BREAKING NEWS

ఎన్నికలు సర్వేలు - సత్యాలు

సర్వే.... రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇదే మాట పదే పదే వినపడుతూ ఉంటుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీ భవితవ్యం ఏమిటి? ఆయా పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు? విజయం సాధించడానికి ఎంత వరకు అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు అన్నీ ఈ సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు.

అయితే ఇది కేవలం రాజకీయాల వరకు మాత్రమే పరిమితం కాదు. దాదాపుగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే ప్రతీ రంగంలోనూ ఈ సర్వే విధానం అమల్లో ఉంది. ఇంతకీ ఈ సర్వేల పరిస్థితి ఏమిటి? ఎలా చేస్తారు? వాటిని నిజంగానే నమ్మచ్చా????

                  ఏదైనా ఒక కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రావాలి అంటే అలాంటి ప్రొడక్ట్ గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారు.. విజయం సాధిస్తుందా లేదా?? అనే అంశాల గురించి ప్రతీ కంపెనీ సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న విధానం.

అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులు, పార్టీల మధ్య, అభ్యర్థుల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఎన్నికల సమయాల్లో ఈ సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలిస్తే దానికి తగినట్లుగా పార్టీ మానిఫెస్టో లు తయారుచేసుకుంటారు ఆయా పార్టీలు. 

                      మన రాష్ట్రంలో సుమారు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు... ఉదాహరణకి ఎన్నికలు గురించి చూద్దాం... ఈ 5 కోట్ల మందిలో 2 కోట్ల మంది  ఓటర్లు ఉన్నారు అనుకుందాం...అందులో ప్రతీ ఒక్కరినీ అభిప్రాయాలు అడగడం సాధ్యం అయ్యే విషయం కాదు. అందుకే సర్వే కోసం నియోజకవర్గంలో సుమారు  100 నుంచి 500 మంది వరకు సెలెక్ట్ చేసుకుంటారు.

వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. వాళ్లు చెప్పిన సమాధానాలు బట్టే ఎంత శాతం మంది ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేశారు అనే విషయం ప్రకటిస్తూ ఉంటారు. కానీ కేవలం ఆ 500 మంది మాత్రమే ఓటర్లు కాదు కదా... ఒక్కోసారి సర్వేలకు , ఫలితాలకు తేడా ఉండచ్చు కూడా.... తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది కూడా... టిడిపి కూటమి విజయం సాధిస్తుంది అని లగడపాటి చెప్పిన సర్వే తలకిందులైంది.... కేసీఆర్ విజయం సాధించారు...  అంటే సర్వే సమయంలో కేవలం టిడిపి కి సపోర్ట్ చేసే వాళ్ళే పార్టిసిపేట్ చేశారు తప్ప వ్యతిరేకులు ఎవరూ  సర్వేలో పాలు పంచుకోకవడంతో ఫలితం మార్పు వచ్చింది. వంద మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు గానీ మిగిలిన వేల మంది ఓటర్లు అభిప్రాయం ఎవరు చెప్పగలరు ..

             ఇక శాంపిల్ గా తీసుకున్న ఆ సర్వే ఫలితాలను కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే సర్వే చేసే వారికి చెప్పినట్టే ఎన్నికల సమయానికి ఓటర్ల మనసు ఉండదు. సరిగ్గా పోలింగ్ బూత్ లోకి వెళ్ళే సమయానికి మనసు మార్చుకుని వేరే వారికి ఓట్ వేయచ్చు.

అలాంటప్పుడు సర్వేల లాభం ఏముంది. కొన్ని రోజుల క్రితం సర్వేల పేరుతో తమ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపించారు. అయితే ఇక్కడ అందరూ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి.... ఒకటి... అంత సింపుల్ గా ఓట్లు గల్లంతు చేయడం సాధ్యం కాదు .. రెండోది.... ప్రజలు చాలా తెలివైన వాళ్ళు... అన్ని నిజాలే చెప్పరు.... ఒక్కోసారి కావాలనే నిజాలు దాచి అబద్ధాలు కూడా చెప్పే అవకాశాలు లేకపోలేదు...

అలాంటప్పుడు ఓట్లు తొలగించే వారికి కూడా నష్టమే కదా... ఒకవేళ తొలగించే ఆ ఓటు వాళ్ళకే వేసే అవకాశం ఉంటే???  ఈ సర్వేలను పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు. టూకీగా విషయం తెలుసుకోవడానికి తప్ప సర్వేల మీద ఆధారపడి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోలేము.
 
 

Photo Gallery