BREAKING NEWS

మహిళా దినోత్సవం స్పెషల్ ఫోకస్

మహిళా దినోత్సవం స్పెషల్ ఫోకస్: వివిధ రంగాల్లో రాణించిన తెలుగు మహిళలు, వారి సాహసాలు
 
ఆడది ఆబాల కాదు సబల అని చిన్న చూపు చూస్తూ... ఇల్లే ప్రపంచం వంటిల్లే సర్వసం అంటూ చదువుకోవడానికి వీలు లేకుండా, బతుకులో స్వేచ్ఛ లేకుండా ఆడవారిని హీనంగా చూసేవారు. ఆనాటి రోజుల్లో స్త్రీలని ఎంతో చులకనగా, హీనంగా చూడడం జరిగిన దుస్థితి. చదువుకోవాలని ఉన్నా చదువుకోనివ్వకుండా.... చక్కగా ఆడుకుని, నవ్వుకోవాలన్న కూడా కష్టం అయిపోయేది. కానీ నెమ్మదిగా ఆ రోజులు మారిపోయాయి. ఆడవారు కూడా రాణించగలుతున్నారు. ఆశలు, ఆశయాలు ఎన్నో....కలల్ని  నెరవేర్చుకుంటూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఇప్పుడు స్త్రీకి ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి. సాధించడానికి ప్రోత్సాహం కూడా అందుతోంది. ప్రతీ రంగంలో కూడా స్త్రీ రాణిస్తోంది. నిజంగా గర్వపడాల్సిన విషయం.
 
స్త్రీ అభివృద్ధే జగతికి అభివృద్ధి. స్త్రీ చక్కగా చదువుకుంటేనే తన బిడ్డలకి చదువు చెప్పగలదు. మంచి, చెడు తేడా నేర్పించి చక్కటి విలువలతో మన సంస్కృతితో పెంచగలదు. అప్పుడు స్త్రీ చదువుకోవడం ఎంతో ముఖ్యం.కనుక ప్రతీ స్త్రీ చదువుకోవాలి....ఎందరో తెలుగు స్త్రీలు చక్కగా రాణించారు. అన్ని రంగాల్లో కూడా స్త్రీలు తమ సామర్ధ్యాన్ని చూపించారు. నాటి స్త్రీలు నేటికీ ఆదర్శమే....
 
ధీటుగా ఎదిరించిన ఆదర్శ స్త్రీలు:
 
ఎందరో తెలుగు స్త్రీలు ఎంతో చక్కగా రాణిస్తూ వచ్చారు. పడే వారిని తలుచుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ స్త్రీలని గుర్తుంచుకుని ఘనత సాధించిన వీరిని పదే స్మరించుకోటం, వారి అడుగు జాడలో నడవడం చాల అవసరం. అటువంటి స్త్రీల బాటలో నేటి స్త్రీలు నడిస్తే  ఈ విఙ్నానానికి ఆ ధైర్యం తోడై ఉంటుంది. ఎన్నో అద్భుతాలు కూడా తెలుస్తాయి...
 
రాణి రుద్రమ్మ దేవి సాహసం:

రాణి రుద్రమ్మ దేవి కాకతీయ వంశానికే ధ్రువ తార. ఆ వంశానికి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. వీర వనితగా మంచి పేరు తెచ్చింది. రాజ్యాలని ఏలిన మహారాణులలో రుద్రమ్మ దేవి ఒకరు. రుద్రమ్మ దేవిగా ప్రసిద్ధి చెందిన ఈమె అసలు పేరు రుద్రమ్మ. రుద్రమ్మ దేవి యుద్ధ విద్యలతో, చక్కటి ధైర్యంతో రాజులా ఉండేది. అయితే ఈమె మరణం గురించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వెతికితే మునుగోడులో  మట్టిలో కూరుకున్న ఒక శాసన వెతికి తీశారు. దాని ఆధారంగా ఆమె 1289 వ సంవత్సరంలో నవంబర్ 27 న మరణించినట్లు లిఖించి ఉంది.
 
ఆమె అర్ధం చేసుకున్నంత బాగా స్త్రీలని ఎవరు అర్ధం చేసుకోలేదు. ఆమె దేశమంతటా తిరిగి ప్రజా సమస్యలని ప్రత్యక్షంగా చూసింది. తల్లి కాన్పులో బిడ్డ మరణించాడని తట్టుకోలేక పోయింది. ఆ క్షణం తల్లడిల్లి పోయింది రుద్రమ్మ. తక్షమే గ్రామా గ్రామానా ప్రసూతి ఆసుపత్రులని నిర్మించింది ఈమె. ఇలా రుద్రమ్మ నుండి ధర్యం, మంచితనం, సాహసం, సేవ గుణాలని చెప్పుకుంటూ ఆదర్శంగా తీసుకోవడం ఎంతో మంచిది.
 
 
భండారు అచ్చమాంబ:


భండారు అచ్చమాంబ తొలి తెలుగు కధా రచయిత్రి. అచ్చమాంబ పేరు ఎన్నో వ్యాసాలు వ్రాసిన రచయిత్రి. అచ్చమాంబ ఎన్నో పుస్తకాలూ రచించారు. మహిళలపై అనేక రచనలు కూడా ఈవిడ రచించారు. నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో జన్మించారు. ఆమెకి 10 సంవత్సరాల వయసులోనే వివాహం అయ్యిపోయింది. ఆమె ఏమి చదుకోలేదు. కానీ తన తమ్ముడు చదువుతుంటే తనతో కూర్చుని తెలుగు, హిందీ నేర్చుకుంది.
 
అచ్చమాంబ మచిలీపట్నంలో మొదట మహిళా సమాజాన్ని స్థాపించింది. ''బృందావన స్త్రీల సమాజం'' అని పేరు పెట్టారు. స్త్రీల కోసం అచ్చమాంబ ఇలా చెప్పారు...
 
స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.....అంటూ అచ్చమాంబ తన కాలంతో స్త్రీలపై రచించారు.
 
స్త్రీలని తక్కువగా చూసే సంప్రదాయం తొలగిపోవాలి. స్త్రీకి కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి...వారికీ బతుకు చక్కగా బతకాలని ఉంటుంది కదా! ఇటువంటి రచనలతో ఈమె స్త్రీలపై దృష్టి పెట్టింది. గుణవతియగు స్త్రీ, లలితా శారదులు, స్త్రీ విద్య, భార్యాభర్తల సంవాదము, దంపతుల ప్రధమ కలహం ఇలా స్త్రీలపై ప్రేత్యేక దృష్టితో కలం నుండి  పసిడి అక్షరాలని జార్చి సమస్యలకి పరిష్కారం చూపింది.ఇలా అబ్బూరి ఛాయాదేవి, యుద్ధంపూడి సులోచనారాణి, కొండవపల్లి కోటేశ్వరమ్మ ఇలా ఎందరో స్త్రీలని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి.
 
సరోజినీ నాయడు:


భారత కోకిలగా ప్రసిద్ధి చెందింది. స్వతంత్ర సమరయోధురాలు మరియు కవయిత్రిగా ఈమె ప్రసిద్ధి చెందారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి  మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారతీయ తొలి గవర్నర్ కూడా. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోతుంటే ఆ సంకెళ్ళ నుండి విముక్తి పొందాలనే ధ్యేయంతో సరోజినీ నాయడు ఎనలేని కృషి చేసారు. వీరులైన పురుషులే కాదు వీరవనితలు కూడా ఉన్నారని గొప్పగా చెప్పుకోవడానికి సరోజినీ వంటి వారు దేశానికత్యవసరం. అయితే అందులోనూ మన తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణం.
 
ఇలా దుర్గాబాయి దేశముఖ్, పి వీ.సింధు ఇలా ఎందరో స్త్రీలు ఎన్నటికీ ఆదర్శమే.
 
'' కార్యేషు దాసీ...కరణేషు మంత్రి....భోజ్యేషు మాతా....శయనేషు రంభా....'' అని కవి చెప్పినట్లు స్త్రీ లేనిదేది మనుగడ లేదు కదా!  

Photo Gallery