BREAKING NEWS

మీ గార్డెన్ ని మరెంత అందంగా మార్చేసుకోండి..!

ఇళ్ళల్లో మొక్కల్ని పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. మన క్రియేటివిటీని మొక్కల్లో ప్రయోగించి వివిధ రకాల మొక్కల్ని పెంచుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పటి కాలం లో చాలా వాటిలో రసాయనాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇళ్లల్లో కనుక మనం సొంతంగా కూరగాయలు, పండ్లు పండించుకుంటే చక్కగా ఆరోగ్యంగా మనం ఉండవచ్చు. పైగా ఇంట్లో గార్డెన్ ని పెంచు కోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రిఫ్రెష్ గా మీ మైండ్ ఉంటుంది. 
 
మొక్కలతో ఎక్కువగా గడపడం వల్ల చాలా సంతోషం కలుగుతుంది. హ్యాపీనెస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వాటి మధ్య ఎక్కువ సేపు గడపడం చేస్తే చాలా మంచిది. అయితే ఒక గార్డెన్ ని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇంట్లో ఉండే పాత సామాన్లతో చాలా అందంగా గార్డెన్ ని మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉండే పాత సామాన్లతో కనుక చేసుకుంటే ఎక్కువ డబ్బులు వెచ్చించక్కర్లేదు. పైగా ఖర్చు కూడా చాలా తక్కువే అవుతుంది. ఇంట్లో పండిన కూరగాయలు తినడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే మరి ఇంట్లోనే పాత సామాన్ల తో ఎలా గార్డెన్ చేయొచ్చు అనుకుంటున్నారా...?  నిజంగా పాత సామాన్లు తో ఏం చేయొచ్చు ..? ఎలా అవుతుంది....?  ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడే తెలుసుకోండి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి.
 
పాత ఫిష్ బౌల్స్: 
 
చాలామంది ఇళ్లల్లో చేపల్ని పెంచుతూ ఉంటారు. చిన్న చిన్న బౌల్స్ ని వాటి కోసం కొంటూ ఉంటారు. అయితే పాత ఫిష్ బౌల్స్ ని గార్డెనింగ్ లో ఉపయోగించడం వల్ల మొక్కలు పెరగడమే కాదు ఖర్చు కూడా తగ్గుతుంది. అందంగా కూడా కనిపిస్తుంది. కావాలంటే మీరు ఫిష్ బౌల్స్ లో కొద్దిగా అందంగా కనిపించడానికి రాళ్ళని లేదా ఏదైనా చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టవచ్చు దానితో మొక్కల్ని కూడా నాటవచ్చు. దీని వల్ల చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మంచి  లుక్ కూడా వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా పాత ఫిష్ బౌల్స్ కనుక ఉంటే వాటిలో మొక్కల్ని పెంచేయండి. ఎంతో అందంగా మీరు మీ గార్డెన్ ని రూపొందించుకోగలరు.
 
ప్లాస్టిక్ బాటిల్స్ :
 
ప్లాస్టిక్ బాటిల్స్ ని కూడా మొక్కలకి ఉపయోగించొచ్చు. రోజు మన ఇంట్లో చాలా ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియక వాటిని పారేస్తూ ఉంటాము. వీటిలో కనుక మొక్కలు వేయడం ప్రారంభించారు అంటే ఇంకా కుండీలను మీరు కొనుక్కోక్కర్లేదు. ప్లాస్టిక్ బాటిల్స్ ని మధ్యకి కట్ చేసి దానిలో మట్టి వేసి ముక్కలు నాటచ్చు. చిన్న చిన్న మొక్కలు దీనిలో సులువుగా పెరిగిపోతాయి. ఇంకా అందంగా కనిపించాలంటే మీరు వాటర్ బాటిల్ కి పెయింట్ కూడా వేయొచ్చు.. లేదా తాడు కట్టి వాటిని హ్యాంగ్ చేయవచ్చు. ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది మీ ఇంట్లో మీరు పెంచే తోటలో ఇవి బాగా ఆకర్షిస్తాయి.
 
పాత కర్టెన్స్:
 
సాధారణంగా మన ఇంట్లో పాత కర్టెన్స్ ఉంటాయి. వాటితో ఎలా చేయాలి అని అనుకోకండి.. వీటిని కూడా గార్డెన్లో ఉపయోగించవచ్చు. దీనితో గార్డెన్ మరింత అందంగా కనబడుతుంది కుండీలకి పెయింట్ వేసే బదులు కుండి మొత్తాన్ని అందంగా కర్టెన్స్ తో నింపేయండి. అది నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి కుండీకి కూడా కటింగ్ తో డెకరేట్ చేయవచ్చు. నిజంగా ఏదో రేటు ఎక్కువ ఉండేలాగా కనబడుతుంది.
 
పాత పంజరాలు:
 
మీ ఇంట్లో ఇది వరకు ఏవైనా పక్షులు పెంచుకుంటే ఆ పంజరాలు ఉంటాయి కదా వాటిని కూడా మొక్కల్లో వాడొచ్చు. అందంగా వాటికి తుప్పు కనపడకుండా పెయింట్ వేసి వాటిని కొమ్మలకి వేలాడతీయొచ్చు. మీరు కనుక ఒక తీగ పక్కన దీన్ని పెట్టారంటే అందంగా తీగ అంతా కూడా ఈ పంజరం మీద పడుతుంది. ఇది చాలా అందంగా ఉంటుంది. చక్కగా దీని చుట్టూ అందమైన సీతాకోకచిలుకలు ఈ పంజరం చుట్టూ చేరుతాయి. వినడానికి ఎంత బాగుందో కదా మరి ట్రై చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
 
పాత కుర్చీలు, బల్లలు:
 
చెక్కతో చేసిన పాతబడిపోయిన కుర్చీలు అందరి ఇళ్లల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. పాత కుర్చీలు బల్లలు ఉంటే వాటికి అందంగా పెయింట్ వేసి వాటి మీద  మొక్కలని పెట్టండి.  చాలా అందంగా మారిపోతుంది మీ గార్డెన్. కాబట్టి పాత వాటిని పారేయకుండా గార్డెనింగ్ లో ఉపయోగించడం వల్ల మీ గార్డెన్ మరింత అందంగా మారుతుంది. మరి ఈ చిన్న చిన్న టిప్స్ ని మీ గార్డెన్ లో ఫాలో అయ్యి మరింత అందంగా మీ గార్డెన్ ని మార్చుకోండి.