BREAKING NEWS

శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి అనేక విషయాలు మీ కోసం...!

మన ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అద్భుతమైన చరిత్ర తో, ఎంతో పురాతన ఆలయాల్లో ఒక ఆలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం. అత్యంత ప్రాచీనమైన ఆలయం ఇది. ఈ ఆలయం గురించి అనేక విషయాలు మీ కోసం... మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం గురించి అనేక విషయాలు ఇక్కడ చూసేయండి.
 
అతి ప్రాచీనమైన ఈ ఆలయం నెల్లూరు లోనే ఉంది. ఇది రంగనాయకుల పేట లో పెన్నా నది ఒడ్డున కలదు. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతి రూపంగా, రంగనాయక అమ్మవారిని లక్ష్మీ దేవి ప్రతి రూపంగా చెబుతారు. 
 
రంగ నాథుడు రూపం లో ఉన్న మహా విష్ణువు:
 
అయితే ఈ ఆలయం లో రంగనాథ స్వామి ఉండడం వల్ల ఈ ప్రాంతానికి రంగ నాయకులపేట అని పేరు వచ్చింది. ఇప్పటికి కూడా దీనిని ఈ పేరు తో పిలవడం జరుగుతోంది. ఈ క్షేత్రం రంగ నాథుడు కొలువై ఉన్న శ్రీ రంగానికి ఉత్తర దిశ లో ఉంది. దీని మూలం గానే తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయాన్ని ఉత్తర శ్రీరంగం అని అంటారు.
 
పౌండరీక యాగం:
 
మహా పుణ్యక్షేత్రాల్లో పర్యటన లో భాగంగా కశ్యపుడు ఇక్కడ పౌండరీక యాగం చేశారు. అయితే అతని భక్తికి నారాయణుడు మెచ్చి ఆ ప్రాంతం భక్తుల ఆదరణ తో పరిఢవిల్లుతుంది అని అక్కడ శ్రీ రంగనాథ స్వామి గా వెలిశాడు. ఇది ఒక కథనం అయితే.... మరొక కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞం లో నుంచి ఉద్భవించే త్రేతాగ్ని జ్వాల లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా వెలిస్తే మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా.... ఇక మూడవది వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. ఇదే ఆలయ కధనం. 
  
తల్పగిరి అనే పేరు ఎలా వచ్చింది...?

 
శ్రీ మహా విష్ణువు రంగ నాథుడు రూపం లో కొలువై ఉన్న ఈ క్షేత్రానికి  తల్పగిరి అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే... శ్రీ మహా విష్ణువు శ్రీ దేవి సమేతంగా భూలోకం లో విహరించాలని భావిస్తాడు. అయితే దీని కోసం అనువైన ప్రాంతం చూడాల్సిందిగా ఆది శేషుని ఆదేశిస్తాడు. అయితే శ్రీ మహా విష్ణువును క్షణకాలం కూడా విడిచి ఉండ లేని ఆదిశేషుడు ప్రస్తుతం నెల్లూరు లోని పినాకిని గా పిలువబడే పెన్నా నది తీరం లో ఒక గిరి ఉంది. అయితే గిరిగా మారిపోయి తన పై విహరించాలని కోరుతాడు. అయితే వివాహన ముగిసిన తర్వాత మహా విష్ణువుకు ఈ ఆది శేషుడు తల్పంగా మారిపోయి తన పై కొంతసేపు విశ్రమించాల్సిందిగా కోరుతాడు. అయితే ఇది ఈ ప్రదేశంలో జరిగింది కనుక దీనికి తల్పగిరి రంగనాథ స్వామి క్షేత్రంగా పేరు రావడం జరిగింది.
 
తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో గోపురం:
 
ఏడు అంతస్తులు, తొంభై ఆరు అడుగుల గాలి గోపురం ఈ ఆలయం లో ఉంది. అబ్బా...! ఎంత గొప్ప విషయమో కదా...! చూడడానికి ఎంత బాగుంటుందో కదా...!  క్రీస్తుశకం 1959లో ఎర్ర గుడిపాటి వెంకటాచలం పంతులు ఆధ్వర్యం లో ఏడు అంతస్తుల తో 90 అడుగుల ఎత్తు గాలి గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ళు పట్టిందట.
 
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో అద్దాల మందిరం:
 
అద్దాల మందిరం అంటే మామూలు విషయమా ఈ గాలి గోపురం పై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. నిజంగా ఈ గుడికి ప్రతి ఒక్కరూ వెళ్లి తీరాలి 1928లో 30 వేల చిన్న నరసింహాచారి స్వామి వారికి తంజావూరు చిత్ర కళ లో కూడా నిర్మించాడు. అక్కడ గజేంద్రమోక్షం, దశావతారాలు, ఆళ్వారుల చార్యులు చిత్రాలు బంగారు పూతతో కనువిందు చేస్తాయి. శ్రీమన్నారాయణుడు వటపత్రశాయిగా పవళించి ఏ వైపు నుంచి చూసినా తననే చూస్తున్న భావన భక్తులు కలిగిస్తాయి. అందుకే ఇంత మహిమగల ఈ ఆలయాన్ని వీక్షించడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. 
 
శ్రీరంగనాథుడు ఈ భూమి పై అవతరించిన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున 12 ప్రముఖ నదులు ఇక్కడ పెన్నా నదులు సంగమించే పినాకిని క్షేత్ర మహత్యం గ్రంథం ద్వారా తెలుస్తోంది అయితే దీని మూలంగానే ప్రతి ఏడాది ఆ రోజున ఇక్కడ పుణ్య స్నానాలు చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. చూసారా ఈ ఆలయం కి ఎంత మహత్యం ఉందొ...! మరి వీలు దొరికితే ఈ అద్భుతమైన ఆలయాన్ని వీక్షించడానికి ప్లాన్ చేసుకోండి.