BREAKING NEWS

ఎమ్మార్పీ నిలువు దోపిడి

ఎమ్మార్పీ ... మాగ్జిమం రిటైల్ ప్రైస్... ఏ వస్తువు అయినా దానిపై ప్రింట్ చేసిన దాని కన్నా ఎక్కువ ధరకు అమ్మకూడదు... వినియోగదారుడికి కష్టం లేకుండా, వ్యాపారికి నష్టం లేకుండా ఈ ఎమ్మార్పీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది...

బేరాలు అవసరం లేదు. ఇష్టం అయితే కొనచ్చు... లేదా మానేయచ్చు. నిజానికి ఆ ఎమ్మార్పీ ధర కన్నా కూడా బేరం ఆడి తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చని చట్టాలు చెబుతున్నాయి... ఫలానా వస్తువుపై ముద్రించేది గరిష్ట ధర మాత్రమే... అంటే ఆ ధరకు మించి అమ్మకూడదు గాని తగ్గించి అమ్మచ్చు... తగ్గించడం పక్కన పెడితే అసలు ఆ ఎమ్మార్పీ ధరలు సక్రమంగా అమలు అవుతున్నాయా.... 

              "ఈ స్టాల్ లో వస్తువులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి... లేనిచో అధికారులకు ఫిర్యాదు చేయండి." ఇదీ మనం నిత్యం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్ లలో చూసే నోటీస్ బోర్డ్. అయితే అవన్నీ కేవలం బోర్డులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో పెట్టడం లేదు. అసలు ఎమ్మార్పీ లతో మాకు పని లేదు. మా రేటు మా ఇష్టం అనే చందంగా తయారయ్యారు...

లీటర్ వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్ లో 15 రూపాయలు ఉంటుంది. కానీ ప్రయాణికుల దగ్గర వసూలు చేసేది మాత్రం 20 రూపాయలు. ట్రైన్ వెళ్ళిపోతుంది అనే హడావుడిలో ఉండే ప్రయాణికుడు బాటిల్ పై ఎమ్మార్పీ సరి చూసుకోలేడు కదా.... దీన్నే వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ ఇలా ఒకటేమిటి ప్రతీ ప్రొడక్ట్ వాళ్లు అమ్మే ధరకు ఎమ్మార్పికి అసలు సంబంధమే లేదు.

                    ఇక తిరుపతి,విశాఖపట్నం లాంటి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తిరుమల శ్రీవారికి నిలువు దోపిడి ఇచ్చేందుకు వచ్చే భక్తులను ఈ షాప్ ల వాళ్లు నిలువు దోపిడి చేస్తున్నారు. తిరుమల కొండ పై ఏ వస్తువు కొనాలి అన్నా దాని అసలు రేటు మీరు మరచిపోవాల్సిందే. అక్కడ వాళ్లు ఏ రేటు చెప్తే దానికే కొనాలి... కూల్ డ్రింక్ బాటిల్ పై 35 రూపాయలు ఎమ్మార్పీ ఉంటే 45 రూపాయలు ఇవ్వాలి...

ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ఎందుకు అని ఎవరైనా అడిగితే కూల్ అవ్వడం కోసం కరెంట్ బిల్ ఎవరు కడతారు అంటూ దబాయిస్తారు.. దాని పేరే "కూల్" డ్రింక్.... దానికి ప్రత్యేకంగా కూల్ చేయడం కోసం ఎక్కువ ఇవ్వాలి అంట.. మరొకడు ఎమ్మార్పీ లకు అమ్మితే షాప్ అద్దెలు కట్టలేం అంటాడు. అంటే షాప్ రెంట్ కూడా మన దగ్గరే వసూలు చేస్తున్నాడు అన్నమాట... ఊరు కానీ ఊర్లో ఎవరు వాదిస్తారు... అలాంటి సమయంలో ఆ ప్రొడక్ట్ చాలా అత్యవసరం.... ఇక తప్పుతుందా.... వాళ్లు ఎంత చెబితే అంతా ఇచ్చి కొనాల్సిందే. .. 

                      అధికారులు , ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి... రూపాయి రూపాయి కూడబెట్టి విహారయాత్రకు, దైవ దర్శనాలు కోసం ఎంతో దూరం నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతీది వాళ్ళకి బడ్జెట్ లోనే ఉంటుంది. ఇలా అధిక ధరలు ముక్కు పిండి వసూలు చేస్తే బడ్జెట్ ప్రకారం యాత్రలకు వచ్చిన వారి పరిస్థితి ఏమిటి ... ఎమ్మార్పీ ధరలు అమలు కేవలం ప్రకటనలకే కాదు.

ఆచరణలో కూడా పెట్టండి. ఎప్పటికప్పుడు షాప్ లు అన్నీ గమనించండి .. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ తీసుకునే వారిపై చర్యలు తీసుకోండి. లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులలో మన పై చెడు అభిప్రాయము వచ్చే అవకాశం ఉంది...

Photo Gallery