BREAKING NEWS

బర్డ్ ఫ్లూ విజృంభించడంతో భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత..!

రోజు రోజుకి ఇంకెన్ని సమస్యలు చూడాలో..? ఇప్పటికే కరోనా మహమ్మారి బతుకుల్ని అతలాకుతలం చేయగా... స్ట్రైన్ కూడా హడలెత్తిస్తోందనుకుంటే... బర్డ్ ఫ్లూ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ సంఖ్య లో కోళ్లు, బాతులు, కాకులు తో పాటు ఇతర పక్షులు కూడా మృత్యు వాత పడుతున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ  తీవ్రంగా ఉన్న ప్రాంతాల లో అలర్ట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా మృతి చెందిన పక్షుల శాంపిల్స్ ని కలెక్ట్ చేసే చూస్తే బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు ఉన్నట్టు కూడా తేలింది. ఏది ఏమైనా ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండడం మంచిది. బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక, డెయిరీ విభాగం ఢిల్లీలో ఒక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. 
 
బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే బతుకులు తిరిగి బాగు పడుతుంటే... బర్డ్ ఫ్లూ తో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు.  బర్డ్ వైరస్ మొదట రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ‌లో రాగా... క్రమంగా పలు రాష్ట్రాల లో కూడా విస్తరిస్తోంది. దీని మూలం గానే ఇప్పటికే భారీ సంఖ్య లో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు కూడా
మృత్యువాత పడడం జరిగింది. ఇది ఇలా ఉండగా హర్యానా లో గత పది రోజుల్లోనే ఏకంగా 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం పంచకుల జిల్లా లోనే ఇన్ని కోళ్లు మరణించాయి. 
 
మంద్సౌర్‌ ప్రాంతం లో ఒకే రోజు 100 కాకులు చనిపోవడం తో, వాటికి వైరస్ ఉండడం తో ఇప్పటికే  మంద్సౌర్‌ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్‌ సెంటర్లు మూసేసారు. అలానే  కోడి గుడ్ల విక్రయాలను కూడా నిషేధించారు. కేవలం కాకులే కాదు  హిమాచల్ ప్రదేశ్ ‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టు పక్కల పెద్ద మొత్తం లో బాతులు కూడా మరణించాయి. దీనికి కారణం కూడా  బర్డ్ ఫ్లూ అని తేలింది. అలానే ఈ బర్డ్‌ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బర్డ్‌ ఫ్లూ  కోళ్లకు సోకినప్పుడు రెండు రకాల లక్షణాలు కన్పిస్తాయి అని కూడా తెలియ జేసారు. ఒక వేళ కోడి కి వ్యాపించినప్పుడు ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉంటె.... కోళ్ల ఈకలు రాలి పోవడం వంటివి జరగడమే కాకుండా....గుడ్డు ఉత్పత్తి కూడా తగ్గుతుంది అన్నారు. ఒక వేళ ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే మాత్రం కోడి శరీరం లోని వివిధ అవయవాలు దెబ్బతిని 48 గంట లోపు మరణిస్తుంది. 
 
అలానే ఒక కోడి లేదా పక్షి నుండి మరో దానికి ఎలా చేరుతుంది అనే విషయానికి వస్తే.. కోడి లేదా సోకిన పక్షి విసర్జన ద్వారా ఈ వ్యాధి ఒక దాని నుంచి మరొక కోడికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. అలానే మనుషుల కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దీ రోజుల పాటు చికెన్ ని ఇళ్లల్లో  బంద్ చెయ్యడం మేలు. 

హరియాణా లోని పంచకుల జిల్లా లో కూడా గత పది రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కోళ్లు మరణించాయి. వాటిలో బర్డ్‌ ఫ్లూ వైరస్ నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. ఈ వైరస్ వ్యాప్తిని కనుక  అరికట్టాలంటే ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుత పరిస్థితి పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. 
 
కేరళ లోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో దాదాపు 1700 బాతులు అనుమానాస్పద స్థితి లో మృతి చెందాయి. ఏది ఏమైనా ఇతర ప్రాంతాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే  మందుస్తు జాగ్రత్తగా కోళ్లు, బాతులను చంపే ప్రక్రియకు అధికారులు ఉపక్రమించారు. అయితే ఈ ప్రక్రియ లో భాగంగా 40 వేలకు పైగా కోళ్లు, బాతులను వధించాల్సి ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. మరో వైపు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాయి. 
 
ఇది ఇలా ఉండగా కేరళకు దగ్గరగా ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బర్డ్‌ ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. ఇప్పటికే  కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్‌ రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలని తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటోంది. అలానే ఈ బర్డ్‌ఫ్లూ నేపథ్యం లో కొంత కాలం పాటు కోళ్లు, బాతుల మాంసం తిన వద్దని కేరళ, మధ్యప్రదేశ్‌ అధికారులు ఆయా ప్రజలకు సూచించడం జరిగింది. దీని మూలంగా కేరళ లోని అలప్పుజ జిల్లా లో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు.