BREAKING NEWS

పొన్నగంటి కూర వలన ప్రయోజనాలు అనేకం..!

పొన్నగంటి కూర తో కూర, పప్పు వగైరా వాటిని  చేసుకుంటూనే ఉంటాము దీనిలో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువ. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకో వచ్చు. చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు, దీని లో ఉండే పోషక విలువలు తెలియవు. వీటిని తెలుసుకుని ఎన్నో అనారోగ్య సమస్యలను పరిష్కరించుకో వచ్చు. అలానే మీ డైట్ లో దీనిని చేర్చడం వల్ల కలిగే ఉపయోగాలు గురించి కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది, మరి ఆలస్యం ఎందుకు పొన్నగంటి కూర కోసం పూర్తిగా చూసేయండి.
 
 పొన్నగంటి కూర వల్ల కలిగే ఉపయోగాలు:
 
పొన్నగంటి కూరను మీరు మీ డైట్ లో తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. నిజంగా అరుగుదల సమస్యలన్నిటికీ కూడా ఇది ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. కేవలం వట్టి కూరనే కాకుండా పలు రకాల కూరల తో కూడా చేసుకోవచ్చు. దీని వల్ల మంచి రుచి ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా ఆయుర్వేద ఔషధం లో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఒంట్లో రుగ్మతను శుభ్ర పరచడానికి పొన్నగంటి కూర బాగా ఉపయోగ పడుతుంది. 48 రోజుల పాటు పొన్నగంటి కూర తింటే ఖనిజాలు, పోషకాలు అధికంగా అందుతాయని పురాతన పుస్తకాల లో భారతీయ వైద్య గురువు చెప్పడం జరిగింది.
 
అలానే ఇది కళ్ళను పోషించడం లో బాగా ఉపయోగ పడుతుంది.  కంటికి సంబంధించిన రోగాలను నయం కూడా చేయొచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. క్లుప్తంగా వీటి కోసం ఇప్పుడే తెలుసుకోండి..
 
 రక్తాన్ని శుద్ధి చేస్తుంది:
 
పొన్నగంటి కూర తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలానే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా దీనిని తీసుకో వచ్చు. బరువు సులువుగా తగ్గడానికి ఇది మంచి పరిష్కారం. 
 
కంటి కింద నల్లటి వలయాలు:

 
కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు ఎలా పోగొట్టుకోవాలి అని అనుకుంటే ఇలా చెయ్యండి. పొన్నగంటి కూర తాలింపు చేసుకుని తీసుకుంటే  కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోయి మంచి  ఫలితం ఉంటుంది. దీనిలో  విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 
 
పొన్నగంటి కూర జీర్ణశక్తిని పెంచుతుంది:

 
పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల కూడా జీర్ణ క్రియ సరిగ్గా ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు తో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, మినార్లస్, పొటాషియం ఐరన్ మెగ్నీషియం కూడా సమృద్ధిగా ఉంటాయి. 
 
క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి:
 
ఆస్తమా,  బ్రాంకైటిస్ బాధితులు ఈ ఆకు రసం లో కొద్దిగా తేనెను కలుపుకుని తీసుకుంటే... చాలా మంచిది. దీనిలో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదలకు ఆస్టియో పొరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికి కూడా సహాయ పడతాయి. చర్మ వ్యాధులు, రక్తస్రావం, అజీర్తి, అరి చేతి మంటలకు కూడా ఇది బాగా పని చేస్తుంది.
 
వీర్యకణాలు లోని లోపాలను సరి చేస్తుంది:
 
పొన్నగంటి కూర వల్ల వీర్య కణాలలో ఉండే లోపాలు కూడా తగ్గిపోతాయి. అలానే  ఒక టేబుల్ స్పూన్ పొన్నగంటి కూర తాజా రసాన్ని తీసుకుని కొద్దిగా వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, ఆస్తమా కూడా తగ్గిపోతాయి. నరాల నొప్పి వెన్ను నొప్పికి కూడా ఇది మంచి ఔషధం.
 
మొలల వ్యాధి:
 
మూలాల వ్యాధి కూడా పొన్నగంటి కూర తో తగ్గిపోతుంది. ఆవు నెయ్యితో పొన్నగంటి కూరని వండుకుని తింటే మొలల వ్యాధి ఉన్న వాళ్ళకి మంచిది. రెండు టేబుల్ స్పూన్ ఆకుల రసాన్ని తీసుకుని ముల్లంగి ఆకు రసం తో కలిపి రోజుకు రెండు మూడు సార్లు నెల రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుందని నిపుణులు అంటున్నారు.  
 
ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉన్నాయి, అమైనో ఆమ్లాలు కూడా దీని ద్వారా మనకి లభిస్తాయి.
దీనిని కంటి కూర అని కూడా అంటారు. ఎందుకంటే కళ్ళకు ఇది చాలా మేలు చేస్తుంది అని.  తెలంగాణ ప్రాంతం లోని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కూర వాడితో కంటి చూపు వస్తుందనే నమ్మకం తో పోయిన కంటి కూర అనేవాళ్లు. ఇలా కంటి కూర అనే వాడుక నుండి పొన్నగంటి కూర అనే పేరు వచ్చింది.
 
ఇది ఏడాది పొడవునా లభిస్తుంది కాబట్టి సులువుగా మీరు మీ డైట్ లో చేర్చుకో వచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఇందులో తక్కువగా ఉంటుంది. క్యాలరీలు కూడా ఈ కూరలో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూసారా పొన్నగంటి కూర వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో..!  మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ప్రతి రోజూ మీ డైట్ లో తీసుకొని మరింత ఆరోగ్యంగా ఉండండి. అనేక సమస్యల్ని ఎట్టి తరిమికొట్టండి.