BREAKING NEWS

చక్కటి శిల్పకళతో, రమణీయమైన ప్రకృతితో లేపాక్షి ఆలయం...!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా లో లేపాక్షి ఉంది. హిందూపురం నుండి 14 కిలో మీటర్ల దూరం లో లేపాక్షి ఉంది. బెంగళూరు నుంచి ఇది 120 కిలో మీటర్ల దూరం లో ఉంది. అనేక మంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు. చూడడానికి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా దీని చరిత్ర కూడా చాలానే ఉంది. ప్రతి సంవత్సరం నలు మూలల నుంచి ఈ ఆలయాన్ని చూడటానికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం లో వీరభద్ర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి  చేత 16వ శతాబ్దం లో నిర్మించబడింది. నిజంగా ఇక్కడ విశ్వకర్మ బ్రాహ్మణులు అద్భుతమైన కళా చాతుర్యాన్ని చూపించడం జరిగింది. ఇక్కడ మండపాలు, శిల్ప కళా విశిష్టం చెప్పుకోదగ్గది.
 
నిజంగా ఇటువంటి ఆలయం మరి ఎక్కడ చూడలేము. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆలయం కోసం అనేక విషయాలు ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. సాధారణంగా మనం అనంతపురం అనగానే సినిమాల్లో చూసినట్లు ఫ్యాక్షన్, రాజకీయాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఆలయాన్ని చూశారంటే అవన్నీ మర్చిపోతారు. ఆధ్యాత్మికత తో పర్యాటకుల మనసును దోచుకుంటోంది. ఇక్కడ ఈ ఆలయం తో పాటు అనేక ఆలయాలు ఉన్నాయి.
 
 ఇక్కడ చూడదగ్గ ఆలయాలు :
 
అనంతపురం జిల్లాలో కదిరి నరసింహుడు కొలువైయున్నాడు. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది.
 
 బుగ్గ రామలింగేశ్వర ఆలయం:
 
ఈ ఆలయం తాడిపత్రి లో ఉంది. దీనిని కూడా చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఒకసారి ఒక వెళ్ళి చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలని అన్ని చుట్టుకుని వచ్చేయొచ్చు.
 
పుట్టపర్తి:
 
ఇది అనంతపురానికి 24 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది సత్య సాయి బాబా వెలిసిన ప్రాంతం ఇక్కడికి కూడా సత్య సాయిబాబా భక్తులు వచ్చి దర్శించుకుంటారు.
 
పెనుకొండ:
 
శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దం లో హంపి తర్వాత పెనుకొండను రెండో రాజధానిగా చేసుకుని పాలించారు. వీటన్నింటినీ చూడాలంటే ఒక రోజు సరిపోదు. పెనుగొండలో ఏకంగా 365 ఆలయాలు ఉన్నాయి. వీటిలో చాలా ఆలయాలు శిథిలావస్థ లోకి చేరుకున్నాయి. అలానే కొండ పై ఉన్న పలు ఆలయాలు బాగా అందంగా ఉంటాయి. చుట్టూ అందమైన ప్రకృతి దేవాలయాలు కోనేరులు, గోపురాలు, విజయనగర రాజుల చరిత్రకు అద్దం పడతాయి.
 
 హేమవతి:
 

ఇది అనంతపురానికి 60 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇక్కడ దొడ్డేశ్వర స్వామి ఆలయం చూడదగ్గది. ఇక్కడ మ్యూజియం లో అరుదైన చారిత్రక ప్రతిమలు కూడా చూడొచ్చు. అలానే బట్రేపల్లి జలపాతం, ఆలూరు కోన, ధర్మవరం, రాయదుర్గం మొదలైన ప్రాంతాలను సందర్శించవచ్చు.
 
లేపాక్షి వీరభద్ర స్వామి వారి ఆలయం:
 
ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. విజయనగర సామ్రాజ్య అధిపతులు తర్వాత ఈ ఆలయం 16 వ శతాబ్దం లో నిర్మించబడింది. ఆలయాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు. అక్కడ ఉండే మండపాలు, గోపురాలు ఇలా ప్రతిదీ బాగా ఆకట్టుకుంటాయి. అటువంటి ఒక మండపం మనిషి ఎత్తు అంత ఉంటుంది. నృత్య కారులు ఇంకా సంగీత విద్వాంసుల విగ్రహాలతో ప్రత్యేకతను చాటుకుంది. అతి పెద్ద రాతి నంది విగ్రహం ఎక్కడ ఉంది. ఇది ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు.
 
లేపాక్షి ఆలయంలో బసవయ్య విగ్రహం:
 
15 అడుగుల ఎత్తు 22 అడుగుల పొడవున్న విస్తరించి ఉన్న బసవయ్య విగ్రహం బ్రహ్మాండమైన విగ్రహం అనే చెప్పాలి. 108 శివ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని స్కంధ పురాణం చెబుతోంది. ఇక్కడగల పాపన్న కేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి. చక్కటి శిల్పకళ తో రూపొందించిన రమణీయమైన ప్రదేశం ఇది.
 
అలాగే సీతమ్మ వారిని అపహరించుకుని పోతున్న రావణాసురుని తో యుద్ధం చేసి జటాయువు ఇక్కడే పడిపోయిందని రాములవారు జటాయు చెప్పిన విషయం అంతా విని కృతజ్ఞత తో ''లే పక్షి'' అని అన్నారు. అందు మూలంగా దీనికి లేపాక్షి అనే పేరు వచ్చింది. ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణం వైపుగా నిర్మించబడింది. ఈ దేవాలయం అంతా తాబేలు ఆకారం లో గల గ్రానైట్ శిల పై తక్కువ ఎత్తు లో నిర్మించబడింది. అందుకే దీన్ని కూర్మ శైలం అంటారు.
 
అలాగే ఈ ఆలయం లో ప్రెస్కో  చిత్రాల లో కాంతివంతమైన రంగుల రంగుల తో కూడుకున్న ఉన్న రాముడు, కృష్ణుడు యొక్క పురాణ కథలకు సంబంధించినవి ఉంటాయి. ఇలా నంది విగ్రహం, ఈ ఆలయ కట్టడం, ఫ్రెస్కో చిత్రాలు, బసవయ్య విగ్రహం మొదలైనవి అన్ని కూడా  తప్పక చూడాల్సినవే. నిజంగా మరే ఆలయం వద్ద మనకు ఇవి కనిపించవు. పైగా ఇంత అద్భుతంగా ఉండవు. అందుకేనేమో ఏడాది పొడుగునా భక్తులు నలుమూలల నుంచి వస్తారు.