BREAKING NEWS

మునగాకుతో ఈ సమస్యలని చిటికెలో మాయం చేసుకోండి...!

మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం నిత్యం మునగాకును అనేక వంటల లో వాడుతూ ఉంటాము. మునగ కూర తో పప్పు, కూర లాంటివి కూడా చేసుకుంటూ ఉండొచ్చు. నిజంగా మనం ఎక్కువగా దొరుకుంది. పైగా ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి ఈజీగా కోసుకుని వండుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. మునగ కాయల లోనే కాకుండా ఆకులు కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఆహారానికి చాలా మంచి చేస్తాయి. అయితే మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పూర్తి వివరాల లోకి  వెళితే మునగ లో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అలానే క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటాయి. మునగాకు గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియదు. దీనిని 4 వేల ఏళ్ల నుంచి పూర్వికులు ఔషధాల లో ఉపయోగిస్తున్నారు.  అంటే దీని గొప్పదనం మీకు అర్థమైందా...?  అంతే కాదు 300 కు పైగా వ్యాధులను నయం చేయడానికి దీనిని ఉపయోగిస్తూ వచ్చారు.

దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. క్యారెట్లు తింటే వచ్చే పోషకాలు కంటే మునగాకు తినడం వల్ల అంత కంటే  రెట్టింపు దీని ద్వారా మనకి లభిస్తుంది. అలానే ఒక చెంచా మునగాకు రసము లో కొద్దిగా తేనె కలిపి ప్రతి రోజూ పడుకునే ముందు తాగితే కనుక రేచీకటి తగ్గుతుంది. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. 
 
కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకు కూడా వాడతారు. థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకు లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ కూడా చేస్తుంది. పాల నుండి లభించే కాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు లో లభిస్తాయి. అలాగే పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు ద్వారా మనం తీసుకోవచ్చు. అరటి పండులో ఉండే పొటాషియం కంటే మునగాకు లో  పదిహేను రెట్లు ఎక్కువగా మనకి అందుతాయి. మునగాకు రసము లో నువ్వుల నూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరిగించి ఆ మిశ్రమాన్ని కనుక తీసుకుంటే  గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల పైన రాస్తే  చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. 
 
గర్భిణీలు, బాలింతలకు కనుక మునగాకును ఇస్తే తల్లులు తో పాటు పాలు తాగే పిల్లలకు కూడా ఆరోగ్యం లభిస్తుంది. ఇలా మునగాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి లోపించకుండా ఉండాలంటే మునగ కాయలు పచ్చి మామిడి కాయలు కలిపి కూర వండుకుని తింటే మంచి బెనిఫిట్ పొందొచ్చు. అలానే చలవ కూడా చేస్తుంది. ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది కూడా.  అయితే ప్రతీ రోజు వండుకోవడం కష్టం కదా...? అని ఆలోచిస్తున్నారా..? అయితే అలంటి వాళ్ళ కోసం మరో ఉపాయం ఉంది.

అదేమిటంటే ఎంతో సులువుగా చేసుకునే మునగాకు టీ. మునగాకు పొడి తో మీరు టీ చేసుకుంటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మునగాకు టీ తాగడం వలన చాల లాభాలు వస్తాయి. మునగాకు పొడి లో ఉన్న అన్ని లాభాలని కూడా మీరు పొందొచ్చు. ఇక టీ తయారు చేసే విధానం చూడండి. మునగాకు టీ  కి కావాల్సిన పదార్థాలు విషయానికి వస్తే... దీని కోసం మీకు కేవలం మునగాకు మాత్రమే చాలు. మీరు చక్కగా ఆకుల తెచ్చుకుని, వాటిని శుభ్రం చేసుకోండి.
 
ఆ తర్వాత నీళ్లలో వేసి కడిగి ఆరనివ్వాలి. కాసేపు ఎండ లో ఎండిన ఆకులు తెచ్చి, మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇది అంత పొడి అయింది కదా..! దీనిని మీరు స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ పొడి తో మీరు టీ చేసుకోవచ్చు. ఇలా టీ చేసుకుని తాగండి. లేదు  ఇంత పెద్ద ప్రాసెస్ చేయలేని వాళ్ళు కొన్ని ఆకులు తెచ్చుకుని, శుభ్రం చేసుకుని కొద్దిసేపు నీళ్లలో మరగపెట్టండి.అది మరిగిన తర్వాత ఆ రసాన్ని మీరు తీసుకోండి. ఇలా ప్రతి రోజు మీరు దీన్ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక సమస్యలు తరిమికొట్టొచ్చు.
 
ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల శరీరం లో మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. చర్మానికి జుట్టుకి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఇది చర్మాన్ని చాలా క్లియర్ గా మార్చేస్తుంది. చూసారా మునగ ఆకుల వలన ఎన్ని ప్రయోజనలో మరి ప్రతీ రోజు ఎదో ఒక రూపం లో తీసుకోండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.