BREAKING NEWS

బరువు తగ్గాలనుకుంటున్నారా...? అయితే రాత్రిపూట వీటిని తీసుకోండి...!

చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని అనేక ప్రయోగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అవి సక్సెస్ అవ్వక పోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గాలని డైట్ లో  చాలా వాటిని చేర్చడం లేదా  చాలా వాటిని తీసుకోకుండా ఉండడం చేస్తూ ఉంటారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. మీరు కూడా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..?  ఈజీగా మీ బరువుని తగ్గి మరింత అందంగా కనిపించాలని కుంటున్నారా...?  అయితే తప్పకుండా మీరు వీటిని పాటించండి.
 
ఇవి పాటించడం చాలా సులభం. పైగా మీరు రోజుల తరబడి వ్యాయామం చేయడం, బరువులు ఎత్తడం లాంటి కష్టమైన పద్ధతుల్ని అనుసరించక్కర్లేదు. కేవలం ఒక గ్లాసు ఈ డ్రింక్ తో మీరు ఈజీ గా బరువు తగ్గవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా దీని కోసం చూసేయండి. నేటి కాలం లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్స్  తీసుకుంటూ ఉండటం అందరికీ అలవాటు అయిపోయింది. దీంతో బరువు బాగా పెరిగి పోతున్నారు. అటువంటి వాళ్ళు అందరూ కచ్చితంగా ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ ను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గొచ్చు.
 
చమోలి టీ :
 
చమోలి టీ చాలా ఫేమస్. దీని కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇది అందరికీ సుపరిచితమే. దీనిని కనుక మీరు నిద్ర పోయేటప్పుడు తీసుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది. అలానే దీని వల్ల బాడీ లో గ్లైసిన్ పెరుగుతుంది. దీనితో నరాలు రిలాక్స్ అవుతాయి. పైగా ఇది మంచి నిద్రను ఇవ్వడానికి సహాయ పడుతుంది.
 
బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. రాత్రి పూట మీరు నిద్ర పోయేటప్పుడు కనుక దీనిని తీసుకుంటే మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. కనుక దీనిని మీరు ట్రై చేసి ఫాలో అయ్యారంటే కనుక మంచి ప్రయోజనం మీకు లభిస్తుంది.
 
దాల్చిన చెక్క టీ:
 
మనం దాల్చిన చెక్కని కొన్ని కూరలలో,  బిర్యానీలో వేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ టీ కోసం తెలియదు కదా...! కానీ ఇప్పుడు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దాల్చిన చెక్క తో చేసిన టీ ని కనుక మీరు తాగారు అంటే మీకు ఆరోగ్యం కలుగుతుంది. అలానే కొవ్వుని కూడా ఇది తగ్గిస్తుంది. మీకు కనుక దీనిలో స్వీట్ కావాలంటే కొద్దిగా తేనెను కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వలన కూడా సూపర్ బెనిఫిట్స్ పొందవచ్చు.
 
పసుపు పాలు:
 
మామూలుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటివి ఏమైనా ఉంటే ఫ్రీ అవ్వడం కోసం పసుపు పాలని మనం తాగుతూ ఉంటాము. కానీ దీనిలో మరెన్నో పదార్ధాలు ఉన్నాయి. అవి బరువు తగ్గడానికి మరియు ఆరోగ్య సమస్యలని తరిమి కొట్టడానికి  బాగా ఉపయోగ పడుతుంది ఎందుకంటే పసుపు లో యాంటి ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా పాలల్లో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటాయి. ఇది మంచి నిద్రకి తోడ్పడతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక గ్లాసు పాల లో కొద్దిగా పసుపు వేసుకుని నిద్రపోయే ముందు తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా.
 
ప్రోటీన్ షేక్:
 
మామూలుగా వర్కౌట్స్ అవి చేసినప్పుడు ప్రోటీన్ షేక్ లు తీసుకోవడం సహజం. అయితే నిద్రపోయే ముందు కనుక ప్రోటీన్ షేక్ ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మరియు బాడీలో ఉండే క్యాలరీస్ ని బర్న్ చేయడానికి ఉపయోగ పడుతుంది. నిద్రని కూడా ఇది ఇట్టే తెప్పిస్తుంది. మీరు కనుక తీయగా తాగాలి అంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఇందులో మీరు తప్పక తియ్యగా లేని ఆల్మండ్స్ ని  లేదా సోయా మిల్క్ యాడ్ చేసుకోండి. అయితే ఈ ప్రొటీన్ షేక్ ని మీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. ఇది నిజంగా మంచి పద్ధతి అని మనం చెప్పొచ్చు.
 
మెంతులు టీ :
 
మెంతులుని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తాము. వంటల్లో వేయడంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా మెంతులు బాగా పని చేస్తాయి. మెంతులు వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దీనిని ఉదయం అయినా రాత్రి పూట అయినా మనం తీసుకో వచ్చు. ఒంట్లో ఉండే వేడిని ఇట్టే తరిమికొట్టడానికి మెంతులు బాగా ఉపయోగ పడతాయి. అజీర్తి సమస్య తో బాధ పడే వాళ్లకి కూడా ఇది బాగా పని చేస్తుంది.
 
కాబట్టి ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా  లేదా మంచి నిద్ర పొందాలన్నా వీటిని అనుసరించండి వీటి వల్ల ఎంతో సులువుగా మీరు ఆ సమస్యను దూరం చేయవచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి ఆనందానికి కూడా బాగా పని చేస్తుంది. 
 
బరువు తగ్గడానికి కూడా ఈ మార్గాలు చాలా సులువైనవి. మీరు పెద్దగా కష్ట పడక్కర్లేదు కూడా.  మరి ఇంకేమీ ఆలోచించకుండా ఈ పద్ధతిని అనుసరించి ఎంతో ఈజీగా బరువు తగ్గండి. ఆరోజిగా జీవించండి.