BREAKING NEWS

గండి కోట- గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా

సరదాగా చూడని ప్రదేశాలు గురించి తెలుసుకోవడం, ఆ ప్రదేశాలని సందర్శించుకోవడం దాని నుండి విజ్ఞానం, వినోదం పొందడం  వల్ల  మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి రోజు పనిలో పడిపోతూ, ఉద్యోగం ఒత్తిడిలో కురుకుపోతూ అస్తమానం  అహర్నిశలు వర్క్ టెన్షన్  లో ఉండిపోవడం మంచిది కాదు. సరదాగా ఆదివారం పూటనో లేదా సెలవు రోజునో కొత్త ప్రదేశాలని వీక్షిస్తూ దాని గురించి తెలుసుకుంటూ ఆనందంగా నవ్వుతు కుటుంబం తో గడపడం ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. వారం అంతా పడిన శ్రమ మరిచి పోయేలా చేస్తుంది. కనుక వివిధ ప్రదేశాలని చూడడం ఎంతో మంచిది. కాబట్టి కొన్ని చూడవలసిన ప్రదేశాలు మీకోసం. ఆలస్యం ఎందుకు చదివేయండి  ....

గండి కోట- గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా:

ఈ ప్రదేశానికి ఎంతో ఘనత ఉంది. ఈ ప్రదేశానికి ఎంతో చరిత్ర ఉంది. ఎంతో సరదాగా, వినోదంగా ఉంటుంది ఈ ప్రదేశం. బోటింగ్, హైకింగ్ ఇక్కడ ప్రత్యేకం. చిన్న పిల్లలు, యువకులు ఎంతో సరదాగా ఆడుకోవచ్చు. అలానే ఈ అందానికి పెద్ద వాళ్ళ సైతం సై అనాల్సిందే. సెలవు రోజు వెళ్ళడానికి నిజంగా ఇది సుందరమైన ప్రదేశం.

ఈ కోట కడప జిల్లాలో గండికోట అనే గ్రామంలో ఉంది. ఇది పెన్నా నది తీరాన్న ఉంది. ఈ గండికోట ఎంతో సుప్రసిద్ధమైనది. ఇక్కడికి వివిధ ప్రాంతాల వాళ్ళు చూడడానికి ఎంతో ఆసక్తిగా వస్తారు. మంచి పర్యటన ప్రాంతం. 
గండికోటని పూర్వికులు 200 సంవత్సరాలు పరిపాలించారు. పెమ్మసాని నాయక్  సామ్రాజ్యం ఈ ప్రదేశాన్ని పరిపాలించారు. అక్కడ ఒక కోటని కూడా వారు నిర్మించారు. దానికి జోర్జ్ అని ఆంగ్లం లో అంటారు.   తెలుగులో దానిని గండి  అంటారు. ఎర్రమల్ల కి పెన్నార్ నదికి మధ్య గండికోట నిర్మించడం జరిగింది. ఆ నది వెడల్పు సుమారు 300 అడుగులు . 

గండికోటని చూడడానికి వివిధ ప్రాంతాలు నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ప్రకృతి ప్రేమికులు, చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు ఈ ప్రాంతానికి వచ్చి దీనిని సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ సంబరాలని కూడా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వారసత్వ పండుగను జరుపుతారు.ఈ  కోటని ప్రపంచ వారసత్వ సంపంద కింద  గుర్తించడానికి ఇక్కడి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది .ఈ కోట లో ప్రస్తుతము రెండు అతి పురాతన దేవాలయాలు వున్నాయి .అయితే ఈ దేవాలయాల్లో ఎటువంటి విగ్రహాలు లేవు .ఈ రెండు దేవాలయాలని విష్ణుమూర్తి కి అంకితం ఇచ్చారు అప్పటి ప్రజలు. 

యుద్దాలు జరిగి కోటని మూసివేసే పరిస్థితి వచ్చినపుడు నీరు మరియు ఆహరం కి ఇబ్బంది కలగ కుండా ఉండేందుకు ఈ కోటాలో పెద్ద పెద్ద మంచినీటి బావులు ఉండేవి .ఇంకా అతి పెద్ద ధాన్యాగారం ఉండేది. ఇంకా ఈ కోటాలో అతి పెద్ద చెరువు ఉండేది .ఈ చెరువుని రాయలచెరువు అని పిలిచేవారు.
ఫోటోగ్రఫీ అంటే మక్కువ వున్నవారికి గండికోట మంచి ప్రదేశం. సూర్యాస్తమయ సమయంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. కోటలో మరియు కోట బయట కూడా చాలా క్యాంపింగ్ సైట్స్  వున్నాయి .సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి నెలల్లో చూడడం మరెంతో బాగుంటుంది. ఆ సమయంలో ఆ ప్రదేశం మరెంతో అందంగా ఉంటుంది. కనుక అధిక శాతం ప్రజలు అప్పుడే చూడడానికి వస్తూ ఉంటారు.

క్రీస్తు పూర్వము 1123 లో కప్ప రాజా అనే రాజు  గండికోటకు అతి సమీపంలో ఉన్న బొమ్మన్నపల్లి గ్రామంలో కోటని కట్టడం మొదలు పెట్టాడు. కానీ అది పూర్తీ కాలేదు. తర్వాత క్రీస్తు  పూర్వం 1370 లో పెమ్మసాని కుమార తిమ్మ నవక ఈ కోటని కట్టడం పూర్తి చేసాడు. గండికోట చూడడానికి ఎంతో అద్భుతంగ ఉంటుంది. అందమైన  ప్రకృతి ఇక్కడ విశేషం. ప్రకృతి ప్రేమికులు చూడడానికి ఇది సరైన చోటు. కేవలం ఇది ఒక్కటి మాత్రమే కాదు. ఇక్కడ చుట్టూ పక్కల పలు ప్రదేశాలు కూడా ఉన్నాయి. 


బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయం, యాగంటి క్షేత్రం, అమీన్ పీర్ దర్గా శ్రీనే  ఇక్కడ చూడదగ్గవి. బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయం 31.38  కిలో మీటర్ల దూరంలో ఉంది. యాగంటి క్షేత్రం ఇక్కడికి 61 .29  కిలో మీటర్ల దూరంలో ఉంది. అమీన్ పీర్ దర్గా 68 .49  కిలో మీటర్ల దూరంలో ఉంది. గండికోటని చూడడానికి వెళ్ళినప్పుడు వీటిని కూడా చూడడానికి ఇష్టపడతారు పర్యాటకులు. 

ఆలస్యం ఎందుకు ప్రణాళిక వేసుకోండి, కుటుంబంతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్లి గండి కోట అందాన్ని చూసేయండి. సరదాగా ఆనందంగా హాలిడేని చక్కగా వినియోగియించుకోండి. బాధని  మరిచేలా చేస్తుంది విహారం, ఒత్తిడిని తగ్గించేస్తుంది, సంతోషాన్ని అందిస్తుంది కాబట్టి బయలుదేరండి ఆలస్యం ఎందుకు, చలో గండికోట .....