BREAKING NEWS

ఓల్డ్ ఈజ్ గోల్డ్....

“మన గలిగినదీ.. కాలానికి నిలబడగలిగినిదీ వద్దన్నా పోదు..మరణించిన అవ్వనగలు మన కాలేజీ అమ్మాయి ఎంతపోరినా పెట్టుకోదు'..అంటాడు కవి తిలక్‌. ఇంట్లో ఉన్న పాత పందిరి మంచం, పడక్కుర్చీ, తాతగారి చేతికర్ర... అమ్మో, అమ్మమ్మో ధరించిన కాసులపేరు... ఇవేవీ ఇప్పటితరం వాడుకునేందుకు, ధరించటానికి తగిన వస్తువులు కాదన్నది కొందరి అభిప్రాయం.

కానీ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నది పెద్దల మాట. ఆ మాట నిజమే. ఆ క్వాలిటీ, ఆ సొగసు, ఆ సౌందర్యం ఇప్పటి వస్తువుల్లో కనిపించవు. పాతపడే కొద్ది ఓ పుస్తకానికో వస్తువుకో ఉండే వాల్యూయే వేరు.

పురాతన వస్తువులను “'యాంటిక్‌” అంటారు. ఇప్పటి కాలంలో యాంటిక్‌ జ్యూయలరీ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. సిటీలో పాత వస్తువులను కలెక్ట్‌ చేసే హాబీ కూడా ఉంది కొంతమందికి. ఎక్కడ ఏ పాత వస్తువు కనిపించినా వెంటనే అది వాళ్ల ఇంట్లో ఉండి తీరాల్సిందే.

              పాత వస్తువులను సేకరించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం ఒక రకంగా జీవిస్తున్నాం. కానీ మన ముందు తరాల వారు ఎలా జీవించేవారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా కేవలం పుస్తకాల్లో రాసింది మాత్రమే చదివేవాళ్ళు... కానీ ఇలాంటి మ్యూజియం వలన మన కళ్ళతో మనమే వారి జీవన విధానానికి సంబంధించిన ఆనవాళ్లను చూసే ఏవీకసం ఇంటుండిం..

దీంతో మన ముందు తరం వాళ్ల జీవన విధానం ఎలా ఉండేది. వాళ్లు ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారు? వాటి నాణ్యత ఎలా ఉండేది? లాంటి విషయాలు ఇప్పటి మన విధానాలతో పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది... వాటి చరిత్ర కూడా తెలుసుకోవచ్చు. అప్పటికి ఇప్పటికీ సమాజం ఎలా అభివృద్ధి చెందిందో , ఎలాంటి మార్పులు వచ్చాయి తెలుసుకోవచ్చు.

            మనం కూడా మామూలు మనుషులమే... అన్ని విషయాలు మనకు తెలియాలి అన్ రూల్ ఏమీ లేదు కదా. కానీ ఈ చరిత్ర వలన, మ్యూజియం వలన మనకి తెలియని ఎన్నో విషయాలు ఆధారాలతో సహా తెలుసుకోవచ్చు. కొన్ని అంతుచిక్కని ప్రశ్నలకు సైతం
చరిత్రలో సమాధానాలు దొరకచ్చు. కనీసం ఒక్క
రోజైనా చరిత్ర గురించి,చారిత్రక వస్తువుల
గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.. మన సిటీలో పబ్లిక్‌ లైబ్రరీలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్లి పుస్తకాలు చదవండి. చరిత్ర, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చూడండి... హిస్టారికల్ చానల్స్‌ చూడండి. మీ కుటుంబానికి సంబధించిన పాత విషయాలు పెద్దవాళ్లని అడిగి తెలుసుకోండి. 

              ఈ రోజుల్లో యాంటిక్ వస్తువులకు డిమాండ్ బాగానే ఉంది. ఇంట్లో ఉపయోగించే చిన్న వస్తువు దగ్గర నుంచి కార్లు, బిల్డింగ్ ల వరకు అన్నీ యాంటిక్ మోడల్స్ లో , వీలైతే నిజంగా ఆ పాత తరం వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు... మీ దగ్గరో ఏమైనా యాంటిక్‌ వస్తువులు ఉంటే వాటి దగ్గరకు వెళ్లండి. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోండి.

ఇవన్నీ ఒక్కసారి ట్రై చేసి చూడండీ. ఇక చాలు అన్నా ఆగాలి అనిపించదు మీకు...  ఇంకా తెలుసుకోవాలనే ఉంటుంది. మనం ఇప్పుడు పాత కాలం వస్తువులు అంటున్నాం. కానీ మన పిల్లలకు మన కాలం పాతకాలం అయిపోతుంది. మనం 'ప్రస్తుతం'లో ఉన్నాం.

మన పిల్లలు 'భవిష్యత్తు'లో ఉన్నారు. మనం ఇప్పుడు వాడుతున్న డీ.వి. డీ లు వాళ్లకి ఓల్డ్‌ స్టఫ్‌గా అయిపోతుంది. ప్రస్తుత టెక్నాలజీకే చాలా వస్తువులు ఓల్డ్‌గా మారిపోయాయి.
మనకు తెలియని విషయం ఏమిటంటే ఈ రోజు వస్తువు కొన్నాళ్లకు యాంటిక్‌ అయిపోవలసిందే....
                           మన స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో కూడా చాలా రకాల మ్యూజియంలు ఉన్నాయి. ఇదివరకు మ్యూజియం అంటే కేవలం పాత వస్తువులు మాత్రమే పెట్టే స్థలంగా భావించేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ అర్థం మారిపోయింది. బయట ప్రపంచానికి తెలియని, సామాన్యులు చూడలేని వస్తువులను కూడా మ్యూజియం లలో ఏర్పాటు చేస్తున్నారు.

వాటికి ఉదాహరణే ఆర్కే బీచ్ లోని "కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం". . సబ్ మెరైన్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. సముద్రం అడుగు భాగంలో ఎలా ప్రయాణిస్తుంది. దాని పనితీరు లాంటి విషయాలు అన్నీ ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.

ఇక ఈ మధ్య ఏర్పాటు చేసిన "టియు 142 యుద్ధ విమాన మ్యూజియం" కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గగన తలంలో విన్యాసాలు చేసి అలసిపోయిన ఈ విమానం ప్రజలకు అందుబాటులో ఉంచారు. పైలట్ కూర్చునే కాక్ పిట్ నుంచి మిస్సైల్స్ ఎలా వదులుతారు లాంటి వివరాలు అన్నీ ఈ మ్యూజియంలో చూడచ్చు.

ఇక గిరిజన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే అరకు ట్రైబల్ మ్యూజియం, వివిధ రకాల కాఫీ ల గురించి కాఫీ మ్యూజియం వెళ్తే చాలు... చూశారుగా ఎన్ని రకాల మ్యూజియం లు ఉన్నాయో.... ఈ సారి వైజాగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీ టూర్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి....  
 

Photo Gallery