BREAKING NEWS

చరిత్రలో ఒకరు..!

ప్రతి ఒక్కరికి చరిత్రలో కొన్ని పేజీలుంటాయి. అలా చూసుకుంటే, ఎంతోమంది ప్రముఖులు చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వాళ్లలో చెప్పుకోదగ్గ పేరు... ఇదిరాగాంధీ, ఆమె పుట్టిల్లు నెహ్రూ కుటుంబమైతే… మెట్టిల్లు గాంధీ కుటుంబం… రెండు కుటుంబాలతో అమెకున్న అనుబంధం, రాజకీయాల్లో ప్రవేశం, ఇతర విశేషాల గురుంచి ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం:
 
జననం...

1917 నవంబర్ 19న 'ప్రయాగ' అనే నగరంలో జవహార్ లాల్ నెహ్రూ, కమలానెహ్రూ దంపతులకు జన్మించింది 'ఇందిరాగాంధీ'. పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. గంగా, యమున, సరస్వతీల సంగమ స్థానం అవ్వడంతో ఆ చోటును 'ప్రయాగ' అని పిలిచేవారు.

'నెహ్రూ' అనేది ఇంటి పేరు. వీరి పూర్వీకులు కాశ్మీరియులు కావడంతో వీరిది కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబంగా చెప్తారు.

1716 అప్పటి మొఘల్ చక్రవర్తి ఫరోక్షియర్. కాశ్మీర్ ను సందర్శించడానికి వచ్చినప్పుడు నెహ్రూ కుటుంబానికి చెందిన బహుభాషా వేత్త, ప్రజ్ఞావంతుడైన పండిత్ రాజకవుల గారిని కలవడం జరిగింది. ఆ చక్రవర్తి పండిత్ గారి ప్రతిభకి ముగ్ధులై, ఆయనను ఢిల్లీకి ఆహ్వానించారు. అక్కడ ఉండటానికి ఒక కాలువ పక్కన బంగ్లాను కేటాయించారు. రాజ కవులగారు నివసించిన బంగ్లా పక్కన ఉన్న కాలువను నెహార్ కాలువ అనేవారు. నెహార్ కాస్త నెహ్రూగా మారి వంశనామంగా స్థిరపడింది. అలా రాజకవులగారి ఇంటి పేరు నెహ్రూగా స్థిరపడిపోయింది.

రాజకవులకు ఇద్దరు కొడుకులు మోసరాంకవల్, సాహెబ్రాంకవల్.
మోసరాంకవల్, కొడుకు లక్ష్మీ నారాయణ. ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మొఘల్ చక్రవర్తి సమక్షంలో కోర్టులో వకీలుగా పని చేశాడు. లక్ష్మీ నారాయణ కొడుకు గంగాధర్ నెహ్రూ. ఈయనకి ముగ్గురు కొడుకులు. ఇందులో చివరివాడు మోతిలాల్ నెహ్రూ. మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ కూతురే ఇందిరాగాంధీ ప్రియదర్శని. ఇందిరాగాంధీతో పాటూ నెహ్రూగారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ అతను బాల్యంలోనే చనిపోయాడు. 
 
బాల్యం, విద్యాభ్యాసం...

ఇందిరాగాంధీ బాల్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతోంది. బ్రిటీష్ సహాయం పొందుతున్న పాఠశాలలకు భారతీయ పాఠశాల పిల్లలను పంపించకూడదని, కాంగ్రెస్ వాదులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో అక్కడినుంచి అలాహబాద్ లో ఉన్న జాతీయ పాఠశాలలో తన కూతురు ఇందిరాను చేర్పించారు.

అక్కడ బాగా చదువుకుంటుందని తాత మోతిలాల్ నెహ్రూ ఇందిరాను ఇంగ్లీష్ సిస్టర్ మిస్సెస్ కేయరా నడిపే పాఠశాలలో చేర్పించారు. ఇందిరాగాంధీ తల్లి ఆరోగ్యం బాగా క్షీణిచడంతో ఆమెను చికిత్స కోసం జెనివాకు తీసుకువెళ్లారు. అక్కడ చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. ఆపై ఇందిరాను అక్కడే ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించారు. 
జెనివాలో ఉంటుండగా ఇందిరా ఫ్రెంచ్ భాష నేర్చుకుంది. 
1927లో తిరిగి ఇండియాకి వచ్చింది. ఆ సమయంలో నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న నెహ్రూని, తన భార్య కమలాదేవిని బ్రిటీష్ వారు అరెస్ట్ చేశారు. ఆనంద్ భవన్ లో ఇందిరా ఒంటరిగా ఉండేది. ఆమె ఒంటరితనాన్ని పోగొట్టడానికి నెహ్రూ జైలు నుంచి ఉత్తరాలను రాస్తూ ఉండేవారు.
1928 నాటికి కుష్టు నివారణ కార్యక్రమం చేస్తూ, బట్టలు, ఆర్థిక సాయం అందించడానికంటూ 6 మైళ్ల దూరం వెళ్లి వచ్చేది.

అదే సమయంలో గాంధీ స్థాపించిన, చేరకా సంఘంలో బాల విభాగాన్ని ప్రారంభించారు. ఆమె పిల్లలందరిని కలిపి 'వానర సేన' అనే పేరు పెట్టి కాంగ్రెస్ సంస్థకు ఎంతో సహాయం చేసింది. 1931 మే 6న మోతిలాల్ నెహ్రు కన్నుమూశారు. అదే సమయంలో గాంధీజిని యారవాడ జైలులో బంధించినప్పుడు ఆయనను చూడడనికి ఎక్కువగా అక్కడికి వెళ్లేది. 

1934లో మెట్రిక్ పరీక్ష పాసయ్యింది. కొన్ని రోజులకు నెహ్రూ జైలు నుంచి బయటకి వచ్చాక కలకత్తాలో రవీంద్రనాధ్ ఠాగూర్ గారు స్థాపించిన శాంతినికేతన్ లో ఆర్ట్స్ లో చేరింది. ఇక్కడ ఇందిర లలిత కళలపై ఎక్కువ శ్రద్ధ చూపించారు.

73 సంవత్సరాల రవీంద్రనాధ్ ఠాగూర్ గారి వద్ద పెయింటిగ్ నేర్చుకుంది. ప్రసిద్ధ నాట్యాచారులు శ్రీ నలవకుమార్ వద్ద మణిపూర్ నృత్యం నేర్చుకుంది.
వాళ్ల అమ్మగారి ఆరోగ్యం మరింత క్షీణిచడంతో ఆమె రవీంద్రనాధ్ ఠాగూర్ అనుమతి అడిగి తిరిగి అలహాబాద్ కు వెళ్లింది.

1935లో ఇందిరాగాంధీ వాళ్ల అమ్మగారిని బువేరియాలో బెడన్ వేలర్ కు తీసుకువెళ్లింది.
ఆ సంవత్సరం ఫిబ్రవరి 28న కమలాదేవీగారు మరణించారు. 
 
వివాహం...

ఆమె తల్లి మరణించిన దుఃఖంలో ఉండగా, ఫెరోజ్ గాండే ఓదార్చారు. అప్పుడూ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

1937లో లండన్ నుంచి ఇండియా వచ్చి తండ్రి దగ్గర రాజకీయ పరిస్థితులను అవగతం చేసుకొంది.

1938లో నెహ్రూ ఇందిరను భారతదేశానికి తీసుకువచ్చి, కాంగ్రెస్ లో సభ్యత్వం ఇప్పించారు.

1939లో స్విట్జర్లాండ్ వెళ్లింది. అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. 

1940లో భారత్ కి రావాలనుకుంది. 

1941లో లండన్ నుంచి ఇండియా కు ఫెరోజ్ గాండే తో  వచ్చారు. 

1942 సెప్టెంబర్ లో ఇందిరా గాంధీగారు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను ఏర్పాటు చేసిన కారణంగా ఆమెను 9 నెలలు పోలీసులు జైలులో ఉంచారు.

జైలు నుంచి తిరిగి వచ్చాక, 1943 మార్చి 26న ఇదిరాగాంధీ ఫెరోజ్ గాండే వివాహం ఆనంద్ భవన్ లో నిడారంబరంగా జరిగింది. 

పెళ్లి అయ్యాక ఫెరోజ్ గాండే గాంధీగారి మీదున్న అభిమానంతో 'గాండే'గా ఉన్న ఇంటి పేరును 'గాంధీ'గా మార్చుకున్నారు.

1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించగా, 
1946 డిసెంబర్ లో సంజయ్ గాంధీ జన్మించారు. 
1964 మే 27న ఫెరోజ్ గాంధీ కన్నుమూశారు.
 
పదవులు- గుర్తింపు

నెహ్రూగారు చనిపోయాక లాల్ బహుదూర్ శాస్త్రి గారికి ప్రధానమంత్రి పదవిని ఇచ్చారు.
1966లో లాల్ బహుదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఇందిరా గాంధీని ప్రధానమంత్రిని చేశారు. ఈమె ప్రధానమంత్రి కావడంలో, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది. అలా 1966 జనవరి 24న అధికారికంగా ఇదిరాగాంధీ మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 
1970 జూన్ 26 వరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.
1970 జూన్ నుంచి కేంద్ర హోంశాఖమంత్రిగా,
1971 మార్చి నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.
1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను స్వీకరించింది.
1980లో జనవరి నుంచి కేంద్ర రక్షణశాఖ మంత్రిగా,
1983-84లో రష్యా దేశపు లెనిన్ బహుమతి సైతం లభించింది.
 
మరణం...

ఈమె1984 అక్టోబరు 31న మరణించారు. ఆరోజున న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో సమయం 9:20 అవుతుంది. ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరా గాంధీని ఇంటర్వూ చేయడానికి గార్డెన్ లో వేచి ఉన్నాడు. అక్కడే ఇద్దరూ బాడీగార్డ్స్ ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరా గాంధీగారు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. పెరట్లోకి రాగానే అక్కడున్న ఇద్దరిలో ఒక బాడీగార్డ్ తన దగ్గరున్న గన్ ను తీసి ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్లను వరుసగా షూట్ చేశాడు.

ఆ బుల్లెట్లు తగలగానే ఇందిరాగాంధీ అక్కడికక్కడే  కుప్పకూలింది. రెండవ బాడీగార్డ్ తన దగ్గరున్న తుపాకీతో 30 బుల్లెట్లను షూట్ చేశాడు. 23 బుల్లెట్లు ఆమె బాడీలో నుంచి బయటకి చొచ్చుకొని వచ్చాయి. మిగతా 7 బుల్లెట్లు ఆమె బాడీలోనే ఉన్నాయి. ఇందిరాగాంధీని హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు ఇందిరాగాంధీ చనిపోయారని వైద్యులు తెలిపారు.
 
ఎమర్జెన్సీ కాలం...

1966-77ల మధ్య కాలంలో రెండు పరిణామాలు జరిగాయి. 
అందులో మొదటిది, పాకిస్థాన్ పై భారత్ యుద్ధంలో గెలవడం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ ఏర్పడటంలో ఇందిరాగాంధీ ప్రముఖ పాత్ర పోషించింది.

1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా గాంధీ గెలిచారు. కానీ ఓటర్లకు డబ్బులిచ్చి ఓటు వేయించుకున్నారనే ఆరోపణతో రాజనారాయణ్, ఇందిరా గాంధీ పైన హైకోర్టులో కేసు వేశాడు.

1975లో దీనిపై తీర్పు వచ్చింది. 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పు ఇచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ఆ తీర్పును సుప్రీంకోర్టులో ఆప్పియర్ వేసింది. 

ఇందిరా గాంధీని పీఎంగా కొనసాగించవచని సుప్రీంకోర్టు చెప్పింది.1975లో ఎమర్జెన్సీని స్పష్టం చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును  నిరసిస్తూ అపోజిషన్ పార్టీ తరఫువాళ్లు బంద్ లు పాటించారు. ఇలా చేయడంవల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు. అందుకనీ ఎమర్జెన్సీని ప్రకటించింది. అంటే దేశమంతా పీఎం చేతిలోకి వచ్చింది.

ఇదిలా ఉండగా, పంజాబ్ లో సిక్కు మతానికి చెందిన బృందన్వలె అనే వ్యక్తి హిందువులను చంపుతూ పోతున్నాడు. కారణం సిక్కులకు కాళిస్తాన్ అనే పేరుతో ప్రత్యేక దేశం కావాలని ప్రభుత్వాన్ని అడిగాడు. అది సాధ్యం కాకపోవడంతో 1984లో సిక్కులు చాలామంది హిందూవులను చంపారు.

ఇతన్ని అరెస్టు చేయడానికి వీలు లేకుండా గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్నారు. ఆ టెంపుల్ లో ఉంటూ, పాకిస్థాన్ నుంచి ఆయుధాలను తెప్పించుకునేవాళ్లు. 
అప్పుడు ఇందిరాగాంధీ ఇండియన్ మిలటరీని గోల్డెన్ టెంపుల్ కి పంపించింది. అప్పుడు మిలటరీ వాళ్లతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాని పేరే ఆపరేషన్ బ్లూ స్టార్. జూన్ 5న గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టి బాంబులు, హెవీ గన్ లతో దాడి చేశారు. ఈ ఆపరేషన్ 1984 జూన్10న ముగిసింది. 

ఇందులో 83మంది సైనికులు, 493 మంది మిలిటెన్స్ చనిపోయారు. అందుకనీ దానికి ప్రతిగా కక్ష గట్టి, ఇందిరాగాంధీని ఆ ఇద్దరూ సిక్కు బాడీగార్డులు కాల్చి చంపేశారు.