BREAKING NEWS

మ్రోగింది ఎన్నికల నగారా

దేశవ్యాప్తంగా మ్రోగింది ఎన్నికల నగారా. 10-03-2019 రాత్రి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు విడతల్లో దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలతో సహా  నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తమైంది.  ఈసారి చాలా పకడ్బందీ గా కఠిన నియమావళితో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉంది ఎలక్షన్ కమిషన్.

EVM ల పనితీరు పై తరచూ విమర్శలు వస్తున్నాయని ఈ సారి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు..  అన్ని చోట్లా వీ.వీ.పాడ్ ల తో కూడిన EVM లు ఉపయోగించనుంది. దీంతో ఓటరు ఎవరికి ఓటు వేశారు అనే విషయం క్లారిటీగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక అభ్యర్థుల విషయంలో కూడా ఈసీ పకడ్బందీగా ఉంది... నామినేషన్ల సమయంలో అభ్యర్థి పాన్ కార్డ్ తప్పనిసరి చేయడమే కాకుండా తమపై ఉన్న క్రిమినల్ మరియు కరప్షన్ కేసుల వివరాలను తెలియజేయాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంచింది....

స్వయంగా అభ్యర్ధులే ఆ విషయాలను ప్రజలందరికీ తెలిసేలా మూడుసార్లు పత్రికా/టివి ప్రకటన ఇవ్వవలసిందిగా నిబంధన విధించడం హర్షణీయం. దీని వల్ల మరొకరు విమర్శించే పని లేకుండానే అభ్యర్ధుల విశ్వసనీయ చరిత్ర తెలుస్తుంది. ఇక మిగతా డబ్బు రవాణా, సొషల్ మీడియా తదితర అంశాలలో కూడా పక్కా ప్రణాళికతో ఉంది.
 
                   ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలోనే అంటే ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకేసారి పెట్టింది. ఇది ఒక విధంగా పార్టీలన్నింటికి షాక్ లాంటిదే. ముందుగా అందరూ అనుకున్నట్లు ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికలు పెట్టి ఉంటే అన్ని పార్టీలకు సమయం ఉండేది... అయితే ఇప్పుడు కేవలం నెల రోజులు సమయం ముందు మాత్రమే షెడ్యూల్ ప్రకటించి ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.  పార్టీలేవీ కూడా ఇంకా పూర్తిగా అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు చేయలేదు.

ఈ విషయంలో టి.డి.పి. మరియు వై.సి.పి మాత్రమే కాస్త ముందంజలో ఉండి అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసాయి. జనసేన, భా.జ.పా , కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇంకా అయోమయంలో ఉన్నట్లుగానే కన్పిస్తున్నాయి. ఏ స్థానంలో ఎవరు పోటీ చేయాలి అనే విషయంపై ఎవ్వరికీ క్లారిటీ లేనట్టుగా అనిపిస్తోంది... అభ్యర్ధుల జంపింగ్ లు మొదలైన ఎత్తుగడలకు కూడా సమయం లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టి.డి.పి. మరియు వై.సి.పి మధ్య మాత్రమే ప్రధాన పోరు నెలకొనడం ఖాయం. ఇక ఎవరి పార్టీ వ్యవహారాలు వారు చూస్కోవడానికే తప్ప, గిఫ్ట్ లు, రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
 
                   మన రాష్ట్రం లో తెలుగు దేశం పార్టీ కియా, ఇసుజు, హోండా, హీరో పరిశ్రమల రాక, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్ట్ లు, నదుల అనుసంధానం, రాజధాని నిర్మాణాలు, ఏ.పి. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్, ఆర్.టీ.జీ. ,  లాంటి అభివృద్ధి పనులు తో పాటు, ఎన్టీయార్ భరోసా పెన్షన్ (3000 రూ), ఎన్టీయార్ సుజల(2 రూ కి 20 లీటర్ల మంచి నీరు)పథకం, అన్న క్యాంటీన్లు, ఎన్టీయార్ వైద్యసేవ, రైతు రుణమాఫీ, జన్మభూమి, బడి పిలుస్తోంది, పసుపు కుంకుమ పథకం, కాపు, బ్రాహ్మణ మొ||  కమ్యూనిటీ కార్పొరేషన్ లు వంటి అంశాలు ఎన్నికల అస్త్రాలు గా బరి లో దిగుతుండగా, వై.సి.పి. నవ రత్నాలు, ప్రత్యేక హోదా, వైయస్సార్ ఇమేజ్ వంటివి ప్రచారాస్త్రాలు గా ముందుకు దూకుతోంది.
                      
                 ఏది ఏమైనా రానున్న నెల రోజులు రాష్ట్ర వ్యాప్తం గా ఎన్నికల కోలాహలం ఆకాశాన్నంటుతుంది. ఇంక సందడే సందడి. చూద్దాం.....

Photo Gallery