BREAKING NEWS

రోడ్డెక్కనున్న ఉద్యోగులు

మొన్నటి వరకు రైతులు అమరావతిని రాజధానిగా చేయాలని ధర్నాలు, సభలు చేపట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు మరో సమస్య తలెత్తింది. ప్రభుత్వ ఉద్యోగులు తమకు జీతాలు పెంచాలని కోరారు. అందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి జీతాలు పెంచుతామని పీఆర్సీ జీవోను తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ జీవోకు వ్యతిరేకంగా ధర్నాలు, సమ్మెలు చేయడానికి సిద్ధం కానున్నారు. మరీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, ఏం నిర్ణయాలు తీసుకుంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఉద్యోగుల ఏం కావాలని కోరుకుంటున్నారంటే...   

పీఆర్సీ జీవోను ఆపివేసి డిసెంబర్ వరకు ఇంతకుముందు ఇచ్చిన విధంగానే నెల వేతనాన్ని ఇవ్వాలని సీఎస్ ను కోరారు. అందుకుగాను పీఆర్సీ సాధన సమితి కోసం 12 మంది సభ్యులతో కలిపి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడానికి గల కారణాలను ప్రభుత్వానికి వివరిస్తామని ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. అలాగే అశుతోషి మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వాలని కోరారు. సవరించిన వేతన (పే స్కేల్) అందించాలన్నారు. వీటితోపాటు గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతన (పే స్కేల్)ను అమలు చేయాలని వారి డిమాండులను చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దు చేయాలని, వారు చెప్పిన డిమాండ్లను ఒప్పుకోవాలని ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 5న సహాయ నిరాకరణ, 7న సమ్మెకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకు 24న జరగబోయే సమ్మెకు సంబంధించిన నోటీసులను ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలనుకుంటున్నారు.

25న ర్యాలీలు, ధర్నాలు, 26న అన్నీ తాలుకా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెలలో 27 నుంచి 30వ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు శాంతియుతంగా చేపడతామన్నారు. ఇవన్నీ చెబుతూనే ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు జిల్లాల కలెక్టరేట్లను ముట్టిదించేందుకు కొందరు ఉద్యోగులు ప్రయత్నించారు.

ఏపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే....

ఏపీ ప్రభుత్వం జీతాలను చెల్లించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను సీఎఫ్ ఎంఎస్ సిద్ధం చేసింది.

ఇంతకుముందు 70ఏళ్లు దాటిన పెన్షనర్లకు మరింత పెన్షన్ ఇవ్వగా, ఇప్పుడు 80 ఏళ్ల నుంచి ఇవ్వాలని సిఎస్ కమిటీ సిఫార్సు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ సిఫార్సు చేసింది.
  
బోధనేతర విద్యా సిబ్బందికి 5 రోజుల అదనపు సీఎల్ కు సిఫార్సు ఇచ్చింది.
రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.

కేబినేట్ నిర్ణయించిన ఆమోదాలు:-

ప్రభుత్వం ప్రకటించిన్ పీఆర్సీ జీవోను ఎప్పటిలాగే అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ నెల 25 నుంచి ‘ఈబీసీ నేస్తం’ ప్రారంభం కానుంది. దాని కోసం 580 కోట్ల ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని చెప్పారు.

మహమ్మారి కోవిడ్ తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ‘కారుణ్య నియామకం’ కింద ఉద్యోగం ఇస్తామన్నారు.

కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను మరొకరికి అప్పగించాలని నిర్ణయించారు.

నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడానికి బిడ్ ద్వారా 28 ఏళ్లపాటు వేరొకరి చేతిలో పెట్టనున్నారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల్లో ఉద్యోగులకు 10 శాతం, ఫించన్ దారులకు 5 శాతం రిజర్వేషన్ కు కేటాయిస్తామని  చెప్పారు. 

రాష్ట్రంలో 16 వైద్య కళాశాల్లను నిర్మించాలనుకుంటున్నారు. అందకు 7,880 కోట్లును ఖర్చు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

ఇప్పటివరకు ఉన్న 11 వైద్య కళాశాల్లను అభివృద్ధి చేయడానికి 3820 కోట్లను కేటాయిస్తామన్నారు.

5 వేల కోట్లు రుణాల సేకరణకు ఏపీ పౌరసరఫరాల శాఖకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

కోవిడ్ కోసం స్టాఫ్ ను తాత్కాలికంగా నియమించాలని  వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలను ఇచ్చింది.

ఏపీఐఐసీ నిర్వహణలో ఉన్న ఖాళీ భూములను ’ గ్రోత్ పాలసీ’ కింద వినియోగిస్తామని చెప్పారు.

ఐసీడీఎస్ లో బాలామృతం , పాల సరఫరాను అమూల్ సంస్థకు అప్పగిస్తున్నట్లు నిర్ణయించారు..

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు చేయడంతో రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్మును చెల్లించేలా వెసులుబాటును కల్పించామని చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు అంగీకారం తెలిపారు.

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.
బాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు తిరుపతిలో 5ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు 2018లో అప్పటి ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా నేతృత్వంలో 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించి కమిషన్ 23% ఫిట్ మెంట్ ఇచ్చే విధంగా అమలు చేశారు. ఇప్పటికే 27% శాతానికి పెంచింది.

ప్రస్తుతం సీఎస్ కమిటీ 7వ కేంద్ర వేతన సవరణ సిఫార్సుల ప్రకారం 14.29% ఫిట్ మెంట్ ఇస్తే చాలని చెప్పింది.