BREAKING NEWS

హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా జరుపుకుంటాం?

హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఆంధ్ర ప్రదేశ్ లో ఎలా జరుపుకుంటాం?

అసలు పండుగ అంటేనే అనందం. పండుగ రోజు అంతా కలిసి ఆనందంగా గడుపుతారు. పండుగ రోజు ఇంటిల్లిపాది  ఒక దగ్గర కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సరదాగా ఉంటారు. ఇలా కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటారు. పండుగ ఒక ఆచారం  మాత్రమే కాదు. పండుగ ఇంటిల్లపాదిని మరెంతో దగ్గర చేస్తుంది. కాబట్టి ప్రతి పండుగని జరుపుకోవడం అవసరం. ఇలా పండుగలు మనుష్యుల్ని ఆనందంగా ఉంచుతాయి. 

హోలీ పండుగ అంతర్జాతీయ పండుగ. ఈ పండుగని కేవలం మన దేశం వాళ్ళు మాత్రమే కాక అనేక దేశాలు వారు కూడా జరుపుకుంటారు. హోలీ పండుగ జరుపు కోవడానికి అవధులు లేవు. ఎవరైనా ఈ పండుగ జరుపుకోవచ్చు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు ఇలా ఎవరైనా జరుపుకోవచ్చు. చక్కగా కేరింతలతో పిల్లలు, యువకులు ఆనందించే పండుగ. చక్కగా ఉత్సాహంతో జరుపుకునే పండుగ ఇది. 

హోలీని రంగుల పండుగ అని అంటారు. ఇది భారత దేశంలో మాత్రమే కాక నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. కొన్ని చోట్ల ఈ పండుగని కేవలం ఒక్క రోజే  చేసుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలలో మూడు నుండి పదహారు రోజులు ఈ పండుగని జరుపుకుంటారు. ఎక్కువగా పండుగ జరిపే చోట భారీ ఎత్తున  జనం చూడడానికి వస్తారు. ఈ ఉత్సవాలని అనేక ప్రాంతాల నుండి వచ్చి సందర్శకులు వీక్షిస్తారు. ఈ ఉత్సవం వసంతం ముందు వస్తుంది కనుక బసంతి ఉత్సబ్ అని అంటారు. దీనిని దోల్ యాత్ర అని కూడా అంటారు. కృష్ణుడుకి సంబందించిన కొన్ని ప్రదేశాలలో హోలీ పండుగని బాగా జరుపుకుంటారు. వాటిలో మథుర, బృందావనం, నందగావ్, బర్సానాల మొదలైన ప్రదేశాలలో ఈ పండుగ అంగరంగ వైభవంగా జరుపుతారు. అక్కడికి జనం ఎంతో  మంది  వెళ్తారు . ఎంతో రద్దీగా ఉంటుంది అక్కడ హోలీ పండుగ రోజుల్లో. 


హొలీ ప్రాముఖ్యత:

హోలీ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలానే హోలీ పండుగ వెనుక ఘన చరిత్ర ఉంది. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు ఎంతో భక్తితో తపస్సు చేసి బ్రహ్మ వరం పొందాడు. ఎవరికీ సాధ్యం కానీ వారం ఈ రాక్షసుల రాజైన హిరణ్యకశ్యుపుడు పొందాడు. ఏ సమయమైనా, పక్షిచేత కానీ, పశువు చేత కానీ, మనిషి చేత కానీ ఇంకా ఎలా అయినా కానీ ఇతనికి చావు లేదు. అయితే ఈ కారణం వాళ్ళ ఇతనికి దురహంకారం బాగా పెరిగిపోయింది. చావు లేదు అన్న కారణంతో  దురహంకారంతో రెచ్చిపోయాడు ఈ  రాక్షస రాజు. తానే దేవుడు అని వేరే దేవుడు లేడు అని చెప్పి ఎంతో విర్రవీగేవాడు . ప్రజలు ఎవరు కూడా దేవుడిని ప్రార్ధించకూడదు అని చెప్పాడు. కేవలం తననే పూజించాలని చెప్పాడు ఆ రాక్షసుడు. 

తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు.హిరణ్య కశ్యపుడు తన కుమారుడిని విష్ణువుని పూజించవద్దు అని  ఎన్నో సార్లు హెచ్చరించాడు. కానీ ప్రహ్లాదుడు తన తండ్రి మాట వినలేదు. నిత్యం విష్ణువు భక్తిలో ద్యాస పెట్టేవాడు. ఒకసారి హిరణ్య కశ్యపుడు తన కుమారుడికి  విషం పోసాడు కానీ అది అమృతం అయ్యిపోయింది. ఏనుగులు చేత తొక్కించాడు కానీ ప్రహ్లాదుడికి ఏమి కాలేదు. విష సర్పాల మధ్యలో కూడా జీవించగలిగాడు ప్రహ్లాదుడు. చివరికి ప్రహ్లాదుడిని హోళికా అనే రాక్షసి  ఒడిలో చితి పెట్టి కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. చితి నుంచి  రక్షించగలిగే శాలువని హోలికకి వేసి ఉంచాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశం మేరకు అందరి ముందు వెళ్లి చితిలో  కూర్చున్నాడు. ప్రహ్లాదుడు భక్తి కి విష్ణుమూర్తి మెచ్చి ఆపద నుండి కాపాడాడు .అందరు చూస్తుండగానే ఆ శాలువ వచ్చి ప్రహ్లాదుడు మీద పడడం తో ప్రాణాపాయం నుండి బయట పడ్డాడు.కానీ హోలిక మరణించింది.

తరువాత నరసింహ అవతారంలో విష్ణు మూర్తి వెళ్ళి హిరణ్యకశ్యపుడిని అంతమొందించాడు.తనని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పంజాతో చీల్చి చంపేశాడు. 

సాంప్రదాయక హోలీ అంటే ఏమిటి?

చలి కలం తర్వాత హోలీ రావడం వాళ్ళ వైరల్ ఫీవర్, జలుబు వంటివి తాకకుండా ఉండేందుకు సహజ రంగులు చికిత్సలా పని చేస్తాయి. నిమ్మ, కుంకుమ, బిల్వ, తులసి మొదలైన వాటిని జల్లుకోవడం వల్ల ఆయుర్వేద మందులా పని చేస్తాయి. కానీ రాను రాను ఇది వ్యాపారం అయిపోయింది . జనం ఆరోగ్యాన్ని మరిచి వ్యాపారం వైపు మనసు మళ్ళించారు. సహజమైన రసాయనాలు నేడు లేవు. అంతా కెమికల్స్ తో నిండిపోయింది. ఇది అనారోగ్యానికి దారి తీస్తోంది. 


ఆంధ్రప్రదేశ్ లో హొలీ పండుగ:

దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో హోలీ పండుగని బాగా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో హోలీ ఒక్క రోజు మాత్రమే జరుపుకుంటారు. వివిధ చోట్ల ఈ పండుగని  ౩ నుండి 16  రోజులు జరుపుకుంటారు. ఇక్కడ మాత్రం ఒక్క రోజే చేసుకుంటారు. పిల్లలు, యువకులు రంగులని జల్లుకుని ఆనందంగా నవ్వుకుంటారు. చక్కగా రంగులతో ఆడుకుంటారు. కొన్ని చోట్ల భోగి మంటల సంప్రదాయం ఉంది. కానీ మన ఆంధ్రప్రదేష్ లో ఈ సంప్రదాయం లేదు.పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు.

ఆంధ్రాలో  ఉండే  బంజారా ట్రైబ్స్ హోలీని ఎంతో బాగా జరుపుకుంటారు. మంచి డాన్సులతో వారు హోలీ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.