BREAKING NEWS

ఎన్నికలకు సిద్ధం....

ఎన్నికలు.. ప్రతి 5 సంవత్సరాల కి ఒకసారి వచ్చే ఈ సాధారణ ఎన్నికలు ప్రజల జీవితాలని మారుస్తాయా?? అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలను పట్టించుకుంటారా?? ఈ సారి ఎన్నికలలో విజయం ఎవరిది?? ఆంధ్రరాష్ట్రం ఎన్నికలకు సిద్ధమైంది.

షెడ్యుల్ కూడా ఇప్పటికే ప్రకటించేశారు... ఏప్రిల్ 11వ తేదీన మన రాష్ట్రంలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి .. దీనికి సంబంధించి ఈ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది... అయితే ఈ సారి ఎన్నికల్లో కొన్ని కొత్త విధానాలు అమల్లోకి తీసుకువచ్చారు అధికారులు...

వాట్సప్, ఫేస్బుక్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియా. రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారానికి సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దేని కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మేనేజర్ లని కూడా నియమించుకున్నారు... ఇప్పుడు ప్రతీది కమర్షియల్ అయిపోయింది.

అలాగే ఫేస్బుక్ లో కూడా "పెయిడ్" ప్రమోషన్స్ ను అందిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.  మనం అప్లోడ్ చేసిన పోస్ట్ ఎంత మందికి రీచ్ అవ్వాలి అనే విషయము పై ఈ ధరలు ఉంటాయి. ప్రతీ అభ్యర్థికి ఎన్నికల్లో కొంత మొత్తం మాత్రమే ఖర్చు పెట్టాలి అనే నిబంధన ఉంది. సో... ఇకపై ఏ రాజకీయ నాయకులు అయినా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా లో చేసిన ప్రచారం కూడా అతని ఎన్నికల ఖర్చు ఖాతాలో చేరుస్తారు అధికారులు... ఇక పత్రికలకు ఇచ్చే ప్రకటనలు కూడా ముందుగా అధికారుల వద్ద అనుమతి తీసుకోవలసి ఉంటుంది. 

ఈ సారి ఎన్నికల్లో  మరో వినూత్న విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు ఎన్నికల అధికారులు. "సీ విజిల్" పేరుతో తయారుచేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఎన్నికల కోడ్ ను ఎవరైనా అభ్యర్థి పాటించడం లేదు అని తెలిస్తే మీరే స్వయంగా ఆ ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయచ్చు... ఎన్నికల అధికారులు వారిపై చర్యలు కూడా తీసుకుంటారు.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, షాడో టీం లు, ప్రత్యేక బృందాలు విధుల్లో ఉంటారు. అభ్యర్థి ఖర్చులు వివరాలు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు... 

ఇక ఎన్నికల ముందే తమ తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో కన్నా సులువుగా ఉండేందుకు 1950 నెంబర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నెంబర్ కి ఫోన్ చేసి మన ఓటరు ఐడి కార్డ్ నెంబర్ చెప్తే చాలు , ఓటు ఎక్కడ ఉంది అనే విషయం సింపుల్ గా చెప్పేస్తారు. లేదా అందరి చేతిలోనూ ఎలాగూ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి "ఓటర్ హెల్ప్ లైన్" యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు ఎంటర్ చేయండి చాలు... పోలింగ్ బూత్ తో సహా అన్ని వివరాలు తెలుస్తాయి.. ఇక తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఇక భయపడాల్సిన అవసరం లేదు.

కోడ్ అమలులో ఉంది కాబట్టి ఓట్లు తొలగించే అవకాశం లేదు. ఇకపోతే మార్చ్ 15వ తేదీ వరకు కొత్త ఓటర్లను చేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే ఫాం 6 ఫిల్ చేసి సంబంధిత అధికారులకు ఇవ్వాలి. లేదా ఆన్లైన్ లో కూడా అప్లై చేస్ అవకాశం ఉంది. 

సో. గెట్ రెడీ టూ ఓట్... ఎన్ని పనులు ఉన్నా ఏప్రిల్ 11వ తేదీ ఒక్క రోజు పక్కన పెట్టండి. మన భవిష్యత్ ను డిసైడ్ చేసే ఈ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి... మీ ఓటు హక్కు వినియోగించుకోండి... భావి భారత పౌరులకు బంగారు భవిష్యత్తు ఇప్పుడు మీ, మా, మనందరి చేతుల్లోనే ఉంది ... 
 
LOCK THE DATE " APRIL 11 "

Photo Gallery