BREAKING NEWS

AP సీఎం కుర్చీ ఎక్కేది ఎవరు?

ఈ ఎన్నికలలో విజయం ఎవరిని వరించాలి ?? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ??

పార్టీల పరంగానూ,వాటి ప్రభావం మూలంగానూ, సామాజిక సమీకరణాలును బట్టి, పోటీలో ఉన్న స్థానిక అభ్యర్థులను బట్టి బహిరంగంగా ఎన్ని మాటలు చెప్పినప్పటికిని వారి వారి మనస్సాక్షిని అనుసరించి మాత్రమే వారు అనుకున్న పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారు.

రహస్య ఓటింగ్ విధానం... మనకిచ్చిన, మనకొచ్చిన గొప్ప అదృష్టం. ఎవరు ఎవరికి ఓటు వేసారో ఎవరికీ తెలియదు.  డేరా లోపలకి వెళ్లి నిచ్చింతగా ,నిర్భయంగా తమ అభిమాన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చు.గత రోజులలో అయితే వారి కుల పెద్ద చెప్పినవారికి,లేదా ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు చెప్పినవారికి, లేదా తాత్కాలికంగా వారికి డబ్బు,మద్యం,విందు ఇచ్చినవారికి గ్రుడ్డిగా ఓటు వేసేసే వారు. కానీ క్రమేపీ ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.

తాము స్వయంగా ఒక పార్టీలో ఉన్నవారు కావచ్చు , కులపెద్ద చెప్పినవారికి కావచ్చు , అభ్యర్థి నుండి తాత్కాలిక ప్రయోజనం పొందినవారికి కావచ్చు ఓటు వెయ్యకుండా తమ మనసుకు నచ్చిన వారికి మాత్రమే ఓటు వేసి సంతృప్తి పొందుతున్నారు.అందుకే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేయించుకున్న సర్వేలు కూడా తారుమారు అవుతున్నాయి.

ఇక ప్రస్తుతానికి వస్తే ..ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలి ? ఎవరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవాలి అని సామాన్య ఓటర్లు కోరుకుంటున్నారు ?? రాష్ట్ర విభజన జరిగింది.కట్టు బట్టలతో వచ్చేసాం.. మొదటి నుండీ అన్ని వసతులు సమకూర్చుకోవాలి. ఆదాయం చూస్తే అంతంత మాత్రం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 2014 లో జరిగిన ఎన్నికలలో TDP గెలవడం ,చంద్ర బాబు ముఖ్యమంత్రి అవడం జరిగింది. కొత్త ఇంటి కాపురం .మెల్ల మెల్లగా ఏదోలా కొత్త ఇంటిలో ఒక్కో సామాను సర్దుకుంటున్నాం.

మన ఇంటిని మన కుటుంబ పెద్ద అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటే,ఈ లోగా పొరుగింటి వారు మన అభివృద్ధి చూసి ఓర్వలేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం. మన ఇంటి కుటుంబ సభ్యులు కొంతమంది వారితో చేతులు కలపడం. ఇంటి యజమాని కూడా వారికే సపోర్టు చేస్తూ మనల్నే బాధ పెట్టే పరిస్థితి. 

ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తన చాకచక్యంతో సమర్ధవంతంగా ,ఎవరికీ భయపడకుండా ,మొక్కవోని ధైర్యంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ ,ఆకలితో ఉన్న మనందరికీ అల్పాహారం , తేనీరు ఇప్పటికే అందించి , పూర్తిగా కడుపు నింపడానికి కమ్మని రుచికరమైన విందు భోజనం తయారుచేస్తున్నారు ప్రస్తుత మన ముఖ్యమంత్రి. అతని సమర్ధత తెలిసిన వారం కనుక మరి కాసేపట్లో విందారగించవచ్చు అనే ఆశతో ఉన్నాం.

అదిగో .. సరిగ్గా ఈ పరిస్థితులలో విందు భోజనం మీరు తయారు చేయవద్దు నేనే చేస్తాను, నాకు ఎప్పటి నుండో సరదాగా ఉంది.  నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కొంతమంది మన ముందుకు వస్తున్నారు. పోనీ ఎవరైతే మనకేం ? మనకు కావలసింది రుచికరమైన విందు భోజనంతో మన ఆకలి  తీరడమే కదా అనుకుంటే .. వంటకు సిద్ధపడి వచ్చిన వీరికి పప్పు ఏదో ఉప్పు ఏదో కూడా తెలియని పరిస్థితి. ఇంకా విచిత్రమేంటంటే .. కనీసం స్టవ్ కూడా వెలిగించడం రాదు. ముందు వారికి మనం అవకాశం ఇచ్చేస్తే క్రమేణా ఒక్కోటి నేర్చుకుని అప్పుడు వండుతారట..

కడుపు మాడిపోయి ఉన్న మనం , చేయి తిరిగిన వంట వాని చేతి వంట మరికొన్ని క్షణాల్లో భుజించి, తృప్తిగా సేద తీరచ్చు అని కొండంత ఆశతో ఉన్న మనకు అనుకోని రీతిలో ఎదురైన ఈ స్థితి నుండి ఎలా బయట పడాలి ?? సుమారుగా .. విందు భోజనం రెడీ చేసి , మరి కొన్ని క్షణాల్లోనే మనం భుజించడానికి విస్తర్లులో వడ్డించి , మన ఆకలిని తీర్చే అనుభవసాలిని మనం సపోర్ట్ చెయ్యాలా ?? అసలు స్టవ్ వెలిగించడమే రాని వారిని సపోర్ట్ చేసి , సగంలో ఉన్న వంటను పాడు చేసి ఆకలితో కడుపు మాడ్చుకునే దుస్థితిని మనకు మనమే చే చేతులా తెచ్చుకోవాలా???

ఆలోచన అవసరం ... ఆచరణ అవసరం ..

సమయము లేదు మిత్రమా ...! రుచికరమైన విందు భోజనామా ?? ఆకలితో అలమటించే దుస్థితా ???

Photo Gallery