BREAKING NEWS

అందమైన కురుల కోసం ఈ చిట్కాలు పాటించాల్సిందే...!

చాలా మంది జుట్టు సంరక్షణ కోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు తెగిపోవడం లేదా చుండ్రు పట్టడం ఇలా  ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. నిజంగా జుట్టును తిరిగి బాగు చేయాలంటే పెద్ద సవాల్ అని చెప్పాలి. ఎన్ని చిట్కాలు పాటించినా తిరిగి మీ జుట్టు గతంలో లాగా లేదా...?  ఎన్నో ఔషధాలు వాడినా ప్రయోజనం కలగలేదా...?  అయితే ఈ చిట్కాలు మీ కోసమే మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
జుట్టు సంరక్షణకు కొబ్బరి పాలు:
 
జుట్టు సంరక్షణకు కొబ్బరి పాలు ఔషధంలా పని చేస్తుంది. ఇది నిజంగా అద్భుతం చేస్తుందని చెప్పాలి. మీకు ఆరోగ్యకరమైన జుట్టు రావాలంటే ఈ పద్ధతి ఉత్తమమైనది. కొబ్బరి పాలు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. కొబ్బరి పాల లో కొవ్వు, ప్రోటీన్లు, సోడియం, ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అంతే కాదండి దీనిలో విటమిన్ బీ 12, జింక్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇది తలలో రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది. అలానే  జుట్టు సమస్యల కి మంచి ఫలితం చూపిస్తుంది. అయితే మరి కొబ్బరి పాలను జుట్టుకి ఎలా ఉపయోగించా లో ఇప్పుడే చూడండి.
 
ఆరోగ్యకరమైన జుట్టు కోసం కొబ్బరి పాలు:
 
కొబ్బరి పాలని  నేరుగా మీ జుట్టుకి అప్లై చేయవచ్చు. దీని వల్ల ఏ హానీ కలగదు. మీరు కావాలంటే డైరెక్టుగా మాడుకు కూడా పట్టించవచ్చు. కానీ మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. తలపైన ఉండే ఫాలికల్స్ మరియు జుట్టు మూలాలను ఇది పోషిస్తుంది. అంతే కాకుండా అదనపు తేమ వంటి వాటి వల్ల జుట్టు అభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే దీని కోసం మీరు చేయవలసినది ఏమిటంటే...?  పావు కప్పు కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి మీ తలకు పట్టించండి. 15 నిమిషాల పాటు మసాజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు షాంపూ తో మీ జుట్టును కడిగేయాలి. ఇదే పద్ధతిని కనుక మీరు వారానికి ఒక సారి చేస్తూ ఉంటే మార్పు మీకే  కనబడుతుంది. మీ జుట్టు పెరగడం కూడా మీరు గమనించ వచ్చు.
 
తేనె మరియు కొబ్బరి పాలు:
 

ఎన్నో విధాలుగా మనం దీనిని ఉపయోగిస్తుంటాము. జుట్టు సంరక్షణ లో కూడా తేనే బాగా పని చేస్తుంది. తేనె లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. తేనే  వల్ల ఏమవుతుంది అంటే జుట్టు లో తేమను నిలుపుకోవచ్చు. దీని కోసం నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె చాలు. ఈ రెండిటినీ తీసుకుని బాగా కలపాలి. తర్వాత జుట్టుకు మసాజ్ చేయండి. ఇలా చేసి ఒక గంట నుండి రెండు గంటల పాటు అలా వదిలేసి షాంపూ తో కడగాలి. వారానికి ఒక సారి ఈ పద్ధతిని రిపీట్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
మెంతులు మరియు కొబ్బరి పాలు:
 
సాధారణంగా మెంతుల్ని కూడా జుట్టుకు రాసుకుంటూ ఉంటాము. దీని వల్ల మృదువుగా ఉంటుంది. మెంతిల లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు ఇది ముఖ్యమైన పదార్థం. జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు కూడా మెంతుల తో సాధ్యం. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడి మరియు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు తీసుకుని పేస్ట్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు దీనిని  మీ తలకు పట్టించండి. 30 నిమిషాల పాటు దీన్ని అలాగే ఉంచి షాంపూ తో కడగాలి. కండీషనర్ ని  కూడా ఉపయోగించుకో వచ్చు. ఇలా మీరు ఈ ప్రాసెస్ ని  ఒకటి లేదా రెండు సార్లు వారానికి చేయవచ్చు. దీని వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.
 
నిమ్మరసం మరియు కొబ్బరి పాలు:

 
నిమ్మ రసాన్ని సహజంగా తలకి రాసుకుంటూ ఉంటాము. నిమ్మరసం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనికి కొబ్బరి పాలు కలుపుకుంటే  జుట్టు సమస్యలకు మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది కూడా. జుట్టు రాలిపోయే సమస్య కూడా మీకు తగ్గుతుంది. ఒక గిన్నె లో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు మరియు రెండు టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలపాలి. దీనిని నాలుగు గంటల పాటు పక్కన ఉంచుకోండి. ఈ సమయం లో కొబ్బరి పాలు కొద్దిగా చల్లబరుస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కి రాయండి. ఒక 45 నిముషాల తరువాత షాంపూ తో శుభ్రం చేసుకోండి. దీన్ని మీరు వారానికి ఒక సారి చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీకు మరింత బెనిఫిట్ ఉంటుంది. ఇలా చేస్తే చాలు అందమైన కురులు మీ సొంతం.