BREAKING NEWS

తెలుగు రాష్ట్రాలకు దక్కిన పద్మశ్రీ పురస్కారాలు

కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అలాంటి సమయంలో టీకాలను తయారు చేసారు ఈ దంపతులు. సైన్యంలో చేరి యుద్ధభూమిలో ఎన్నో సవాలను ఎదుర్కొని సీడీఎల్ జనరల్ బిపిన్ రావత్ కు, టెక్ దిగ్గజాలలో బాధ్యతలు వహిస్తున్న ప్రముఖులకు, ప్రవాస భారతీయులకు ఈ అరుదైన పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి నృత్య, సంగీత కళాకారిలకు, ప్రవచనాలు భోదించే ప్రముఖ వ్యక్తికి, రాజకీయ నాయకులకు ఈ పురస్కారాలు వరించాయి. కొందరికి మరణాంతరం పద్మ శ్రీ అవార్డులు దక్కాయి.

ఎవరెవరికి ఈ పురస్కారాలు వచ్చాయంటే...

కేంద్ర ప్రభుత్వం జనవరి 25న (మంగళవారం రాత్రి) పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మాజీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, రాధేశ్యాం ఖేమ్కా, ప్రభా ఆత్రే ఈ నలుగురికి పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించింది.

కోవిడ్ బారిన పడకుండా కోవాగ్జిన్ టీకాను తయారుచేసిన భారత్ బయోటిక్ అధినేతలు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, కోవిషీల్డ్ టీకా తయారీదారుడు సీరం ఇనిస్టిట్యూట్ అధినేత సైరస్ పునావాలా, టెక్ దిగ్గజ సంస్థల్లో భాద్యతలను నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల, గూగుల్ కు సుందర్ పిచాయ్, రాజకీయ నేతలు గులాం నబీ ఆజాద్, బుద్ధదేవ్ భట్టాచార్యలతో కలిపి మొత్తం 17 మందికి పద్మభూషణ్ లు ఇవ్వనుంది.

107 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. మూడు పద్మ పురస్కారాల విభాగంలో  128 మంది కాగా, అందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్ కు 3 దక్కాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్ లో ఈ పురస్కారాలకు ఎంపికైన వారికి ఆయా విభాగంలోని అవార్డులను అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్:-

ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహరావు. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణ రావు. భద్రాచలం సీతారమస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్ హుస్సేన్ మరణాంతరం ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 

తెలంగాణ:-

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య. గిరిజన జానపద కళాకారుడు, బీమ్లానాయక్ సినిమాలోని పాటను కూడా పాడారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోయ గిరిజన గాయకుడు రామచంద్రయ్య.
కాకతీయ నృత్యకళకు నేర్పిస్తున్న కూచిపూడి నృత్యకారిణి, గురువు పద్మజారెడ్డిలకు ఈ పురస్కారం వరించింది.

ప్రముఖ సినీనటి షావుకారు జానకికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ లు అభినందనలు తెలిపారు.

ఈ పురస్కారాల్లో మహిళలు:-

ఈ పురస్కారాలకు ఎంపికైన వారిలో 34 మంది మహిళలు ఉండగా, 10 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. మొత్తం అవార్డుల్లో ఉత్తర్ ప్రదేశ్ కు 13, మహారాష్ట్రకు 10 పురస్కారాలు దక్కాయి. ఇందలో 13 మంది చనిపోయాక వీటిని ప్రకటించారు.

పద్మవిభూషణులు పొందిన వారు... :-

ప్రభా ఆత్రే మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు. ఈమె 1990లో పద్మశ్రీ, 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2020లో పద్మభూషణ్ అవార్డులు అందుకుంది.

జనరల్ బిపిన్ రావత్ డెహ్రాడూన్ లో సైనిక శిక్షణ కేంద్రంలో చేరారు. 2020 జనవరిలో భారత తొలి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమితులయ్యారు. 2021 డిసెంబర్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఎన్నో యుద్ధ సమయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కళ్యాణ్ సింగ్ రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. యూపీ ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ గవర్నర్ గా సేవలందించారు. ఈయన గత ఏడాది ఆగస్టులో మృతి చెందారు.

రాధేశ్యాం ఖేమ్కా సాహిత్యాన్ని, మహా పురాణాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పేవారు. పాత్రికేయుడిగా పనిచేసారు. 2021 లో ఏప్రిల్ లో మరణించారు.

పద్మభూషణులు పొందిన వారు...

పశ్చిమ బెంగాల్ సినీ నటుడు విక్టర్ బెనర్జీ.

పంజాబ్ జానపద కళాకారుడు గుర్ మీత్ బావా.

ప్రపంచ ప్రఖ్యాత షెఫ్, ఫుడ్ జర్నలిస్టు అమెరికా మాధుర్ జాఫ్రీ.

రాజస్థాన్ పారా ఒలింపిక్ జావెలిన్ త్రో అథ్లెట్ క్రీడాకారుడు దేవేంద్ర ఝఝారియా.

ఉత్తరప్రదేశ్ హిందూస్థానీ సంగీత కళాకారుడు రషీద్ ఖాన్.

మెక్సికో ప్రపంచ ప్రఖ్యాత గోధుమవంగడ శాస్త్రవేత్త సంజయ రాజారాం.

ఒడిశా రాష్ట్రంలోని ఒడియా రచయిత క్వీన్ అఫ్ ఒడియా లిటరేచర్ ప్రతిభా రే.

గుజరాత్ రచయిత, తాత్వికుడు, సంఘ సంస్కర్త, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడంలో ప్రసిద్ధి చెందిన స్వామి సచ్చిదానంద.
ఉత్తరప్రదేశ్ ప్రముఖ న్యాయకోవిదుడు వశిష్ట్ త్రిపాఠి.

మాజీ కాగ్, సివిల్ సర్వీస్, కేంద్ర హోంశాక మాజీ కార్యదర్శి రాజీవ్ మహర్షి.

పాక్ సైనికుడికి పద్మ పురస్కారం..

పాక్ సైన్యంలో చేరిన ఖాజీ తిరిగి ఇండియా బోర్డర్ కు వచ్చాడు. పాక్ సైనికుల స్థావరాలను కనిపెట్టి మ్యాప్ ద్వారా భారత్ సైనికులకు తెలియజేసారు. పాకిస్థాన్ గురుంచి ఎన్నో కీలక విషయాలను తెలియజేసారు. రిటైర్మెంట్ తీసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ ఖాజీ సజ్జద్ అలీ జహీర్ కి ఇప్పుడు పద్మ శ్రీ అవార్డు వరించింది.