BREAKING NEWS

దీర్ఘ కాల దార్శనికత ఉన్న సరైన నాయకుడి చేతిలోనే మన రాజధాని నిర్మాణం

సమయం చాలా విలువైనది. ఒకసారి గడిచిపోయిన కాలం మళ్లీ తిరిగి రాదు అని మనందరికీ తెలుసు. కాబట్టి మనం ప్రతి క్షణం ఆస్వాదిస్తూ గడపాలి. చేయవలసిన పనులు వాయిదా‌ వేయకుండా త్వరగా, వీలయినంత వేగంగా చేయాలి అని పెద్దలు చెబుతుంటారు.  తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం ముఖ్యం.
           
అయితే అన్ని వేళలా ఆ‌ సూత్రం‌ వర్తించకపోవచ్చు. " ఆలస్యం అమృతం విషం " అని చెప్పిన పెద్దలే  " నిదానమే ప్రధానం " అని కూడా అన్నారు. అంటే కాలంతో పోటీ పడే తొందర లో ఆ కాలం కూడా మాన్పలేని తప్పులు చేయకూడదు. ఉదాహరణకు సమయాన్ని ఆదా చేద్దామనే ఆత్రుతతో గంట పట్టే ప్రయాణాన్ని అరగంట లో ముగించేంత వేగం  ప్రాణానికే ప్రమాదం. కాలం‌ కన్నా ప్రాణమే గొప్పది కదా‌ కచ్ఛితంగా‌.  అలాగే మన భవిష్యత్ ను నిర్ణయించే అంశాలలో తొందరపాటు కన్నా నిదానంగా ఆచితూచి వ్యవహరించడమే మంచిది.
     
" బాహుబలి "  తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన చిత్రం. తెలుగు సినీ ఘనత ను ప్రపంచ వ్యాప్తం గా చాలా బలంగా చాటిన చిత్రం. అయితే  ఈ చిత్ర నిర్మాణానికి షూటింగ్ కే అయిదు సంవత్సరాలు పట్టింది. కేవలం " గ్రాఫిక్స్ " కే చిత్రీకరణ లో అత్యధిక‌ సమయం తీసుకున్నారు.   అయినప్పటికీ ఎక్కడా‌ రాజీ పడకుండా నిర్మించడం వల్ల , నటీనటులతో సహా అందరి " సహకారం " వల్ల ఆ సినిమా అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. ఇంత ఆలస్యం ఏమిటా అని ఒకింత విసుక్కున్న జనమే సినిమా చూసిన తర్వాత అందుకు తగ్గ విలువైనదే  అని ప్రశంసలతో ముంచెత్తారు.

ఇక కథా రచన, ప్రీ-ప్రొడక్షన్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ "సమయమే"  తీసుకున్నారు. అందుకే ఇంగ్లీష్ లో ఒక నానుడి ఉంది. " GREAT THINGS TAKE TIME "   అని. ఇదంతా ఒక గొప్ప విజన్ , అనుభవం ఉన్న దర్శకుడి వల్ల సాధ్యమైంది. 

హాలీవుడ్ లో అయితే షూటింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ కన్నా  "స్క్రిప్ట్‌ రైటింగ్ & ప్రీ ప్రొడక్షన్" కే ఎక్కువ సమయం తీసుకుంటారు. "ప్లానింగ్" పక్కాగా ఉంటే మిగతా అన్నీ చాలా సునాయాసంగా, సమయం, ధనం వృధా కాకుండా జరిగిపోతాయని వాళ్ల నమ్మకం. అదే నిజం కూడా. ఇదంతా కేవలం మనకు రెండు గంటల వినోదాన్ని పంచే సినిమా గురించి మాత్రమే.

మరి వందల సంవత్సరాల భవిష్యత్‌ కలిగి ఉండే ఒక నగర నిర్మాణానికి, అందునా కోట్లాది ప్రజల జీవితాల్ని శాసించే  ఒక‌ రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి అంతకుమించిన  ప్రణాళిక, నిరుపమాన దార్శనికత అవసరం.
          
గందరగోళం గా, హడావిడిగా జరిగిన విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా‌ నష్టపోయింది. కనీసం రాజధాని గురించి నామమాత్రపు ప్రస్తావన కూడా లేకుండా, పదేళ్లు "హైదరాబాద్" ను వాడుకుని, మీకు నచ్చిన చోట రాజధాని కట్టుకోండి, అనే ఉచిత సలహా మాత్రం ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. మరి రాజధాని ని ఎక్కడ, ఎలా‌ నిర్మించాలి ? దానికి ఏమేం కావాలి ? మొదలగు ఎన్నో ప్రశ్నలు. దానికి‌ పుర్రెకో  రకరకాల ఆలోచనలు, ప్రతిపాదనలు.
          
కానీ రాజధాని విశేషణాల గురించి ఎన్నో థియరీలు ఉన్నప్పటికీ, ప్రాథమికం గా ఉండాల్సినవి రాష్ట్ర ప్రజలందరికీ ఇంచుమించు సమాన దూరంలో అంటే రాష్ట్రం మధ్యలో ఉండి, నీటి వసతి, రవాణా సదుపాయాలు, అవసరాలకు తగినంత భూమి లభ్యత  మొదలైనవి అనేది అందరూ అంగీకరించే విషయం. ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా అలాంటి ప్రాంతమైన విజయవాడ , పరిసర నగరాలను కలుపుకుని రాజధాని గా అభివృద్ధి చేయాలని విభజన తర్వాత ఎన్నికైన తెలుగుదేశం ప్రభుత్వం. 
          
అయితే రాజధాని అంటే కేవలం నాలుగు పరిపాలనా భవనాల నిర్మాణం  మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రానికి ముఖ ద్వారం. రాష్ట్రం స్థాయికి మచ్చు తునక.  రాష్ట్ర ప్రజల ఆశా దీపిక. ఎందుకంటే ఉన్న ఊరిలో ఏ ఇబ్బంది కలిగినా మన రాజధానికి పోయి ఆనందంగా ఉపాథి పొందొచ్చు అనే భరోసా సామాన్య ప్రజలలో కలగాలి. భవిష్యత్ లో పెరగబోయే, రాబోయే జనాభా ను ఇముడ్చుకోవాలి. ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ మొదలైన రాష్ట్ర రాజధానులన్నీ అలాంటి కోవకు చెందినవే. ఆ నగరాలు ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందటంలో కీలకం అనేది మరవరాదు. మన కొత్త రాజధాని వాటిని మించి ఎదగాలి.
          
1.  అందుకు కావలసిన సమగ్ర ప్రణాళిక తయారు చేసిన ప్రభుత్వం భవిష్యత్ అవసరాలతో కలుపుకుని  రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూమి అవసరం అని నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నో అడ్డంకులను దాటుకుని, న్యాయ పరమైన అవరోధాలు  అధిగమించి కృష్ణా, గుంటూరు జిల్లాలోని రైతులను ఒప్పించి భూసేకరణ చేసింది. ఇందుకు మెజారిటీ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ప్రభుత్వమే గనుక బలవంతం గా లాక్కొని ఉంటే పవన్ కళ్యాణ్, జగన్ లాంటి నాయకులు ఇచ్చిన బలంతో ఒక ప్రజా ఉద్యమమే జనించేది. కానీ ఎలాంటి ఉద్యమం రాజధాని రైతుల నుంచి పుట్టలేదు. ఆ విధంగా భూ సేకరణ పూర్తి అయ్యింది.
 
2. తర్వాత ఎక్కడెక్కడ ఏమేం రావాలో నిర్ణయించే బ్లూ ప్రింట్  మరియు నిర్మాణ సంస్థ ను నిర్ణయించడం. తక్కువ వనరులతోనే అత్యున్నత అభివృద్ధి సాధించిన సింగపూర్ దేశ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆ దేశపు సంస్థ ను నిర్మాణ భాగస్వామిని చేసుకుంది. పర్యాటక అభివృద్ధి తో సహా మొత్తం యాక్షన్ ప్లాన్ నిర్ణయించింది. 
 
3. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, కనెక్టింగ్ హై వేస్, బ్రిడ్జిస్ మొదలగు నిర్మాణాలకు వినూత్న డిజైనింగ్ ఉండేలా ఆప్షన్స్ ఇచ్చి సోషల్ మీడియా లో ప్రజామోదం పొందిన ఆకృతులు నిర్మాణానికి ఎంచుకుంది. 
 
4. ప్రధాన నిర్మాణాలకు ఎక్కువ సమయం పదుతుంది కాబట్టి, ఈలోగా తక్షణ పరిపాలనా సౌలభ్యం కోసం "తాత్కాలికం" గా అసెంబ్లీ, సచివాలయం, హై కోర్ట్ మొదలైన భవనాలు నిర్మించి పరిపాలన నిర్వహించడం మొదలుపెట్టింది. అయితే చాలా మంది అనుకున్నట్టు తాత్కాలిక భవనాలు అంటే సినిమా సెట్టింగుల్లా కాదు... భవనాలు శాశ్వతమే...కాకపోతే పూర్తి స్థాయిలో భవనాలు ఏర్పాటు అయ్యేంత వరకే ఈ భవనాల్లో పాలన ఉంటుంది. తర్వాత పర్మినెంట్ బిల్డింగ్ లోకి మారుస్తారు.
 
5. వీటన్నింటికీ తోడు ఎవరెవరో వేసిన కేసులు, నిధుల కొరత మొదలగు అడ్డంకులు దాటుకుని నిర్విఘ్నంగా రాజధాని నిర్మాణం శర వేగంగా జరుగుతోందనే చెప్పొచ్చు. 

ఇదంతా కేవలం నికరంగా నాలుగేళ్ల వ్యవధిలోనే జరిగిందంటే కఛ్చితంగా అద్భుతం అనే చెప్పాలి. అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది అని గ్రహించాలి. అప్పుడే దీర్ఘ కాలంలో అనుకూల  ఫలితాలు వస్తాయి. 

ఎందుకంటే " Even ROME wasn't BUILT in a DAY " . దీర్ఘ కాల దార్శనికత ఉన్న సరైన నాయకుడి చేతిలోనే మన రాజధాని నిర్మాణం ఇలాగే కొనసాగి, ప్రపంచ స్థాయి నగరం ఆవిష్కృతం అవుతుంది అని ఆశిద్దాం.