BREAKING NEWS

హైదరాబాద్ మెట్రో- రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారా

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లిఫ్ట్ లో యువత రొమాన్స్.... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్... సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా, ఎవరి దగ్గర విన్నా ఇదే టాపిక్... ఇంతకీ ఈ విషయంలో తప్పు ఎవరిది... లిఫ్ట్ లో సీసి కెమెరాలు ఉంటాయి అనే ఆలోచన కూడా లేకుండా పబ్లిక్ ప్లేస్ ను ప్రైవేట్ ప్లేస్ గా వాడుకున్న యువత దా?? అంత బరితెగించేలా ఉన్నా పట్టించుకోని తల్లిదండ్రులుదా? సీసీ ఫుటేజ్ బయటకు  తీసుకు వచ్చిన వారిదా?? అది ప్రసారం చేసిన మీడియా దా???

ప్రేమ, కాదల్, ఇష్క్... పేరు ఏదైనా భావం ఒక్కటే... ఒకప్పుడు స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండేది... కానీ ఇప్పుడు ఆ పదానికే అర్థం మారిపోయింది.. సారీ సారీ మార్చేస్తున్నారు... నిజమైన ప్రేమ అనే పదానికి అర్థం లేదు. ఇప్పుడు అంతా కేవలం ఆకర్షణ తప్ప నిజమైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. ఏదో నాకు ఒక బాయ్/గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. ఆ ప్రేమ ముసుగులో హద్దులు మీరి  మరీ విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. తాము ఎక్కడ ఉన్నారో కూడా మరచిపోయి బిహేవ్ చేస్తున్నారు. కాస్త సమయం దొరికితే చాలు... రొమాన్స్ లోకి దిగిపోతున్నారు. ఒకప్పుడు పార్క్ లు, సినిమా హాళ్లు ఈ సో కాల్డ్ ప్రేమికులకు బాగా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో లిఫ్ట్ లు కూడా చేరిపోయాయి. లిఫ్ట్ లో వెళ్లే ఆ కొంత సమయం మాత్రం ఎందుకు వృధా చేసుకోవాలి అనుకున్నారేమో... వాళ్ళ పని కానిచ్చేస్తున్నారు.

ఈ విషయం బయటకు తెలియగానే మీడియాలో ప్రచారం కూడా జరిగింది. యువత చెడు తోవలో పయనిస్తున్నారు అని హెచ్చరించేందుకు ఇలాంటి ఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు మీడియా... అయితే మీడియా పై కూడా కొంత మంది నెటిజన్లు ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. 

" మీడియాకు వేరే న్యూస్ ఏమీ లేదా"," ఇలా ప్రసారం చేస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి", "రేటింగ్స్ కోసం ఏమైనా చేస్తారా"... ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పోస్ట్ లు పెడుతున్నారు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీడియాకు వేరే న్యూస్ లేక కాదు. ఇది కూడా ఒక న్యూస్ కాబట్టి... నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు పబ్లిక్ లో చేస్తే అది కచ్చితంగా ఒక వార్త అవుతుంది. ఇక వారి భవిష్యత్ , ఇంటి పరువు గురించి మాట్లాడే వాళ్లు... ఆ విద్యార్థుల భవిష్యత్తు, పరువుపై వారికే లెక్క లేదు...ఇక మీడియాకు ఎందుకు? పైన సీసీ కెమెరా ఉంది అని చూసి కూడా ఏ మాత్రం విచక్షణా, ఆలోచన లేకుండా వాళ్ళు చేసిన పనిని ఎలా సమర్ధిస్తారు... అయినా ముఖాలకు బ్లర్ చేసే ప్రసారం చేస్తున్నారు గాని నేరుగా ఫేస్ చూపించడం లేదు.  ఒక వేళ అక్కడ సీసీ కెమెరా లేదు అనుకుందాం...  ఎవరో ఒక ఆకతాయి సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేసి నెట్ లో అప్ లోడ్ చేసేస్తే? అప్పుడు ఓకే నా?? కనీసం ఆ మాత్రం భయం కూడా లేదా వాళ్ళకి?? "లిఫ్ట్ లో ఎవరు లేనప్పుడు చేసుకున్నారు. అప్పుడు అది ప్రైవేట్ ప్లేస్ అవుతుంది. ఎలా తప్పు అంటారు.." అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మనుషులు ఉన్నా , లేకపోయినా రోడ్లు, బస్సులు, మెట్రో స్టేషన్ లు, అక్కడి లిఫ్ట్ లు అవన్నీ పబ్లిక్ ప్లేస్ లే... నీ సొంత ఇంట్లో 100 మంది ఉన్నా అది ప్రైవేట్ ప్లేస్ అనే అంటాం... ఫేస్ బుక్, సోషల్ మీడియా వుంది కదా అని ప్రతిసారీ అందరినీ నిందించాలి అని చూడడం కాదు. నిజా నిజాలు కూడా ఆలోచించాలి.

పబ్లిక్ రొమాన్స్.... కొత్తేమీ కాదు... చాలా సార్లు హైదరాబాద్ లోని చాలా పార్క్ లలో జరిగిన , జరుగుతున్న కార్యకలాపాలు... హైదరాబాద్ ఒక్కటే కాదు. దాదాపుగా పెద్ద నగరాల్లో ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. ఎవరూ లేరు అని అనుకుని చేసే ఆ ప్రేమ జంట కార్యకలాపాలు మూడో కన్ను గమనిస్తూ ఉంటుంది. అది సీసీ టివి కెమెరా కావచ్చు .. ఆకతాయి చేతిలో మొబైల్ కెమెరా కావచ్చు... అలాంటి ఘటనలు ఎన్నో చూసాం కూడా... అయినా సరే యువతలో ఎందుకు మార్పు రావడం లేదు.... ఎవరు చూసినా మాకేంటి...  మా ఆనందమే మాకు ముఖ్యం అనే ధోరణిలో ఉన్నారు ప్రస్తుత ట్రెండ్.. 2 నిమిషాల ఆనందం కోసం భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు ...
     
ఈ విషయంలో మరో అంశం కూడా ఆసక్తికరంగా మారింది. అసలు ఆ సీసీ ఫుటేజ్ బయటకు ఎలా వచ్చింది... ఎవరి ద్వారా వచ్చింది అనే విషయంపై విచారణ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి... పిల్లల విషయంలో ఏం జరుగుతుందో , ఏమేం చేస్తున్నారో తెలుసుకోండి.