BREAKING NEWS

ఆన్లైన్ జాగ్రత్తలు.

ఆన్లైన్.... ప్రస్తుతం ఈ ఒక్క పదం మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది... చిన్న స్పూన్ దగ్గర నుంచి బైక్ ల వరకు అన్నీ అన్ లైన్ లోనే కొనేస్తున్నారు... ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు... కావాల్సినవి అన్నీ సింగిల్ క్లిక్ తో మన ముందు ఉంటున్నాయి.

పెరుగుతున్న టెక్నాలజీ , సదుపాయాలు మనిషిని స్మార్ట్ గా మారుస్తోందా... లేదా టెక్నాలజీకి బానిసగా మారుస్తోందా. ఇంతకీ ఆన్ లైన్ లో కొనాల్సిన వస్తువులు ఏమిటి??? కొనకూడనవి ఏమిటి???ఆన్ లైన్ షాపింగ్ లో  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
                  మనం తినే ఫుడ్ నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వరకు ఆన్ లైన్ మయమే... చేతిలో స్మార్ట్ ఫోన్, నెట్ బాలెన్స్ లేని వాళ్ళు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న ఆండ్రాయిడ్ అప్లికేషన్స్... ఒక్కో అవసరానికి ఒక్కో యాప్... అయితే ఇలా ఆన్లైన్ పై ఆధారపడడం ఒక రకంగా అప్ గ్రేడ్ అవుతున్నాం అనే చెప్పాలి.

ఎందుకంటే ఉరుకుల పరుగుల ఈ జీవితంలో సమయం చాలా విలువైంది... ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అలాంటి వారిని ఈ ఆన్లైన్ కల్చర్ బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. కూర్చున్న చోటు నుంచే ఒక పక్క తమ ఆఫీస్ పని చేసుకుంటూనే మరో వైపు షాపింగ్ చేయడం లాంటి సొంత పనులు కూడా కానిచ్చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ లో కన్నా ఆన్లైన్ లోనే ఎక్కువ మంది వినియోగదారులు షాపింగ్ చేస్తున్నారు అంటే ఎంతగా ఆన్లైన్ కు అలవాటు పడిపోయామో తెలుస్తోంది. 

                    ఇంతకీ ఈ ఆన్లైన్ లో కొనుగోలు చేయడం వలన మనకు వచ్చే లాభం ఏమిటి అని కొంత మంది అనుకోవచ్చు. కానీ బయట మార్కెట్ లో దొరికే ధరకు ఆన్లైన్ లో ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది... ఉదాహరణకు బ్రాండెడ్ జీన్స్ ధర మాల్ లో 4999 ఉంటే అదే మోడల్, అదే బ్రాండ్ జీన్స్ ఆన్లైన్ లో కేవలం 1999 కే లభిస్తుంది. షాపింగ్ మాల్స్ లో అయితే ఒక్కో బ్రాండ్ కు ఒక్కో దగ్గరకి తిరగాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ అయితే అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర లభిస్తాయి. అది కూడా చాలా తక్కువ ధరకు.

అయితే చాలా మందిలో ఒక అపోహ ఉంది. బయట మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్మే అదే వస్తువు ఆన్లైన్ లో 60 శాతం వరకు డిస్కౌంట్ ధరకు ఎలా ఇవ్వగలరు అని ... ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి... పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ వివిధ సందర్భాలలో ఆఫర్స్ పేరుతో 70 శాతం కూడా డిస్కౌంట్లు ఇచ్చారు.

7000 ఉండే పట్టు చీర కేవలం 3000 కు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి... అంత పెద్ద మాల్ మెయింటెయిన్ చేసే వాళ్ళే ఈ రేంజ్ లో డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాంటిది డైరెక్ట్ గా కంపెనీతో ఒప్పందం చేసుకుని విక్రయించే ఆన్లైన్ ప్లాట్ ఫాం లో తక్కువ ధరకు అదే బ్రాండ్ బట్టలు ఎందుకు ఇవ్వలేరు... 

                     ఆన్లైన్ లో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే అవి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి... ముఖ్యంగా కాస్మోటిక్స్ కొనే సమయంలో ఆచి తూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఆన్లైన్ లో లభించే కాస్మోటిక్స్ లో చాలా వరకు ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నట్లు సర్వేల్లో తెలిసింది. దాని తర్వాత స్థానంలో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి...

ఇవి తీసుకునే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు ఆన్లైన్ లో ఎవ్వరికీ చెప్పకూడదు... కార్డ్ ఫోటోలు కూడా షేర్ చేయకూడదు. ఆర్థిక నేరగాళ్లు ఈ ఆన్లైన్ షాపింగ్ చేసే వారినే టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కార్డ్ లు,  నెంబర్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

Photo Gallery