ దీవులు కూడా పర్యాటకులకు మంచి సందడి ఇస్తాయి. వచ్చే వాళ్ళు ఈ ద్వీవులని చూసి బాగా ఆనందిస్తారు. చిలికా సరస్సు లోపల అనేక చిన్న దీవులు ఉన్నాయి. ఈ ద్వీపాలను ఒక సారి సందర్శిస్తే చాల బాగుంటుంది. పక్షులు ద్వీపం, హనీమూన్ ద్వీపం, పారికుడ్ దీవి, బ్రేక్ఫాస్ట్ ద్వీపం, మాలుడ్ ద్వీపం, నిర్మలఝార ద్వీపం, కాళిజై ద్వీపం, నల్బానా ముఖ్యమైన వాటిలో కొన్ని రెల్లు ద్వీపాన్ని అనువదించవచ్చు. 
 
కలిజై ద్వీపం ప్రత్యేకత:
 
కలిజై ద్వీపం ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ద్వీపాన్నికలిజై  దేవతకు అంకితం చేయబడి ఉంది. అందువల్ల ఇది ఒక హిందువులు యాత్రా స్థలంగా కూడా మారిపోయింది. ఇక్కడికి ఏడాది పొడుగునా భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సరస్సు సముద్ర సంగమం సమీపంలో రిఝాన్స్ తీరం ఉంది. ఈ దీపం వద్ద ఒక విశాలమైన బీచ్ కూడా ఉంది.
 
ఈ సరస్సుకు సమీపంలో ఉన్న మరి కొన్ని ప్రదేశాలు:
 
ఈ సరస్సు ని  సందర్శించిన తర్వాత ఇక్కడ బెర్హంపూర్, ఉదయగిరి, భువనేశ్వర్, పర్దీప్, గోపాల్పూర్ మొదలైన చుట్టు పక్కల ప్రాంతాలను కూడా వీక్షించవచ్చు. నిజంగా అన్ని కలిసి ప్లాన్ చేసుకుని చూస్తే అనేక ప్రదేశాలని వీక్షించవచ్చు. అందరి తో కలిసి వెళితే భలే మజాగా ఉంటుంది కదా...!