BREAKING NEWS

ఆలయాలపై దాడులు ఇంకెన్ని....? వరుస దాడులు జరగడానికి కారణాలేమిటి..?

 రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటన తో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నలు దిక్కులా వ్యాపించి దుమారం రేపుతోంది. కానీ వరుసగా దాడులు జరగడం నిజంగా ఘోరం.  ఆలయాల పై గతం లో కూడా అనేక ఎన్ని దాడులు జరుగుతుండడం చూస్తున్నాం. గత కొన్ని నెలల నుండి ఇవి మరీ ఎక్కువై పోయాయి.

అంతర్వేది లో రధం కాలిపోవడం, రాజమండ్రి లో సుబ్రమణ్యేశ్వర విగ్రహం రెండు చేతులు నరకడం, విజయవాడ లో సీత దేవి విగ్రహాన్ని ధ్వంసం  చేయడం ఇలాంటివి చూస్తుంటే ఇవి ఉద్దేశ పూర్వంగా జరిగినట్టే తెలుస్తోంది. దేవుడి విగ్రహాల ధ్వంసం ఘటనల పై హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్ల లో రాష్ట్రం లో 20కి పైగా దేవాలయాలను ధ్వంసం చేసినప్పటికీ ఇంత వరకూ ఒక్కరి పై కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
 
ఇది ఇలా ఉండగా తాజాగా చోటు చేసుకున్న రామతీర్థం విషయం లోకి వస్తే.... రామతీర్థం ఆలయం విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద ఉంది. ఈ  రామతీర్థం లోని బోడికొండ పై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహం ఉంది. ఆ  విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరు చేశారు.  మంగళవారం ఉదయం అర్చకుడు వెళ్లే సరికి ఆలయ తలుపులకు తాళం లేక పోవడం తో అధికారులకు సమాచారం అందించారు.  వెంటనే తల భాగం కోసం పరిసరాల్లో వెతికినా ఎక్కడా దొరక లేదు. ఆఖరికి కొలను లో తలని గుర్తించారు. 
 
రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు: 
 
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు ఈ ఘటన పై స్పందించారు. రామతీర్థం ఘటనను రాజకీయం చేయడం సరి కాదని చెప్పడం జరిగింది. సనాతన ధర్మాన్ని పడగొట్టగలమన్న ఆలోచన కేవలం ముర్ఖులకే వస్తుంది అని చెప్పారు. గతం లో కూడా ఆలయాల పై  దాడులు చేసినా సనాతన ధర్మం అలానే ఉంది అన్నారు. వీలైనంత త్వరగా  రామ తీర్థం లో రాముడి విగ్రహం ప్రతిష్టించాలన్నారు. 
 
వరుస దాడులు జరగడానికి కారణాలేమిటి..?

 
తొమ్మిది నెలలుగా జనం లోకి రాని చంద్రబాబు...  ఒక్కసారిగా స్పీడ్ పెంచారు. విజయనగరం జిల్లా రామ తీర్థం లో విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడే ఆయన ఆందోళన నిర్వహించారు. ఇది ఇలా ఉండగా ఇటువంటి వాటి వెనుక కారణం ఏమిటి అని పరిశీలించి చూస్తే... అనేక సందేహాలు కలుగుతున్నాయి.  హిందుత్వ నినాదం తో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. అలానే ఆలయాల పై దాడులు జరుగుతుండటం తో హిందువుల్లో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  బీజేపీ కూడా   హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. మరి నిజం ఏమిటో తేలడం లేదు. 
 
బీజేపీ, వైసీపీ పార్టీల కుట్రలో భాగం గానే ఆలయాల పై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ ని బలహీనం చేస్తే ఏపీ లో తమకు అధికారం ఖాయమనే ఆలోచన లో బీజేపీ ఉందని చెబుతున్నారు. అలానే జగన్ కూడా  చంద్రబాబుని ముందు తొలగించాలని  బీజేపీ తో చేతులు కలిపాడనే చర్చ జరుగుతోంది. వీరు పన్నిన కుట్ర వల్లే  టీడీపీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు రంగం లోకి దిగారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఇలా అనేక విషయాల పై చర్చ జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్  పాకిస్తాన్ లా మారి పోతుందా  అని జనసేన పార్టీ చీఫ్, నటుడు పవన్ కళ్యాణ్ ఆశ్చర్య పోయారు. అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా తయారు అవుతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాల పై దాడులు, హిందూ దేవతలను అపవిత్రం చేయడం మరియు రథాలను తగల బెట్టిన సందర్భాలని చూస్తే మనం పాకిస్తాన్‌లో ఉన్నామా ? అని అడిగాడు. ఇది రాజకీయ స్లగ్‌ఫెస్ట్ మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితా ల్లోకి కూడా చొచ్చుకు పోయింది అని అన్నారు.
 
స్వార్ధ రాజకీయాల కోసం ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఇలా కుట్రల తో మార్చేస్తున్నారు అని  జనాలు మండి పడుతున్నారు. చంద్రబాబు పాలన లో లేని ఇబ్బందులని జగన్ పాలన లో చూస్తున్నాం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇప్పుడు మతం రాష్ట్రం లో రాజకీయ కేంద్రంగా మారి పోయింది.