BREAKING NEWS

మంత్రాలయం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం...!

మన ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. అయితే ఈ రోజు మనం మంత్రాలయం గురించి కొన్ని విశేషాలు చూద్దాం. మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. మంత్రాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. ఇది రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూల్ నుండి 100 కిలో మీటర్ల దూరం లో ఉంది. మంత్రాలయంకు సమీపం లో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. మంత్రాలయం హైదరాబాద్ నుండి 232 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దగ్గర లో చూడడానికి కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. 
  
మంత్రాలయం వేళలు:
 
మీరు కనుక ఈ ఆలయాన్ని దర్శించాలంటే సమయం వేళలు  తెలుసుకోవాలి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల నుండి 8:00 వరకు కూడా ఇదే తెరిచి ఉంటుంది.
 
ఈ ఆలయంలో బృందావనం:
 
నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ రాఘవేంద్ర స్వామి సమాధి ఉన్న ప్రాంతాన్ని బృందావనం అని అంటారు. కర్నూలు జిల్లా లో ఉన్న ఒక చిన్న గ్రామం లో తుంగభద్ర నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది. ఈ సమాధిని చూడడానికి చాలా మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చి రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. రాఘవేంద్ర స్వామి 1671 లో జీవ సమాధి చెందారు. స్వామి ఎందరో మంది భక్తులకు సమస్యలు కూడా తీర్చారు. రాఘవేంద్ర స్వామి భక్తులకి కలలో కనిపించి సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నో గాధలు కూడా ఉన్నాయి. నిజంగా ఎంతో మంది కోరికలు రాఘవేంద్రస్వామి తీర్చారు అని భక్తుల నమ్మకం. 
 
మంత్రాలయం చేరుకోవడానికి మార్గాలు:
 
బస్సు మార్గం నుండి ప్రయాణం చేసే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం ఎంతో సులువుగా చేరుకోవచ్చు. మంత్రాలయం నుండి కర్నూల్ మరియు హైదరాబాదుకి కూడా బస్సు సర్వీసులు కూడా అందుబాటులోనే ఉంటాయి. కనుక ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎంతో అనువుగా ఉంటుంది.
 
రైలు మార్గం నుండి వచ్చే వారు మంత్రాలయం సమీపంలో ఉన్న  రైల్వే స్టేషన్ మంత్రాలయమే. కేవలం 15 కిలో మీటర్ల దూరం లోనే ఇది ఉంది. చెన్నై మరియు రాయచూరు రైల్ రూట్ లో  రైల్వే స్టేషన్ ఉంది. రెగ్యులర్ గా రైళ్లు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి చింత అక్కర్లేదు.
 
ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ఇది 232 కిలో మీటర్ల దూరం లో ఉంది. విమానాశ్రయం నుంచి మీరు టాక్సీల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
 
రాఘవేంద్ర స్వామి గురించి పలు విశేషాలు: 
 
రాఘవేంద్ర స్వామి శ్రీహరి భక్తుడు. కలియుగంలో భూమిపై నీతిని ధర్మాన్ని స్థాపించడానికి దైవసంకల్పం ఆ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జన్మించారు. ఆయన జీవిత చరిత్ర భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని భక్తి భావాన్ని కలిగిస్తుంది.
 
ఈ ఆలయ సమీపంలో ఉన్న మరి కొన్ని ప్రదేశాలు:

 
మంత్రాలయం సందర్శించుకున్న తర్వాత అనేక ప్రదేశాలు మనం ఇక్కడ చూడొచ్చు. వీటిని కూడా దర్శించుకోవడం బాగుంటుంది. కర్ణాటక సరిహద్దు లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం లో రాఘవేంద్ర స్వామి పన్నెండేళ్ళ పాటు తపస్సు చేశారట. అయితే నాటి పంచముఖ ఆంజనేయ ప్రతి రూపమే ఇక్కడ మనం చూడొచ్చు.
 
అలానే పాతూరు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రాఘవేంద్ర స్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారని అంటారు. అయితే ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామి చెక్కారట. అంతే కాదండి ఇక్కడ మరో అద్భుతమైన ప్రదేశం ఉంది. రాఘవేంద్రస్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచార్య వద్ద రాఘవేంద్ర స్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట. అయితే అందుకే ఈ వెంకన్న స్వామి వారికి ఏకశిల తో బృందావనం కట్టించారు. కాబట్టి వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనంని కూడా సందర్శించవచ్చు.
 
ఇక్కడ అనేక పూజలు ప్రధానంగా జరుపుతుంటారు.  అన్నదాన సేవా, సమర్పణ సేవ, వస్త్ర సమర్పణ సేవ, పట్టువస్త్రాలు సమర్పణ సేవ, బంగారు పల్లకి సేవ మొదలైనవి. బంగారు రథోత్సవ  సేవకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తారు. దీని కోసం 6000 చెల్లించాలి. 7:30 గంటలకు ఈ సేవ జరుగుతుంది. 50 ప్రసాదాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, వస్త్రం ఇస్తారు అదే రోజు సాయంత్రం గంట ముందు శ్రీ మఠానికి చేరుకోవాలి. ఇలా ఒక్కొక్క సేవ ఒక్కోలా ఉంటుంది. ఇలా అనేక సేవలని జరుపుతూ ఉంటారు. భక్తులు కూడా ఎంతో భక్తి తో పూజిస్తారు.