ఒకప్పుడు రాజకీయాలు, సినీ రంగం రెండూ వేర్వేరు రంగాలు. రాజకీయ నాయకులు, కథానాయకులు ఎవరి పనులు వారు చేసుకునే వాళ్లు. సినిమావాళ్లు రాజకీయాలను టచ్ చేసేవారు కూడా కారు. అయితే ఎప్పుడైతే ఎన్టీయార్ "తెలుగుదేశం" పార్టీ స్థాపించి అతి తక్కువ సమయం లో ఘన విజయం సాధించారో అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సినిమా "స్టార్" ల ప్రభావం మొదలయింది.
అప్పటి రాజకీయ శూన్యత, ప్రత్యామ్నాయం లేకపోవడం మొదలైన కారణాలకు మించి ఎన్టీయార్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్, స్టార్ పవర్ వల్లనే అంతటి ఘన విజయం సాధ్యమైందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.... ఆ విధంగా సినిమా హీరోలకు ప్రజలలో ఉండే క్రేజ్ ప్రజాస్వామ్య రాజకీయాలకు ఉపయోగపడుతందని నిరూపితమైంది.
అంతేకాదు, ఎన్టీయార్ ను ఎదుర్కోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరో బడా మాస్ "హీరో" కృష్ణ ను రంగం లోకి దింపింది. అప్పట్లో ఈ ఇద్దరి మాస్ హీరోల మధ్య రాజకీయ సమరంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మొదటిసారి సినీ సూపర్ " స్టార్ " వార్ మొదలయ్యింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్స్ లోనూ ఎంతో కొంత సినీ గ్లామర్ కన్పిస్తూనే ఉంది. తర్వాతి కాలంలో 2008 లో తృతీయ ప్రత్యామ్నాయంగా మరో మాస్ స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమై విఫలమయ్యాడు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. 2009 పవన్ ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించగా, జూ"ఎన్టీయార్ తెలుగుదేశం తరఫున ఉధృత ప్రచారం చేయడం విశేషం.
ఇక ప్రస్తుత ఎన్నికల ముఖ"చిత్రం" చూస్తే చాలామంది నటులే కన్పిస్తున్నారు రాజకీయాల్లో. అలీ, జయసుధ, భానుచందర్, కమెడియన్స్ పృథ్వీ, కృష్ణుడు, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, శివాజీ రాజా, తనీష్, మొదలగు తారలు వరుసగా వైసీపీ లో చేరిపోయారు. రోజా ఇప్పటికే వైసీపీ M.L.A. గా ఉన్నారు. మోహన్ బాబు మద్దతు ఉంది.
అయితే సినీ రంగాన్ని శాసించిన, శాసిస్తున్న మాస్ ఇమేజ్ ఉన్న కుటుంబాలు మూడు : నందమూరి, ఘట్టమనేని, కొణిదెల.వీరిలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకున్న పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి ,2014 లో టిడిపి కి మద్దతు ఇవ్వగా , ఇప్పుడు సొంతంగా పోటీకి సిద్ధమై చాలా అగ్రెసివ్ గా సమాజంలో మార్పు రావాలని నినదిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నాడు. తన అన్నయ్య నాగబాబు ని నర్సాపురం ఎం.పి.బరి లో నిలిపాడు. ఇంకా రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు.
ఇక నందమూరి కుటుంబం కి తెలుగుదేశం సొంత పార్టీ . బాలకృష్ణ టిడిపి ఎమ్మెల్యే కాగా, ప్రచారం చేసినా చేయకపోయినా జూ'ఎన్టీయార్ మద్దతు ఎప్పుడూ తెలుగుదేశంకే అని ఎప్పుడో చెప్పాడు. కృష్ణ, మహేష్ బాబు నేరుగా మద్దతివ్వకపోయినా, కృష్ణ అనుమతితోనే ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావు వైసిపి ని వీడి టిడిపి లో చేరడం, కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు సిట్టింగ్ ఎమ్.పి. గా మళ్లీ తెలుగుదేశం నుంచి బరి లో ఉండడం ఘట్టమనేని అభిమానులను ప్రభావితం చేయవచ్చు.
ఆ విధంగా తెలుగుదేశం సినీగ్లామర్ 'ఘ'ట్టమనేని , 'నం'దమూరి కుటుంబాల అండతో "ఘనం" గా ఉంది. ఇంకా మురళీమోహన్, శివ ప్రసాద్ లాంటి నటులు టిడిపి ఎం.పి. లు గా ఉన్నారు.
సీనియర్ స్టార్ అయిన కృష్ణంరాజు భా.జ.పా. నుండి ఎం.పి. బరిలో నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టార్స్ పై ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంక పవన్, మహేష్, జూ'ఎన్టీయార్ లాంటి మాస్ స్టార్స్ ని డెమీగాడ్స్ లా చూసే అభిమాన గణం ఉంది. వీరు ఒక మీటింగ్ పెడితే లక్షల్లో అభిమానులు వెల్లువెత్తుతారు. కాబట్టి జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి పార్టీలకు ఈ సినీ గ్లామర్ చాలా ఉపయోగ పడుతుంది. అయితే కేవలం తమ క్రేజ్ తోనే జనాల్ని సినీ"మాయ" లో పడేసి ఓట్లు రాబట్టడం సాధ్యం కాదు అని "మెగాస్టార్" చిరు విషయంలో చూసాం.
స్పష్టమైన రాజకీయ విధానం, ప్రజలలో విశ్వాసం ఉన్న నాయకత్వం తోడైనప్పుడే ఈ సినిమా స్టార్ పవర్ దానికి అదనపు బలాన్నిచ్చే కెటలిస్ట్ లాగ ఉపకరిస్తుంది. మరి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల లో ఈ "స్టార్" వార్స్ ఎంత వరకు ప్రభావం చూపుతాయో చూద్దాం.......