BREAKING NEWS

షార్ట్ కట్ షార్ట్ ఫిల్మ్..

షార్ట్ ఫిల్మ్.... రీసెంట్ టైం లో యూ ట్యూబ్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి... యూత్ ఎవరి దగ్గర విన్నా షార్ట్ ఫిల్మ్స్ డిస్కషన్ మాత్రమే వినిపిస్తోంది.

షార్ట్ ఫిల్మ్ హీరోయిన్, షార్ట్ ఫిల్మ్ యాక్టర్, డైరెక్టర్ ఇలా సినిమాల్లో  ఉపయోగించే 24 క్రాఫ్ట్స్ ను కూడా షార్ట్ ఫిల్మ్స్ లో ఉపయోగించుకుంటున్నారు. అద్భుతమైన చిత్రాలు రూపొందిస్తున్నారు... వారిలోని సృజనాత్మకతను వెలుగు తీస్తున్నారు... ఫీచర్ ఫిల్మ్ కు వెళ్ళాలి అనుకునే వారికి షార్ట్ ఫిల్మ్ ది బెస్ట్ ఆప్షన్....

దాదాపు పదేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే ఎంతో కష్టపడే వాళ్లు... కెమెరా ఒక దగ్గరా, మ్యూజిక్ ఒక దగ్గరా, లైటింగ్ ఇలా ఎన్నో ఇబ్బందులు అయినా సరే సినిమా మీద మక్కువతో కష్టపడే వాళ్లు... బెస్ట్ ఔట్ పుట్ అందించేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందింది... చెందుతోంది కూడా... ఇప్పటి యువత సాంకేతికతను అడాప్ట్ చేసుకుంటోంది. ఒకప్పుడు కెమెరా కోసం పరుగులు పెట్టిన వారే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్ ను డైరెక్ట్ చేస్తున్నారు..

సరదాగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఎంతో మంది నటులు ఇప్పుడు వెండి తెరపై మెరిసిపోతున్నారు. ఫీచర్ ఫిల్మ్స్ తీయాలి అన్నా, మన టాలెంట్ నిర్మాతలకు, దర్శకులకు తెలియాలి అన్నా మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ షార్ట్ ఫిల్మ్/వెబ్ సిరీస్.

చేతిలో 5 డీ కెమెరా ఉంటే చాలు... ఒక మంచి షార్ట్ ఫిల్మ్ రెడీ. రామ్ గోపాల్ వర్మ 5 డీ కెమెరాతో 5 రోజుల్లో సినిమా తీసేసాడు... అదే ఆదర్శంగా తీసుకున్న నేటి యువత 5 డీ కెమెరాను తమ ప్రధాన కెమెరా గా షూటింగ్స్ జరుపుతున్నారు... 

షార్ట్ ఫిల్మ్ అనే మాట మనం ఇప్పుడు వింటున్నాం గాని అప్పట్లో మాత్రం అసలు ఉండవు అనే అనుకుంటున్నారు కదా... కానీ ఇది తప్పు.... ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ అనే అనేవి 1894 నుంచి తీస్తున్నారు.. సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ 40 నిమిషాల లోపు ఉండాలి..

ఒక్కోసారి ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో షార్ట్ ఫిల్మ్స్ ముగుస్తూ ఉంటాయి... ఇండోనేషియా, కెనెడా లాంటి ప్రాంతాల్లో కూడా షార్ట్ ఫిల్మ్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారు.. 

షార్ట్ ఫిల్మ్స్ కి జోనర్ తో సంబంధం లేదు. కామెడీ , లవ్, హార్రర్ , సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా వాళ్ళకి నచ్చిన టాపిక్ తో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అద్భుతమైన కథ ఉంటే చాలు , యూట్యూబ్ లో కింగ్ అయిపోవచ్చు....

ఫీచర్ ఫిల్మ్స్ లో చుపించలేని ఎన్నో అంశాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా చూపించగలం.. ఎంతో మంది, షార్ట్ ఫిలిం ద్వారానే తెలుగు తెరకు పరిచయం అయ్యారు...ముఖ్యంగా ఎంతో మంది నటులు కూడా యుట్యూబ్ నుంచి వెండితెర, బుల్లితెరకు ప్రమోషన్ కొట్టేశారు... డైరెక్టర్ సుజిత్, హీరో రాజ్ తరుణ్ ఇలా ఎంతో మంది షార్ట్ ఫిల్మ్స్ టూ ఫీచర్ ఫిల్మ్ ఛాన్స్ కొట్టిన వారే.... 
 

Photo Gallery