BREAKING NEWS

యుద్ధ మేఘాలను తలపిస్తూ...

ప్రపంచంలోనే జనాభా పరంగా, భూభాగం పరంగా, గ్యాస్ నిలువలు ఎక్కుగా ఉన్న అతిపెద్ద దేశం రష్యా. ఖనిజ సంపద పరంగా, అణు ఆయుధాల తయారీలో అతిపెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉంది. ఈ రెండు దేశాలు ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్నాయి. కానీ కొన్ని దశాబ్దాల కింద అవి విడిపోయాయి. ఇప్పుడు రష్యా తిరిగి ఉక్రెయిన్ దేశాన్ని తమలో కలిపేసుకోవాలని చూస్తుంది. ముందు మాటలతో చెప్పగా వినిపించుకోలేదు. దాంతో ఇప్పుడు పోట్లాడడానికి సిద్ధం అంటుంది. ఉక్రెయిన్ కి సపోర్ట్ గా అమెరికా నిలిచింది. కానీ యుద్ధానికి కాదు, సంధి కుదర్చడానికి... కానీ రేపు జరగబోయే యుద్ధం అంతటితో ఆగుతుందో లేక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో అని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.     

అసలు ఏం జరిగింది...

సోవియట్ విచ్ఛిన్నం తర్వాత 1991 డిసెంబర్ 1న ఉక్రెయిన్ స్వాతంత్ర్య దేశంగా ప్రకటించింది. అలా రష్యా తర్వాత అతిపెద్ద దేశంగా ఉక్రెయిన్ నిలిచింది. అక్కడ దాదాపు 8.13 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో 17.3 శాతం మంది రష్యన్ జాతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ లో రక్షణ, అణ్వస్త్ర, క్షిపణి పరిశ్రమలు, అపార ఖనిజ సంపద నిలువలు ఉన్నాయి. దాంతో ఆ దేశాన్ని రష్యా తమలో కలిపేసుకోవాలనుకుంది. కానీ ఉక్రెయిన్ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – సోవియెట్ యూనియన్ కి వ్యతిరేకంగా పశ్చిమ యూరోపియన్ దేశాలు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసింది) కూటమిలో చేరాలనుకుంది.

అది రష్యాకు నచ్చలేదు. దానికి గల కారణం ఉక్రెయిన్ దేశం హింసకు వ్యతిరేకంగా ఆయుధాలను వాడకుండా ఉండాలని, ఒకవేళ నాటోలో చేరితే భద్రతదళాలు, సైనికులు కలిసి రష్యా సరిహద్దులో మొహరిస్తారని ఆగ్రహించింది. నాటో ఆర్గనైజేషన్ లో ఉక్రెయిన్ ను కలుపోకుండా ఉండాలని మిగతా దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరారు. కానీ ఆ దేశం మాట వినకపోవడంతో 2014 లో ఉక్రెయిన్ ప్రాంతమైన క్రిమియాను రష్యా ఆక్రమించి తనలో విలీనం చేసుకుంది. గత మార్చిలో రష్యా నలుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చింది.

అంతేకాదు ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా సెవొస్తోపోల్ ప్రాంతంలో రష్యా తనకు అనుకూలంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దాంతో నాటో అమెరికా దేశాలు కలిసి ఉక్రెయిన్ రక్షణ కోసం అక్కడికి కొంతమంది సైనికులను పంపించింది. 2021 డిసెంబర్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. రష్యా దూకుడు మానకుంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని జో బైడన్ పుతిన్ ను హెచ్చరించాడు. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులో లక్ష్యన్నర మంది సైనికులను రష్యా మోహరించింది.

ఉక్రెయిన్ ను పూర్తిగా గుప్పిట్లోకి తెచ్చుకుంటే భౌగోళికంగా, ఆర్థికంగా బలపడవచ్చని భావిస్తుంది. అందుకే నాటో కూటమిలో ఉక్రెయిన్ ఎప్పటికి చేరకుండా ఉండేలా హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది.

గ్యాస్ పైప్ లైన్ సమస్య

రష్యా ఐరోపా దేశాలైనా జర్మనీ, ఇటలీకి గ్యాస్, పెట్రోల్ పంపిణి చేస్తుంది. వాటిని ఉక్రెయిన్ దేశం మీదుగా పైప్ లైన్ ద్వారా సరఫరాను కొనసాగిస్తుంది. అందుకుగానూ రష్యా ఉక్రెయిన్ కు ఏటా కొన్ని మిలియన్ల సొమ్మును రాయల్టీగా చెల్లిస్తుంది. కానీ రష్యా చేస్తున్న ఆగడాలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ పాలకులు తమ దేశంలో ఉన్న గ్యాస్ పైప్ లైన్లను తిసేస్తామని బెదిరించింది. దానికి బదులుగా రష్యా బాల్టిక్ సముద్రగర్భంలో ఐరోపా దేశం వరకు గ్యాస్ పైప్ లైన్ల నిర్మాణం చేపట్టింది. దానిని జర్మనీ వరకు పూర్తి చేసింది. దాన్నుంచే ఫ్రాన్స్ కు కూడా సరఫరా చేస్తానని రష్యా ప్రతిపాదన చేసింది.

జలవివాదం...

2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. క్రిమియాలో మొత్తం 25 లక్షల మంది నివసిస్తుండగా అందులో అత్యధికులు రాష్యన్లే కావడం విశేషం. అప్పట్లో సోవియట్ యూనియన్ నిర్మించిన కెనాల్ నుంచే దాదాపు 80శాతం సాగు నీరుని క్రిమియా ప్రజలు వారి అవసరాలు కోసం వాడుకునేవారు. కానీ 2014లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ డెనిపర్ నదిపైన ఒక ఆనకట్టను నిర్మించింది. దాంతో క్రిమియా ప్రజల నీటి అవసరాల కోసం రష్యా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమిస్తే నీటి సమస్య తీరుతుందని ఉహాగానాలు వస్తున్నాయి.

రక్షణ కవచంలా..

1812లో నెపోలియన్ దండయాత్ర జరిగినప్పుడు రష్యను పశ్చిమంగా ఉన్న ఉక్రెయిన్ కాపాడింది. దాంతో రష్యాకు ఉక్రెయిన్ మిగితా దేశాల దాడిలో అడ్డుగోడగా ఉందని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థలో పొలిటకల్ అండ్ ఫ్యూచర్స్ వ్యవస్థాపకుడు జార్జ్ ఫ్రిడ్మాండ్ వివరించారు.

ఉక్రెయిన్ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ప్రభుత్వంలో పుతిన్ మద్దతుదారుని అధికారంలోకి తీసుకురావాలనుకున్నాడు. కానీ అది జరగకపోవడంతో మరింత కోపం పెంచుకున్నాడు.

ఉక్రెయిన్ లో ఉన్న అమెరికా దౌత్య ఉద్యోగులను స్వదేశానికి రావాలని యూఎస్ఏ అధ్యక్షుడు జోబైడన్ స్పష్టం చేశారు. ఒకవేళ వారిని తీసుకురావడానికి సైన్యాన్ని పంపిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

న్యూజిలాండ్ కూడా తమ ఉద్యోగులను స్వదేశానికి రావాలని చెప్పింది. బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న వేళా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ వివరించారు.

భారత్ కి ముప్పు...

ఒకవేళ యుద్ధం జరిగితే దాని ప్రభావంతో గల్ఫ్ లోని ఖతార్ లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆ గ్యాస్ ను ఇక్కడ ఎరువుల తయారీలో వాడుతున్నారు. అలాగే విద్యుత్ రంగానికి కూడా కొంత గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దాదాపు 18 వేల మంది భారతీయులు వైద్యవిద్యను అభ్యసించడం కోసం ఉక్రెయిన్ కు వెళ్లారు. అలా వారికీ కూడా ముప్పు పొంచి ఉంది.