BREAKING NEWS

అందమైన ప్రకృతి తో నిండిన నాగలాపురంలో చూడాల్సిన ప్రదేశాలు..!

అందమైన ప్రకృతి, అనేక ప్రదేశాలు... ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్శకులని ఆకట్టుకుంటాయి. నాగలాపురం లో చూడదగ్గ ప్రదేశాల గురించి చెప్పుకు పోతే చాలానే చెప్పాలి. చిత్తూరు జిల్లా లోని నాగలాపురం గ్రామం గురించి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు గురించి ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా.....? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా దీని కోసం చూసేయండి.

నాగలాపురం అనేక ప్రదేశాల తో నిండి ఉంది. దేవాలయాలు, జలపాతాలు, ట్రెక్కింగ్, క్యాంపింగ్... ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సరదాగా కుటుంబ సమేతంగా లేదా ఫ్రెండ్స్ తో కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఒక్క సారి ఇక్కడకి వెళ్లారు అంటే అది మీకు జీవితాంతం స్వీట్ మెమరీ గా ఉండి పోతుంది. ప్రకృతి ప్రేమికులు దీనిని తప్పక సందర్శించాలి. 
 
ఇటువంటి అద్భుతమైన ప్రదేశం గురించి ఒక లుక్ వేస్తే ఒక ట్రిప్పు వేయాలి అనిపిస్తుంది. ఈ ప్రదేశం ని చూడడానికి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల వారే కాదు  చెన్నై నుండి కూడా వస్తూ ఉంటారు. అలానే సాహసికులు, ప్రకృతి ప్రేమికులు కూడా ఇక్కడ కి వస్తూ ఉంటారు. వీకెండ్స్   ని ఇక్కడే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది చెన్నై కి కేవలం 70 కిలో మీటర్ల దూరం లో ఉంది. అలానే  బెంగళూరుకు 217 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇక్కడ ఉన్న పచ్చని అందాలు జలపాతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ అందాలతో సెల్ఫీ తీసుకొని సరదాగా గడుపుతూ ఉంటారు.
 
 ఇక్కడ అబ్బుర పరిచే కళాకృతులు:
 
ఈ ప్రదర్శన చూడడానికి చాలా బాగుంటుంది అని ఇప్పుడే చెప్పుకున్నాం. వీటిలో టెంపుల్స్ బాగా ఫేమస్. ఇక్కడ వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించారు. కుంభకోణం నుండి తిరిగి వస్తూ ఉంటే  నాగలాపురం వేద నారాయణ స్వామి కల లో కనిపించే దేవాలయం నిర్మించమని ఆయనని అడిగారట. అయితే అప్పుడు నిర్మించిన ఆ ఆలయమే ఇప్పుడున్న ఆలయం. ఇంత పురాతన ఆలయాన్ని చూడడానికి చాలా బాగుంటుంది కదా...!  ఈ ఆలయం మొత్తం 12 ఎకరాల లో  విస్తరించి ఉంది. శిల్ప చాతుర్యానికి వాస్తు నిర్మాణానికి ఆలయం మచ్చుతునక.
 
ఇక్కడ గర్భ గుడి లో మూలవిరాట్టు మత్స్యావతార మూర్తి ఇరు వైపులా  శ్రీ దేవి భూదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం దృశ్యాలు చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. సంవత్సరంలో మూడు రోజులు భగవంతుడిని సూర్య కిరణాలు తాకుతాయి. అవి ఎప్పుడు అనే విషయానికి వస్తే... మార్చి 25 26 27 తేదీల్లో ఇలా జరుగుతుంది. అయితే మొదటి రోజు పాదాలను రెండో రోజు నాభీ ప్రాంతాన్ని,  మూడో రోజు ముఖారవిందాన్ని చూపిస్తాయి. అప్పుడు ఆలయమంతా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఈ మహిమ చూడటానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.
 
క్యాంపైనింగ్:  

 
క్యాంపైనింగ్, ట్రెకింగ్ రిజర్వ్ ఫారెస్ట్ కు కనెక్ట్ చేయబడిన ఒక పెద్ద సరస్సు నుండి మొదలవుతుంది ఈ క్యాంపైనింగ్.  నీటి కొలను ఎత్తయిన పర్వతాలు చుట్టూ క్యాంపైనింగ్ ఉంటుంది. నాగలాపురం ఊరు నుండి 18 కిలో మీటర్ల దూరం లో ఇది ఉంది. దీని కోసం కూడా ప్రత్యేకించి వస్తూ ఉంటారు.
  
కోని జలపాతాలు:
 
జలపాతాలు చూసిన, అక్కడ సమయం గడిపిన ఎంతో బాగుంటుంది  కదా..!  ఏ జలపాతమైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలానే కోని జలపాతం కూడా మంచి అద్భుతాన్ని ఇచ్చే చిన్న జలపాతం. తూర్పు కనుమలలో చుట్టూ కొండలు అడవులు నదుల మధ్య గల కింద కి జారుతూ ఉంటుంది.  ఈ జలపాతం ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ కి వచ్చిన వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ సరదాగా కుటుంబం తో ఎంజాయ్ చేస్తారు.
 
నాగలాపురం లో ఫెసిలిటీస్:
 
ఇక్కడి కి వచ్చిన వాళ్ళు కష్టం పడక్కర్లేదు. చక్కని సౌకర్యాలు సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి మీరు కనుక ఇక్కడికి చేరాలనుకుంటే కంగారు పడవద్దు. వసతి సదుపాయం తో పాటు అనేక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ట్రెకింగ్ కోసం  వచ్చే వాళ్ళు ట్రావెల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరికి 2500 నుండి మూడు వేల వరకు వసూలు చేస్తారు.

మీరు చక్కగా వసతి, గైడ్ ట్రాన్స్పోర్ట్ ఇటువంటివన్నీ బాధ్యతల్ని సంస్థకు అప్పచెప్పవచ్చు. దీనితో మీ ప్రయాణం సులభమవుతుంది. ఒక వేళ కనుక ఇలా కాదు అనుకుంటే ముందు గానే భోజనము ఏర్పాటు చేసుకుని వెళ్ళ వచ్చు. ఇంట్లో చక్కగా వండుకుని పట్టుకెళితే వనభోజనాలు లాగ ఏర్పాటు చేసుకో వచ్చు. ఇలా మీ వీలును బట్టి మీరు చేసుకుని ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నింటినీ వీక్షించవచ్చు.