BREAKING NEWS

సుభాష్ చంద్ర బోస్ జయంతి: నేతాజీ గురించి అనేక విషయాలు మీకోసం..!

సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దానిని ఆచరణ లో పెట్టాడు సుభాష్ చంద్ర బోస్. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారత స్వతంత్ర సమర యోధుడు. ఈయన గురించి తెలియని వారు ఉండరు. దేశం కోసం స్వాతంత్రం కోసం ఎంత గానో కృషి చేశారు. ఒక వైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం కోసం పోరాటం చేస్తే...

సుభాష్ చంద్ర బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా తరిమి కొట్టవచ్చునని నమ్మాడు. ఈయన జీవితం గురించి బాల్యం గురించి అనేక విషయాలు మీ కోసం. సుభాష్ చంద్రబోస్ 1897 లో భారత దేశం లోని ఒరిస్సా లోని కటక్ పట్టణం లో జన్మించారు. తన తండ్రి జానకి నాథ్ బోస్ లాయరు, తీవ్రమైన జాతీయవాది. ఈమె తల్లి ప్రభావతి దేవి.
 
సుభాష్ చంద్ర బోస్ విద్యాభ్యాసం కటక్ లోని రావెన్షా లో జరిగింది. 1920 లో బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై నాలుగో ర్యాంకు సాధించాడు. ఆంగ్లంలో కూడా అధిక మార్కులు వచ్చేవి. 1921 ఏప్రిల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వతంత్ర సంగ్రామం లో పాల్గోవడం ప్రారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం లో బోస్ తన మంచి పాత్ర పోషించాడు. ఆంగ్లేయుల పాలన నుండి మనకు విముక్తి కావాలని అనే వాడు సుభాష్ చంద్ర బోస్. జనవరి 23వ తేదీన జన్మించారు... ఈ సందర్భంగా ఆయన కోసం పలు విశేషాలు మీ కోసం.
 
స్వామి వివేకనంద మార్గం లో సుభాష్ చంద్ర బోస్: 
 
రామకృష్ణ పరమ హంస,  స్వామి వివేకానంద మార్గం లో ఈయన అనుసరించే వాడు. సన్యాసం తీసుకోవడానికి కూడా తీర్మానించారు. మానవసేవే మాధవ సేవ అనే నినాదం రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానం తో ముందుకు సాగారు సుభాష్ చంద్ర బోస్.
 
సుభాష్ చంద్ర బోస్ 11 సార్లు జైలుకి:
 
దేశం కోసం పోరాడడానికి ఈయన ఎంతకైనా తెగించారు. ఏకంగా 11 సార్లు జైలుకు వెళ్లారు. బ్రిటీష్ అధికారి వెల్స్ క్యూన్ భారత పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్ తో కలిసి జరిపిన పోరాటం లో అరెస్ట్ అయ్యారు. స్వాతంత్ర పోరాటం లో భాగంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 11 సార్లు జైలు కు వెళ్లారు. బ్రిటిష్ వారి పాలన నుండి భారత దేశానికి రక్షించేందుకు గాను చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు. 
 
సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ లో చేరిక:

 
ఈయన జాతీయ కాంగ్రెస్ పార్టీ లో చేరి దేశ స్వతంత్ర పోరాటం లో పాల్గొన్నారు. ఈయన డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లాండ్ కి వెళ్ళిన సమయం లోనే జలియన్ వాలా బాగ్ ఉద్యమం చోటు చేసుకుంది. ఐసిఎస్ లో శిక్షణ తీసుకున్న తర్వాత అధికారిగా బాధ్యతలు స్వీకరించకుండా అక్కడ నుండి స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ లో చేరారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నిక అయినప్పటికీ మహాత్మా గాంధీజీ తో సిద్ధాంత పరంగా విభేదించారు. ఇది ఇలా ఉండగా తన పదవిని గడ్డి పరక తో సమానంగా భావించి వెంటనే రాజీనామా చేశారు.

సుభాష్ చంద్రబోస్ అయితే గాంధీజీ పాటించిన హింస, సత్యం, శాంతి మార్గం ఏమీ స్వతంత్రం తీసుకు రాదని మనం కూడా పోరుబాట జరిపితేనే బ్రిటిష్ వాళ్లు భయ పడతారు అనే వారు. అదే సందర్భం లో ఈయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు జరిగింది.1944 ఫిబ్రవరి నాలుగో తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
బ్రిటిష్ వారిని దెబ్బ కొట్టిన బోస్: 

 
అదేసమయంలో సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభం కావడం తో ఇదే బ్రిటిష్ వారు దెబ్బ కొట్టే అద్భుతమైన అవకాశం అని భావించారు. అయితే మొత్తానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరుబాట తెల్ల వాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. దీని తో వాళ్లు మన వాళ్లకు కూడా ఆయుధ పోరాటం తెలుసని భయ పడ్డారు. ఇలా మన సత్తా  ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది.
 
నేతాజీ అదృశ్యం, అనుమానాస్పద మరణం:
 
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదం లో మరణించారు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడ లేదు. అయితే దీని ప్రకారం ఆయన బతికి ఉండ వచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి. ఇలా అనేక వార్తలు వచ్చాయి కానీ దేనికి ప్రూఫ్ లేదు. ఈయన సేవలు నేటి తరం తెలుసుకోవాలి... అందరికీ ఈయన కీర్తి తెలియాలి.