BREAKING NEWS

సర్వరోగ నివారిణి అల్లం...!

మనం వంటింట్లో అల్లాన్ని చాలా విరివిగా ఉపయోగిస్తుంటాం. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద మందుల లో కూడా అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అల్లం తో పచ్చడి కూడా చేసుకుంటూ వుంటారు. అలాగే అనేక ఆహార పదార్థాల్లో దీనిని ఉపయోగిస్తుంటాం. క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అల్లం వల్ల కేవలం ఆహారానికి రుచి మాత్రమే కాదు మనకి ఆరోగ్యం కూడా. అయితే మరి అల్లం గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి అనేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి.
 
అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లం లో ఘాటు ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా ఇది కడుపు లో అల్సర్ వంటివి ఏర్పడకుండా చేస్తుంది. కడుపు లో గ్యాస్ సమస్య తో సతమతమయ్యే వాళ్ళు అల్లాన్ని  తరచుగా వాడటం వల్ల అది దివ్యౌషధంలా పని చేస్తుంది. అంతే కాదండి షుగర్ ని నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషదం అల్లం. దగ్గు, కఫం వంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా అల్లం బాగా పని చేస్తుంది. విపరీతంగా దగ్గు తో ఇబ్బంది పడితే అల్లం లో కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే విముక్తి లభిస్తుంది. ఇలా అల్లం వల్ల అనేక ప్రయోజనాలు మనకి లభిస్తాయి. 
 
వికారాన్ని తగ్గిస్తుంది:
 
చాలా మందికి కారు, బస్సు ఇలా దేంట్లోనైనా ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి వికారం కలుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాగ్ లో కొంచెం అల్లాన్ని తీసుకెళ్లి వికారం కలిగినప్పుడు అల్లాన్ని తింటే ప్రయాణం లో ఉన్నప్పుడు కలిగే వికారం ఎంతో సులువుగా తగ్గిపోతుంది. దీంతో మీకు కొంచెం ఊరట లభించి ప్రయాణం సుఖవంతంగా అవుతుంది.
 
జలుబు, ఫ్లూ చికిత్స కోసం అల్లం:
 
అల్లం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మనకి తెలుసు. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా అల్లాన్ని జలుబు, ఫ్లూ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కనుక ప్రతి రోజూ మీరు అల్లాన్ని వంటల్లో ఉపయోగిస్తే ఇటువంటివి ఏం వచ్చినా చిటికె లో మాయం అయి పోతాయి.
 
రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం:
 
కేవలం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మాత్రమే కాదండి రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా మీరు అల్లంని ఉపయోగించడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత మెరుగు పడుతుంది.
 
గర్భిణీలకు ఔషదం అల్లం:
 
సాధారణంగా మహిళలు గర్భధారణ సమయం లో అనేక సమస్యల తో సతమతమవుతూ ఉంటారు. వీటిలో తల తిరగడం, వికారం, వాంతులు చాలా సహజం. వీటి వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. తింటే వాంతులు అయిపోతాయి ఏమో అని తినడం కూడా తగ్గించేస్తారు. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇటువంటి సమయం లో తల తిరగడం వికారం వాంతులు వంటివి తగ్గించడానికి మంచి ఔషధం అల్లం అనే చెప్పాలి. అల్లం తీసుకోవడం వల్ల వికారం వాంతులు తగ్గిపోతాయి. తల తిరగడం కూడా తగ్గి ఆరోగ్యంగా ఉండడానికి మేలు చేస్తుంది. 
 
అజీర్తి తగ్గడానికి అల్లం:
 
చాలా మంది అజీర్తి సమస్య తో సతమతమవుతూ ఉంటారు. అలాంటప్పుడు అల్లం టీ తీసుకుంటే క్షణాల్లో ఈ సమస్య మాయమై పోతుంది. 
 
అల్లం టీ వల్ల కలిగే ఉపయోగాలు:

 
అల్లం టీ తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు మానసిక ప్రశాంతత కోసం తీసుకుంటే ఎంతో ఉపయోగం, అల్లం టీ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా రావు. అజీర్తి సమస్యలతో బాధపడే వారికి నిజంగా ఇది బెస్ట్ సొల్యూషన్. అలానే మహిళలు పీరియడ్స్ సమయం లో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యౌషధంలా పని చేస్తుంది.
 
అల్లం టీ ని ఎలా తయారు చేసుకోవాలంటే...?

 
ముందుగా అల్లాన్ని తొక్క తీసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ లో ఈ అల్లం వేసి శుభ్రంగా మరిగించాలి. అవసరాన్ని బట్టి స్టవ్ సిమ్ లో పెట్టుకోవడం చేయాలి. అయితే దగ్గర పడ్డాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని  వడగట్టుకుని ఒక గ్లాస్ లో సర్వ్ చేసుకుని పైన నిమ్మ రసం వేసుకోవాలి. అంతే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
 
చూసారా అల్లం వలన, అల్లం టీ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో...! ఇటువంటి సమస్యలు కలిగినప్పుడు తప్పకుండ అల్లం తో ఎంతో సులువుగా మీ సమస్యని తరిమి కొట్టేయండి. అల్లం టీ ని కూడా అనుదినం తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఇలా ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఉండండి. సమస్యల నుండి దూరంగా ఉండండి.