BREAKING NEWS

పుల్వామా@ 2019…!

అది
2019 ఫిబ్రవరి 14…
ఒక కాన్వాయ్ లో 40 మంది సీఆర్ పిఎఫ్ జవాన్లు…
జమ్మూ నుంచి వెళ్తుండగా…
సరిగ్గా పుల్వామా ప్రాంతంలో...
పాక్ ముష్క‌రులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆ 40 మంది భార‌త‌ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సైనికులకు నివాళిగా వారి త్యాగాలను మనసారా స్మరించుకుంటూ... ఆనాటి ఘటన తాలూకూ ఘాతుకాన్ని, దాన్ని తిప్పికొట్టిన భారత్ వ్యూహాల్ని ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం.
 
జమ్మూ కాశ్మీర్ లోని పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని, మిగతా భూభాగాన్ని విడదీసే హద్దే... ఎల్ఓసి(లైన్ ఆఫ్ కంట్రోల్). ఇరువైపులా రెండు దేశాల సైనికులు వారి దేశ భద్రత కోసం అప్రమత్తమై పహారా కాస్తుంటారు. అసలు పాక్ ఇండియన్ సైనికులపై దాడి చేసే ముందే కొన్ని దాడులకు దిగింది. అవేంటంటే...
2000 సంవత్సరంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత, కశ్మీర్ భూభాగంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించింది.

◆ మొదటగా 2001 అక్టోబరులో ఢిల్లీలోని పార్లమెంట్ మీద దాడి చేసి 8 మంది సెక్యూరిటీలతో సహా ఒక తోటమాలిని కలిపి మొత్తం 9 మందిని చంపేసింది.

◆ 2016లో కాశ్మీర్ లోని 'యూరి' అనే నగరంలో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ మీద దాడి చేసి, 19 మంది సైనికుల్ని చంపేసింది.

◆ 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో ఒక కాన్వాయ్ మీద దాడి చేసి, 40 మంది సీఆర్ పిఎఫ్ జవాన్లను హతమార్చింది. ఇదే పాక్ సర్జికల్ స్ట్రైక్ గా అనుకుంటుంది పాకిస్తాన్.
వీటన్నిటికీ కారణం కూడా ఈ ఉగ్రవాద సంస్థే!
 
భారత్ ఊరుకుందా...

2001 వరకు జరిగిన దాడుల్ని భారత్ మౌనంగా భరించింది. అందుకు ప్రతీకారం కోరలేదు. 

2016లో జరిగిన 'యూరి దాడి'ని మాత్రం సహించలేకపోయింది. తీవ్ర ప్రతీకారాన్ని కోరింది. 

◆ యూరి అటాక్ జరిగిన 11వ రోజుకు 80 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ పాక్ కళ్లు కప్పి, ఎల్ఓసిను  దాటి, 3 కిలోమీటర్ల దూరం నడిచి, అక్కడి టెర్రరిస్ట్ క్యాంప్ లపై దాడికి దిగింది. దాదాపు 70 మంది ఉగ్రవాదుల్ని చంపి సేఫ్ గా, తిరిగి వెనక్కి వచ్చేసింది. భారత్ సాధించిన మొదటి సర్జికల్ స్ట్రైక్ ఇదే!
 
అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే...

మన శరీరంలో ఏదేని అవయవం సర్జరీకి గురైతే, ఇతర భాగాలకు ఇబ్బంది కలగకుండా, ఆ భాగానికి మాత్రమే చికిత్స జరపడం. అదే విధంగా ఉగ్రవాద సంస్థ తప్పించి, మిగతా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆయా స్థావరాలపై దాడి చేయడాన్ని 'సర్జికల్ స్ట్రైక్' అంటారు.
 
పాక్ పన్నాగం...

◆ పాకిస్తాన్ భారత్ జరిపిన దాడిని సర్జికల్ స్ట్రైక్ గా కాకుండా కేవలం దాడిగా చెప్పుకొచ్చింది. ఎప్పట్లా బార్డర్ లో కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఇద్దరు మాత్రమే మరణించినట్లు చెప్పుకుందే తప్ప, సర్జికల్ స్ట్రైక్ గా ఒప్పుకోలేదు.
 
ఏదొక ఉగ్రదాడి జరిపి, అందులో అమాయక ప్రజల్ని చంపుతూ, తిరిగి మళ్లీ ఏం తెలియనట్టు త్రివ్యూహ ప్రాంతంలో టెర్రరిస్ట్ క్యాంపులను పెట్టి, అవే ఆధారంగా చూపించి, త్వరలో అరెస్ట్ చేస్తామని కళ్లబొల్లి మాటలు చెప్పి సైలెంట్ అయిపోయేది. ఇదంతా నిజమేనని ఊరుకునేవి మిగతా దేశాలు. కానీ ఈసారి భారత్ అవన్నీ నమ్మలేదు. పాక్ హద్దులు దాటి ప్రవర్తించేసరికి సహించలేకపోయింది. 
 
భారత్ వ్యూహం

◆ 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో జరిగిన దాడి గురుంచి మీడియా ఎక్కువ ఫోకస్ చేయడంతో… అదే పనిగా ఆ ఘటనలో మరణించిన వారి గురుంచి టీవీల్లో, పత్రికల్లో వేయడంతో, చెల్లాచెదురుగా పడివున్న వారి శరీర భాగాలను చూపించడంతో, భారత్ మొత్తం ఉడికిపోయింది. దీంతో సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకుంది.

◆ పుల్వామా దాడికి ప్రతీకారంగా, నేరుగా జైషే సంస్థ మీద దాడి చేయాలనుకుంది. భారత్ కి చెందిన ఇండియన్ మిలటరీ ఇచ్చిన పక్కా సమాచారంతో బాలాకోట్ లోని జైషే క్యాంప్స్ లో 350- 400 మంది తీవ్రవాదులు ఉన్నట్లు తెలుసుకుని దాడికి యత్నించింది.

కానీ ఆ సంస్థ స్థావరాలు పాక్ ఎల్ఓసి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల లోపలకు బాలాకోట్ అనే ప్రాంతంలో ఉందని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంది. 

అక్కడ దాడి చేయడం అసంభవమే! ఎందుకంటే నడుస్తూ అంతదూరం ప్రయాణించలేం. యుద్ధ విమానాలను ప్రయోగించాలన్న, పాక్ దాన్ని కనిపెట్టి మన ఫోర్స్ నే నాశనం చేస్తుంది. మరెలా అనుకుంటుండగానే… ఒక దారి దొరికింది.

పది నిమిషాల్లో ఎల్ఓసిను దాటి బాలాకోట్ కు చేరుకొని, నిమిషంలో బాంబులతో దాడి చేసి, ఉగ్రవాదుల్ని చంపేసి, మరో పది నిమిషాల్లో వెనక్కి తిరిగి రావడం. అంటే, మొత్తం 21 నిమిషాల్లో ఇదంతా జరిగిపోవాలి. అసలు అంత ఎక్కువ బరువున్న బాంబులను మోస్తూ వెళ్లడమంటే కష్టమైన పనే! అందుకనీ మిస్సైల్స్ ను వాడింది. అవే మెరైన్స్- 2009 ఎయిర్ క్రాఫ్ట్స్. 
ఎక్కువ బరువు గల బాంబులను మోస్తూ, అతి తక్కువ ఎత్తులో వెళ్లగల మిస్సైల్స్ మనదగ్గర ఉన్నవాటిలో ఇవే మేటివని చెప్పాలి.

వాటి సాయంతో మధ్యప్రదేశ్ లోని వాలియర్ ఎయిర్ పోర్ట్ నుంచి 12 మెరైన్ యుద్ధ విమానాలు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో బయల్దేరి, బాలాకోట్ లోని జైషే స్థావరం మీద దాడికి దిగాయి. ఆ దాడిలో 350 నుంచి 400 మంది పాక్ ఉగ్రవాదులు మరణించారు. 

ఈ స్థావరాల్లోనే పాక్ ఉగ్రవాద సంస్థ పుల్వామా మీద దాడి చేసిన ప్రత్యేక ఫోర్స్ కు శిక్షణ ఇచ్చి, తయారు చేసింది. అదే చోట అటాక్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఉగ్రవాదులతో పాటు, అక్కడ 2వేల మిషన్ గన్లను, 350 హాండ్ గ్రానైట్లను, 200ల రాకెట్ లాంచర్లను, ఎన్నో ఉగ్రవాద ఆయుధాల్ని నాశనం చేసి, ఈ సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతంగా పూర్తి చేయగలిగింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం.
 
భారత్ సర్జికల్ స్ట్రైక్ ను పాక్ ఒప్పుకోలేదు...

కానీ పాక్ మాత్రం ఈ సర్జికల్ స్ట్రైక్ ను అంగీకరించలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ లోకి రావాలని ప్రయత్నిస్తే పాక్ అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ తో తిప్పి కొట్టిందని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భయంతో వెనక్కి తిరిగి వెళ్తూ, బాలాకోట్ లో బాంబులు వేసిందని, అయితే అందులో ఏ ఒక్కరూ కూడా చనిపోలేదని చెప్పుకొచ్చింది.

మరి పాక్ ఎందుకిలా చెప్పుకుందంటే మాత్రం... మేం తీవ్రవాదుల్ని తయారు చేస్తున్నాం. వారిలో ఇంతమంది చనిపోయారని చెప్పుకుంటే, ప్రపంచమంతా ఏకమై పాకిస్తాన్ ను వెలివేస్తుందన్న భయంతో ఇలా మాట మార్చి చెప్పుకొని ఉంటుందని తెలుస్తుంది. 

ఏది ఏమైనా భారత్ పాక్ మీద ప్రతీకార చర్యకు పాల్పడాలనుకోలేదు. కేవలం చనిపోయిన 40 మంది జవాన్లకు గౌరవ చర్యగా ఈ సర్జికల్ స్ట్రైక్ ను చేపట్టాలనుకుంది. అసలు భారత్ ఉద్దేశపూర్వకంగా దాడికి తెగబడితే పాక్ గతి ఏమవుతుంది?! 
 
◆ ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల దినోత్సవంగా చెబుతుంటారు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళిగా ఈరోజును భారత్ ప్రజలు 'బ్లాక్ డే'గా చేసుకుంటున్నాయి.
 
జై జవాన్…
జై భారత్…!