BREAKING NEWS

యువజన దినోత్సవం : స్వామి వివేకానంద గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం..!

భారతదేశ జాగృతికి స్వామి వివేకానంద విశిష్ట కృషి చేశారు. ఆయన ఉపన్యాసాల ద్వారా భారత యోగా, వేదాంత శాస్త్రాలను ఏకంగా ఖండాలను దాటించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన గురించి భారత సమాజం గొప్పగా చెప్పుకునే లాగ అమెరికాలో, చికాగోలో, ఇంగ్లాండులో  ఆయన ప్రసంగాలని చెప్పారు. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతోంది.
 
సత్యాన్వేషణ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం లో ఒక సారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్ లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లారు. అక్కడ అయిన రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రసంగాలు శ్రద్ధగా విన్నారు. రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి పై పడింది. నరేంద్రుడిని చూసిన రామకృష్ణ పరమహంస తెలియని తాద్యాత్మతకు లోనయ్యారు. కొంత కాలం తర్వాత శిష్యుడిగా మారిపోయాడు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాల పై వ్యామోహం తగ్గి సన్యాసం తీసుకుని వివేకానందుడిగా మారిపోయాడు. ఆయన బోధనలు ఇప్పటికీ ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తాయి.
 
వివేకానందుడి జీవిత విశేషాలు :
 
స్వామి వివేకనంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా 1863 జనవరి 12 న విశ్వనాథ్ దత్తా భువనేశ్వరి దంపతులకు జన్మించారు. బాల్యం నుండి కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు వివేకానంద. ఏకసంతాగ్రహిగా వివేకానంద పేరు తెచ్చుకున్నారు. తత్వశాస్త్రం పాశ్చాత్య శాస్త్రాలను అభ్యసించే వాడు. సన్యాసుల పట్ల యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచే వాడు. వారు ఏదడిగినా సరే అని లేదనకుండా ఇచ్చేసేవాడు.

పుట్ట గానే పువ్వు పరిమళిస్తిందన్నట్లుగా చిన్నప్పటీ నుంచే అతనికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంక సాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తి తో ఉండేవాడు. మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొన లేక పోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. కానీ అవేమి నరేంద్రుని సంతృప్తి పరచలేదు. 
  
చికాగోలో వివేకానంద ప్రసంగం:
 
1893 లో చికాగో లో సర్వమత సమ్మేళనం జరిగింది. దానిలో పాల్గొని వివేకానంద ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ మీటింగ్ తర్వాత ప్రపంచ దృష్టి ఇండియా పై పడింది. వివేకానంద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించి తన ఉపన్యాసాల ద్వారా యావత్ ప్రపంచానికి భారతీయత గురించి తెలియ జేశాడు. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికా లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటి లోనూ భారత దేశం పట్ల గౌరవం ఏర్పడింది. అతను ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం వచ్చేసి ఓపికగా వినేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత తమ ఇళ్ళకు వివేకానందుడిని ఆహ్వానించి ఆదరించేవారు.
 
యువజన దినోత్సవం :
 
యువతే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దేశ భవిష్యత్ అంతా యువత మీద ఆధారపడి ఉంది. ఈ విషయం ప్రతి ఒక్క యువతీ యువకుడు గుర్తుపెట్టుకుని తీరాలి. కేవలం యువజన దినోత్సవాలు జరుపుకుంటే సరి కాదు. యువత ఎప్పుడు అన్ని రంగాల్లో ముందుండి ఆరోగ్యంగా ఉంది... తమ శక్తి సామర్థ్యాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లి.... అభివృద్ధి చెయ్యాలి. 
 
వివేకానందుడిగా మార్పు:

 
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. ఇక్కడ ప్రజలందరూ కూడా సోదరులు, సోదరీమణులు అయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఈయన భారత దేశం లో ఉన్న అన్న ప్రదేశాలని పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రం, ఒక కమండలము, శిష్యగణం మాత్రమే. ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా దర్శించాడు. దారి మధ్యలో గుడిసె లోన సత్రం లో నివసించేవాడు. కటిక నేల మీదనే నిద్రించే వాడు. కాలి నడకనే చాలా దూరం నడిచే వాడు చాలా సార్లు తన దగ్గర డబ్బులు కూడా ఉండేది కాదు.
 
స్వామి వివేకానందుని స్ఫూర్తి వచనాలు:
  
1. మందలో ఉండకు వందలో ఉండటానికి ప్రయత్నం చెయ్యి.
2. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.
3. కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు...
 
నిజంగా ఇలాంటి స్ఫూర్తి వచనాలు ప్రతీ ఒక్కరి జీవితం లో అనుసరించాలి. ఇలా చేస్తే ఎవరు కూడా జీవితం లో అక్కడే ఆగిపోరు. తమ గమ్యం వైపు వెళ్లడం, విజయం అందుకోవడం లాంటివి చెయ్యగలరు. 
 
వివేకానంద కోట్స్ మీకోసం: 

 
1. '' విజయం వరించిందని విర్రవీగకు 
       ఓటమి ఎదురైందని నిరాశ చెందకు 
       విజయమే అంతం కాదు
      ఓటమి తుది మెట్టు కాదు''
 
2  లేవండి! మేల్కొండి! గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.
 
3. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తి తో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు...
 
4 .  హృదయానికి మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే హృదయాన్నే అనుసరించండి....
 
5. ఇనుప కండరాలు 
ఉక్కు నరాలు 
వజ్ర సంకల్పం 
ఉన్న యువత ఈ దేశానికి అవసరం....