BREAKING NEWS

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విరిసిన పద్మాలు...!

పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలని సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. ఎంతో శ్రమ, ఎంతో కష్టం, కళ ఉంటె కానీ అంత ఎత్తుకి ఎదగలేరు. నిజంగా ఇది గొప్ప విషయం. అలానే ప్రతీ తెలుగు వారు తెలుసుకొవాల్సిన విషయం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల విడుదల చేసిన సంగతి తెలిసినదే.  ఈ పద్మ అవార్డుల లో ఈ ఏడాదికి గాను ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మ భూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు విడుదల చేసింది. అయితే ఇందులో గొప్ప విషయం ఏమిటో తెలుసా....?  నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. వాహ్...! మెచ్చుకోదగ్గ విషయం కదా...! 
 
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి పద్మ విభూషణ్ :
 
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అనేక భాషలలో వేల పాటలతో అలరించారు. ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువ. ఈయన మరణం తెలుగు ప్రజలకి తీరని లోటు. బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా ఆయన మనకు దూరమైన పాట రూపంలో మన గుండెలలో నిలిచి ఉన్నారు. అయితే 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లో  స్థానం సంపాదించుకున్న గానగంధర్వుడు ఎస్పీ బాలు గారికి  భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

ఇది ఇలా ఉండగా ఈయన  ఇప్పటికే బాలు పద్మశ్రీ(2001), పద్మ భూషణ్(2011) అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. 102 పద్మశ్రీ అవార్డుల్లో.. దక్షిణాది నుంచి ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు తరవాత మూడు పద్మ అవార్డులను అందుకున్న కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. బాలు గారు పడిన పాటలు, ఆయన మాటలు ఎప్పటికి మరువలేము.
 
బాలు గారు 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రం లో మొదటి సారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడిగా నటించారు. ఇంకా ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం మొదలైన సినిమాల్లో నటించి మంచి పేరు పొందారు. నిజంగా ఇటువంటి ట్యాలెంటేట్ వ్యక్తికీ ఈ అవార్డు రావడం చాల గొప్ప విషయం. కాగా, ప్రముఖ గాయని చిత్ర (పద్మ భూషణ్), మరో ప్రముఖ గాయని బోంబే జయశ్రీ (పద్మశ్రీ) కు కూడా పద్మ అవార్డులు ప్రకటించారు.
 
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు:
 
ఇక పద్మశ్రీ అవార్డులు గురించి చూస్తే... కేంద్రం 102 పద్మశ్రీ అవార్డులని ప్రకటించగా... నలుగు అవార్డులు తెలుగు వారు సొంతం చేసుకోనున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు వీటిని అందుకోనున్నారు.  దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి అంటే సాధారణ విషయం కాదిది. అయితే మరి మన తెలుగు రాష్ట్రాల నుండి ఆ అవార్డులు ఎవరి దక్కాయి...? ఏ రంగం నుండి వచ్చాయి...? ఇలా పద్మ అవార్డులు గురించి అనేక విషయాలు మీకోసం...
 
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం పద్మశ్రీ అవార్డుని ప్రకటించగా ..  వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈ నలుగురి లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇక విరాళ లోకి వెళితే... అనంతపురం జిల్లాకు చెందిన అవధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశ్‌ రావు కి  పద్మశ్రీ అవార్డు దక్కింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో పద్మశ్రీ కి  ప్రకాశ్‌ రావు ఎంపికయ్యారు. ఇక పద్మ శ్రీ రావడం తో  ఆయన కుటుంబం సంబరాల్లో మునిగి పోయింది. ప్రకాశ్‌ రావు సీనియర్‌ సాహితీవేత్త. ఈయన ఇంతకూ ముందు ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలు  అందించడం జరిగింది. ఆ సేవలని గుర్తించి కేంద్రం పద్మ శ్రీ పురస్కారాన్ని ఇవ్వనుంది.
 
అలానే మరో పద్మ శ్రీ గ్రహీత ఏపీకి చెందిన ప్రముఖ కర్నాటక వయొలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి కి రావడం జరిగింది. అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ కళారంగం తరపున  పద్మ శ్రీ ని అందుకోనున్నారు. రామస్వామి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన వారు. నిజంగా ఎంత గొప్ప విషయంలో కదా..! 
ఇలా ఈయన సేవలని, కళ ని   గుర్తించి కేంద్రం పద్మఅవార్డుల్లో ఆయనకి  పద్మశ్రీకి ఎంపిక చేసింది. అలానే  అదే కళా రంగానికి చెందిన నిడుమోలు సుమతికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం.

ఈమె  కళారంగంలో మృదంగ కళాకారిణిగా విశేష సేవలు అందిస్తున్నారు. దీనితో సుమతీ మోహనరావును పద్మశ్రీతో కేంద్రం సత్కరించనుంది. నాల్గవ పద్మశ్రీ అవార్డు తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు దక్కింది. చిన్నప్పటి నుంచి గుస్సాడీ నృత్యంపై మమకారం పెంచుకొని ఆ కళారూపం అంతరించి పోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.  ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుకి ఎంపికయ్యారు.