BREAKING NEWS

కాణిపాకం ఆలయం గురించి అనేక విషయాలు మీకోసం...!

కాణిపాకం ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరకి దీని కోసం తెలిసిందే. అందరి ఆరాధ్యదైవమైన  వినాయకుడికి ఇక్కడ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బహు పురాతన పుణ్యక్షేత్రం గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా....? అయితే ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి. తిరుపతి కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వినాయక దేవాలయాన్ని దర్శించుకుని తీరాలి.

ఈ వినాయకుడు రోజు రోజుకు పెరిగి భగవంతుడు మహిమ ఏంటనేది చూపిస్తూ ఉంటాడు. స్వయంభువుగా వెలసిన ఈ  స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా వినాయకుడు పెరుగుతూ ఉన్నాడు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. 
 
కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం. కాణిపాకం  వ్యవసాయానికి ఎప్పుడూ నీరు ఉంటుంది. పచ్చని పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటుంది. అయితే కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ, గుడ్డి, చెవిటి వారైనా ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయ భూమి. కొద్ది రోజులకు వారు వ్యవసాయ భూమిలో నీరు ఎండిపోవడాన్ని గమనించారు. అయితే వాళ్ళు కొద్దిగా తవ్వితే నీరు వస్తుందని తవ్వడం మొదలుపెట్టారు. ఇలా తవ్వుతుండగా ఒక గట్టి రాయి తగిలి క్షణాల్లో బావిలో రక్తం కారటం మొదలైంది. ఇలా కొద్ది కొద్దిగా బావి నిండుతుంది. అయితే ముగ్గురు అన్నదమ్ములు ఏమైందని గమనించి వినాయకుడి విగ్రహం కనిపించింది.
 
ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవిటితనం పోయి మామూలు మనిషిగా మారిపోతారు. ఈ విషయమంతా గ్రామస్తులకు తెలిసి పూజించడం మొదలు పెట్టారు. అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయలు లో ఉండే నీరు కాణిపాకం  అంతా విస్తరించింది. ఇలా కాణిపరకం అనే తమిళ పేరు దీనికి వచ్చింది. అలా వచ్చిన పేరు కాస్త ఇప్పుడు మనం పిలుస్తున్న కాణిపాకంగా మారింది. 
 
కాణిపాకం ఆలయం విశేషాలు:
 
ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. రోజురోజుకీ పరిణామం పెరగడమే ఈ విగ్రహ విశేషత. ఇప్పటికీ విగ్రహం బయట పడిన బావి లోనే ఉంది. అంతే కాదండీ ఇంకొక చెప్పుకోదగ్గ విశేషం కూడా ఉంది. అదేమిటంటే...?  ఆ బావి నీరు ఎప్పటికి ఎండిపోదు. దీని మూలంగానే ఆ నీటిని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. కాణిపాక వినాయకుడు సత్యానికి మారుపేరు. ఈ ఊరు తిరుమల తిరుపతి కి చాల దగ్గర. అందుకే తిరుమలకు వెళ్లిన భక్తులు  తప్పక ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది. దానిలో వినాయకుడి వాహనం ఎలుక ఉంది. అయితే  ఆ బావి లో మనకి నచ్చినది వదిలేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని అంటారు.
 
చూడవలసిన ప్రదేశాలు :
 
అద్భుతంగా ఉండే కాణిపాకం ఆలయం ప్రాంతం లో వివిధ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక అందమైన మంచి నీటి కోనేరు ఉంది. అలాగే ఇక్కడ ఒక వినూత్నమైన మండపం కూడా ఉంది. అంతే కాదండి శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశ లో మరకతాంబిక సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ దుర్గ విగ్రహాలు ఇక్కడ చెప్పుకోదగ్గవి.
 
వరదరాజ స్వామి వారి ఆలయం:
 
శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశ లో శ్రీ వరద రాజ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇది కూడా చూడదగ్గది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీమహా విష్ణువు అతనికి కలలో కనిపించి శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం వలన దీనిని కట్టించారని అంటారు. ఈ ఆలయం తో పాటు కాణిపాకం  లో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. దీనిని కూడా చూడాల్సిందే.
 
కాణిపాకంలో అద్దాలమేడ:
 
ఇక్కడ అద్దాలమేడ బాగా ఆకర్షిస్తుంది. వరదరాజ స్వామి ఆలయం లో నవగ్రహ మండపం తో పాటు అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు మూడవ వంతు వివిధ దేవాలయాల తో నిండి ఉంది.
 
కాణిపాకంకి ఎలా వెళ్లాలి...?
 
కాణిపాకం ని సులువుగా చేరుకోవచ్చు. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషాలకు కాణిపాకం కి బస్సు ఉంది. చిత్తూరు నుంచి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. అంతే కాదండి చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు  కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి సులువుగా ఆలయానికి చేరుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ఏ మూల నుండి అయినా చిత్తూరు కి లేదా రేణిగుంట, గూడూరుకు రైళ్లు ఉన్నాయి. అక్కడ వరకు మీరు వచ్చేస్తే అక్కడి నుంచి సులభంగా బస్సు లో మీరు కానిపాకం ఆలయానికి చేరుకోవచ్చు. విమానాల ద్వారా వచ్చేవాళ్ళు రేణిగుంట విమానాశ్రయం నుండి కాణిపాక ఆలయానికి చేరుకోవచ్చు.