VLCC మిస్ ఇండియా పోటీ లో విన్నర్ అప్ గా తెలుగు అమ్మాయి సత్తా చాటింది. తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మొదటి స్థానం లో నిలిచి అందాల కిరీటాన్ని గెలుచుకుంది. 23 ఏళ్ల మానస హైదరాబాదు లో గ్లోబల్ ఇండియన్ స్కూల్లో చదివింది. ఇంజినీరింగ్ చేసి ఈమె ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. ఈమె తన ఫ్యాషన్ తో ఈ విజయాన్ని అందుకుంది.
నిజంగా మిస్ ఇండియా కిరీటం సాధించడం అంత సులువేం కాదు. ఏది ఏమైనా ఆమె ఆశే ఆమెని విజేతని చేసింది. అయితే ఇది ఇలా ఉండగా మిస్ ఇండియా రన్నర్ అప్ గా నిలిచినా మాన్య సింగ్ గురించి కూడా చాల చెప్పాలి. ఆమె జీవితం చాలా ఆదర్శం. ఆమె అందరిలా ఆనందంగా ఉండ లేదు. మిస్ ఇండియా రన్నర్ అప్ గా నిలిచినా మాన్య సింగ్ జీవితం లో చాలా మిస్సయింది.
సాధారణంగా మిస్ ఇండియా అనగానే మనకి ఎంతో ఫ్యాషన్ గా వాళ్ళ ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తారు అనే భావన మనలో కలుగుతుంది. కానీ మాన్య సింగ్ జీవితం చూస్తే కంట తడి పెట్టుకోక తప్పదు. ఆమె ఎన్నో కష్టాలను ఒడిదుడుకుల్ని భరించి... ఇప్పుడు ఈ అందమైన జీవితాన్ని పొందుతోంది. ఈమె జీవితం చాలా మందికి ఆదర్శం. తాను ఎన్నో రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపింది.
అలానే చాలా దూరం వరకు నడిచేది. అయితే ఆమె తాజాగా పలు విషయాలను షేర్ చేసుకుంది. విజేతగా మానస వారణాసి కప్ గెలిచినా... రన్నర్ అప్ గా మాన్య సింగ్ ఎందరో హృదయాలని గెలుచుకుంది. మాన్య సింగ్ ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చింది. ఈమె ఒక ఆటో డ్రైవర్ కూతురు. పడిన కష్టం ఇంతా, అంతా కాదు.
చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఆమె అనుభవించింది. ఈమె ఎన్నో రోజులు ఆహారం కూడా లేకుండా ఉంది. డబ్బులు లేక పోవడం వలన స్కూల్ కి కూడా ఈమె వెళ్లలేదట. టీనేజ్ లో ఈమె పని లోకి కూడా వెళ్ళేది. ఈమె బాల్యం అందరి చిన్న పిల్లలు లాగ లేదు. చిన్నప్పటి నుండి కష్టాలని భరిస్తూనే వచ్చింది. చదువు అంటే ఎంతో ఇష్టం అయినప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేక పోవడం తో ఈమె దానికి కూడా స్వస్తి చెప్పాల్సి వచ్చింది.
ఈమె తన పద్నాలుగేళ్ళ వయసు లో ఇంటి నుండి పారి పోయింది. కొందరి ఇళ్ళల్లో ఈమె అంట్లు తోమి కష్టపడి డబ్బు సంపాదించేది. అలాగే రాత్రి పూట కాల్ సెంటర్ లో పని చేసి డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బు తో ఈమె చదువుకోవడం మొదలు పెట్టింది. కానీ ఆ స్థాయి నుండి ఇప్పుడు మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచింది అంటే గొప్ప విషయమే కదా...?
VLCC ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీల లో ఈమె రన్నర్ అప్ గా నిలవడం తో ఎంతో మంది ఈమెని అభినందించారు. మాన్య సింగ్ ఉత్తర ప్రదేశ్ లో కృషి నగర్ కు చెందిన అమ్మాయి. ఈమె రన్నరప్ అయ్యాక పలు విషయాలు చెప్పింది. తన జీవితం ఎలా ఉండేది అనే విషయాన్ని ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసుకుంది. కటిక పేదరికం నుండి ఈమె వచ్చింది.
వేరే వాళ్ళు ఇచ్చిన దుస్తులు ధరించే దాన్ని అని చెప్పింది. అలాగే పనికి వెళుతూ ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బులు తో పుస్తకాలు కొనుక్కోడానికి ఖర్చు చేసేదానిని అని చెప్పింది. ఎప్పుడు అదృష్టం నా వైపు లేదు అని బాధ పడేదాన్ని అని ఆమె అంది.
అంతే కాదు పరీక్ష ఫీజు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అటువంటి సమయం లో నగలను నా తల్లిదండ్రులు తనఖా పెట్టారు అని అంది. ఇలా ఎన్నో కష్టాలని దాటుకుంటూ చదవడానికి కష్టపడే దాన్ని అని ఈమె చెప్పడం జరిగింది.
VLCC ఫెమినా మిస్ ఇండియా వేదిక పై నేను ఉన్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులు, తమ్ముడు ఇచ్చిన ప్రోత్సాహమే అని మాన్య ఎంతో ఆనందంగా షేర్ చేసుకుంది. అలానే మరో విషయం కూడా చెప్పింది. అది ఏమిటంటే...? కలలు సాధించాలనే తపన ఉంటే కనుక ఏదైనా సాధించ వచ్చని ఇప్పుడు నేను ప్రపంచానికి చాటి చెప్పగలుగుతున్నాను అని మాన్య సింగ్ చెప్పింది.
ఎన్నో అవరోధాలని దాటుకుంటూ ఎన్నో కష్టాలని భరించి.... ఈ అందమైన జీవితాన్ని, ఆమె కలలని సాకారం చేసుకుంది. నిజంగా మాన్యాని అభినందించే తీరాలి. ఆమె పడిన కష్టానికి, శ్రమ కి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే...!