BREAKING NEWS

2 , 3 నియోజకవర్గాల నుండి ప్రముఖుల పోటీ

        ఒక రాజకీయ పార్టీలో అగ్ర స్థానంలో ఉన్న నాయకులు ఎన్నికలలో రెండు , లేదా మూడు నియోజకవర్గాల నుండి పోటీ చేసే సంప్రదాయం పూర్వం నుండీ వస్తున్నదే.

అత్యంత జనాకర్షణ ఉన్న వ్యక్తులు పోటీ చేసే స్థానాలలో ఇతర పార్టీ అభ్యర్థులు కనీసం నామినేషన్ వెయ్యడానికే భయపడే రోజులనుండి , అదే సెలెబ్రెటీలు కనీసం ఒక స్తానం నుండైనా గెలవక పోతానా అని  అనేకానేక సమీకరణాల మధ్య , సర్వేల ఆధారంగా నామినేషన్ వేస్తున్న రోజులు వచ్చాయి అంటే ..

అది నిజంగా ఓటర్లలో వచ్చిన రాజకీయ చైతన్యమే ..
సెబాష్ ..ఇది అందరం ఆహ్వానించదగిన మార్పు..
ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలించి , ఒక అభ్యర్థి ఒక స్తానం నుండి మాత్రమే పోటీ చేసేలా అవసరమైన మేరకు నిబంధనలు మార్చి ,ప్రజాధనం వృధా కాకుండా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ..
.
          అదే సంప్రదాయాన్ని నేడు కూడా కొంతమంది ప్రముఖులు పాటిస్తున్నారు. అయితే ..అసలు ఒక స్థానం నుండి గాక రెండు లేదా మూడు స్థానాలనుండి పోటీ చేయడం ఎందుకు ?? దీనివలన ఎవరికి నష్టం ??
ఎవరికి లాభం ?? ఇలా రెండు , మూడు స్థానాలలో పోటీ చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటి ??
ఇలాంటి సందర్భంలో నాటి పరిస్థితులు ఏంటి? నేటి పరిస్థితులు ఏంటి?? ఓ సారి పరికిద్దాం !!! ఆనాటి రోజులలో శ్రీమతి ఇందిరాగాంధీ , శ్రీ నందమూరి తారకరామారావు , శ్రీ నరేంద్రమోదీ మొదలైన వారు ఒకటి కంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేసి గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే .

 అప్పటి కాలమాన పరిస్థితి బట్టి, పార్టీకి చెందిన ముఖ్యులు తమ ప్రాంతంలో పోటీ చేయడం వలన ఓటర్లలో తీవ్ర ప్రభావం చూపించేది.తమ అభిమాన నాయకులను దగ్గరగానూ , తరచుగాను చూసుకోవచ్చు అనే ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడేది. మిగిలిన పార్టీ అభ్యర్థులు ఎంత బలమైన వారైనా నామినేషన్ వెయ్యడానికే భయపడే పరిస్థితి ఉండేది.. వేసినా తప్పనిసరిగా ఓటమి చెందేవారు.

సెలెబ్రెటీల పోటీ వలన ఆ ప్రాంత పరిధిలో ఉన్న అదే పార్టీకి చెందిన బలహీనమైన అభ్యర్థులు కూడా ఆటోమేటిక్ గా విజయం సాధించేవారు. తత్ఫలితంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరిగేవి.

తరువాత ఒక స్థానాన్ని ఉంచుకుని మిగిలిన స్థానాలకు రాజీనామా చేయడం , ఉప ఎన్నికలు జరగడం , అధికారపార్టీ అభ్యర్థి గెలవడం చక చకా జరిగిపోయేవి.
కానీ రాను రాను పరిస్తుతులు మారాయి.ఓటర్లలో అవగాహనాశక్తి పెరిగింది.

ఎక్కడనుండో వచ్చిన వ్యక్తిని మనం గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటారా??
పోనీ కష్టపడి గెలిపించినా .. ఆ వ్యక్తి రాజీనామా తప్పనిసరి .. అప్పుడు మళ్ళీ ఎన్నికలు .
మరో అభ్యర్థికి మళ్ళీ ఓటు వెయ్యాలి.తమకు వ్యక్తిగతంగానే గాక వెంటనే రెండోసారి ఎన్నికల ఖర్చు పేరుతో ప్రజా ధనం వృధా అవడం .. ఇవన్నీ అవసరమా ...?? అదిగో !! అలాంటి ఆలోచనల ఫలితంగానే  నాడు NTR , నిన్న చిరంజీవి లాంటి అత్యంత ప్రజాదరణ ఉన్నవారు సైతం ఓటమి చవి చూసారు..
               అత్యంత జనాకర్షణ ఉన్న వ్యక్తులు పోటీ చేసే స్థానాలలో ఇతర పార్టీ అభ్యర్థులు కనీసం నామినేషన్ వెయ్యడానికే భయపడే రోజులనుండి ,
అదే సెలెబ్రెటీలు కనీసం ఒక స్తానం నుండైనా గెలవక పోతానా అని  అనేకానేక సమీకరణాల మధ్య , సర్వేల ఆధారంగా నామినేషన్ వేస్తున్న రోజులు వచ్చాయి అంటే .. అది నిజంగా ఓటర్లలో వచ్చిన రాజకీయ చైతన్యమే .. సెబాష్ ..ఇది అందరం ఆహ్వానించదగిన మార్పు.. ఇదే సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిశీలించి , ఒక అభ్యర్థి ఒక స్తానం నుండి మాత్రమే పోటీ చేసేలా అవసరమైన మేరకు నిబంధనలు మార్చి ,ప్రజాధనం వృధా కాకుండా కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ...

Photo Gallery