BREAKING NEWS

బర్ద్ ఫ్లూ రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి...!

ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. ఈ కరోనా వల్ల ఎంతో మందికి తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. అలానే  అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు సంగతి ఇక చెప్పక్కర్లేదు. అంత ఘోరంగా మారింది వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుండి కోలుకుంటుంటే... ఇప్పుడు ఈ బర్ద్ ఫ్లూ జనాలని ఇబ్బంది పెడుతోంది. కరోనా టీకాలు పంపిణీ చేస్తోంది అని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషిస్తున్న మనల్ని కాస్త మళ్లీ ఆందోళన కలిగించేలా చేస్తోంది ఈ కొత్త వ్యాధి. ఇప్పుడు ఎక్కడ చూసినా బర్ద్ ఫ్లూ ఇబ్బంది కలిగిస్తోంది. దీని వల్ల మనుషులకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతోంది. ఇలా  చాలా వరకు ప్రభావితం చేస్తోందట.
 
వెంగేరి లోని ఇంటి పక్షులని బర్ద్ ఫ్లూ చాలా ప్రభావితం చేస్తున్నట్లు కూడా మనకు తెలిసిందే. అసలు  బర్ద్ ఫ్లూ ఎందుకు వస్తుంది...?  ఎలా రక్షించుకోవాలి..?  దాని నుండి మనం ఎలా బయటపడాలి ఇలా అనేక విషయాలు మీ కోసం... మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే...  ఇది ఒక రకమైన ఇన్ఫ్లూయెంజా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఒక మనిషి నుండి మరో మనిషి కి చాలా అరుదుగా వ్యాపిస్తుంది. ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి.  ఇలాంటి కేసులు ఇటీవల  పెరిగాయి. వీటిలో H5N1 మరియు H7N9 ఉన్నాయి. ఈ రెండు జాతులు మానవులను తీవ్రంగా దెబ్బ తీశాయి. బర్డ్ ఫ్లూ మానవులను ప్రభావితం చేసినప్పుడు, అది ప్రాణాంతకం కావచ్చు
 
ఈ వ్యాధి మనకి ఎలా వ్యాపిస్తుంది...?
 
ఇప్పటికే టీవీల్లో అనేక పక్షులు చనిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని పై అవగాహన చాలా ముఖ్యం. ఈ బర్ద్ ఫ్లూ మనకి ఎలా వ్యాపిస్తుంది అనే విషయానికి వస్తే.... ఈ వ్యాధి సోకిన పక్షి తో సన్నిహితంగా ఉండడం ద్వారా ఇది కలుగుతుంది. ఈ వ్యాధి సోకిన మరియు బయట సోకిన చికెన్ వండడం తినడం చేయడం వల్ల కూడా ఇది వ్యాపించ వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని తీరాలి.
 
బర్డ్ ఫ్లూ లక్షణాలు:
 
బర్డ్ ఫ్లూ కలిగిన వాళ్లకు పలు లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు నుంచి ఏడు రోజుల్లో ప్రారంభమవుతాయి. చాలా సందర్భాల్లో జలుబు ఉంటుంది. మరి కొందరికి దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మరియు వికారం వాంతులు విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి. కండ్లకలక కూడా దీనిలో ఒక లక్షణమే. కనుక మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే తప్పక వైద్యుడిని సంప్రదించండి. మీరు ఏదైనా పొలాలు లేదా మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. జ్వరం లేదా శరీర నొప్పులు వంటివి కలిగినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీనిని దరి చేరకుండా ఉండగలం.
 
నీటి కాకులు, అడవి బాతులు మరియు సముద్ర పక్షులు వంటి వలస పక్షుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. టర్కీ కోళ్ళు మరియు బాతులుకి వ్యాపించి తద్వారా మనుషులకు కూడా సోకుతోంది. పక్షులు విసర్జన ద్వారా కూడా వ్యాపించవచ్చు. అపరిశుభ్ర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో తిరిగినపుడు కూడా ఇది వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. విస్తృతంగా ఇది వ్యాపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మేలు. ఇది చాలా అరుదుగా ఒక మనిషి నుండి మరొకరికి చేరుతుంది. ఎక్కువగా పక్షుల నుండి మనుషులకు వ్యాపించవచ్చు. పక్షులు ఈకలు, లాలాజలం లేదా విసర్జన వంటి వాటి ద్వారా సోకే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త డిస్టెన్స్ పాటించడం మంచిది.
 
బర్ద్ ఫ్లూ నుండి రక్షణ ఎలా తీసుకోవాలి..? 
 
ఈ వైరస్  రెండు నుంచి మూడు కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయగలదు. కానీ ఇది 56 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత తట్టుకో లేవు. కాబట్టి చికెన్ గుడ్లు వండినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాపించకుండా ఆపగలం. మీ  చేతుల్ని గోరు వెచ్చని నీరు మరియు సబ్బు తో కడుక్కోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకోవడానికి ముందు మరియు తర్వాత ఇలా శుభ్రంగా ఉండడం... పక్షులు మరియు పౌల్ట్రీ నుండి దూరంగా ఉండడం చేస్తే దీని నుండి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. వైరస్ సోకిన చనిపోయిన పక్షుల్ని తాకకండి.  పౌల్ట్రీలకి కూడా  వెళ్ళకండి. అలానే కొద్ది రోజులు పచ్చి గుడ్లు తినకండి. మాంసాహారాన్ని కొన్ని రోజుల పాటు మానుకోండి. ఇలా చేస్తే ఈ వ్యాధి నుండి మనం దూరంగా ఉండగలం. కనుక మీరు వీటిని అనుసరించండి... ఆరోగ్యంగా ఉండండి..