BREAKING NEWS

కొండవీడు కోట ప్రత్యేకత, ముఖ్య విశేషాలు మీకోసం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. జలపాతాలు, మ్యూజియంలు, జూ పార్క్స్.. ఇలా  ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఈ రోజు మనం ఒక చారిత్రక ప్రదేశం గురించి చూద్దాం. చరిత్రకు మౌన సాక్ష్యాలు అప్పట్లో నిర్మించిన గిరి దుర్గాలు. అయితే ఈ కోట లో వుండే ప్రతి రాయి అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలని మనకి చెబుతుంది. పైగా ఇటువంటి చరిత్రమే చూడడం చాలా బాగుంటుంది. పైగా అది మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు అని చెప్తుంది. అయితే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా లో ఉన్న కొండవీడు కోట గురించి చూద్దాం.
 
దాని యొక్క చరిత్ర, దాని యొక్క విశేషత ఇలా  చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. చరిత్రకు మౌన సాక్ష్యాలు అప్పట్లో నిర్మించిన గిరి దుర్గాలు. ఎన్నో విషయాలు ఇవే మనకి మౌనంగా చెప్తాయి. చరిత్ర లోతుల్లోకి వెళితే మనకు తెలియని చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అటువంటి ఎన్నో కోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కొండవీడు కోట ఒకటి అనే అనాలి. రెడ్డి రాజుల పౌరసత్వానికి నిలువుటద్దం అయిన ఈ కోటకు సంబంధించిన అనేక విషయాలు మీ కోసం.
 
కొండవీడు కోట ఎక్కడ ఉంది..? 
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఎడ్లపాడు సమీపం లో కొండవీడు కోట ఉంది. రెడ్డి రాజుల పౌరుషానికి నిలువెత్తు సాక్ష్యం ఇది. చిలకలూరి పేట గుంటూరు మధ్య వెళ్లే జాతీయ రహదారి వెంబడి వెళితే దీనిని ఈజీగా చేరుకోవచ్చు. చరిత్ర లో గుంటూరుకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. 12 మైళ్ల దూరం లో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది. 14వ శతాబ్దం లో రెడ్డి రాజుల కాలం లో ఈ చారిత్రక కట్టడం నిర్మించడం జరిగింది. 
 
కొండవీడు కోట లో పర్యటకుల కి సందడే..!

 
కొండవీడు కోట కి వెళ్తే ట్రక్కింగ్, హైకింగ్ ఇలాంటివి చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ ప్రదేశం ని చూడడానికి సెలవు రోజుల్లో వెళ్తే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరదాగా కుటుంబమంతా కలిసి వెళ్లి ఇక్కడ ట్రక్కింగ్,  హైకింగ్ లాంటివి చేయవచ్చు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. సరదాగా సెలవు రోజు వెళ్తే చాలా బాగుంటుంది. ఎంత గానో సందడి చేయవచ్చు. నిజంగా ఇది మంచి పర్యాటక ప్రదేశం.
 
 కొండవీడు కోట లో అద్భుతమైన శిల్పాలు:
 
రెడ్డి రాజులు నిర్మించిన ఈ కోటని చాలా అద్భుతమైన శిల్పాల తో ఉంచారు. గోపీనాథ స్వామి దేవాలయాన్ని కత్తుల బావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. ఇక్కడ బాల కృష్ణుని విగ్రహం తొలిగా ప్రదర్శించడం జరిగింది. గోపీనాథ స్వామి ఆలయం లోనే ఇది ఉంది. కొండవీటి ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్భుత కళలకు ప్రతీకలు. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతా మూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఉంటాయి.
 
ఇవి పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. కొండలపై లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బొల్లుముర వెంకటేశ్వర స్వామి ఆలయం, మసీదు దర్గా కొండ, దిగువన కొత్తపాలెం లోని వీరభద్ర స్వామి ఆలయం ఇలా అనేక ఆలయాలు ఉన్నాయి. ఒకసారి ఈ కోట చూసిన తర్వాత ఈ ఆలయాలు అన్నీ కూడా చూడొచ్చు.నిజంగా ఈ ప్రదేశాలన్నీ చూడ చక్కనివి. ఇక్కడకు వచ్చిన వాళ్లు వీటన్నిటిని సందర్శిస్తారు.
 
 రెడ్డి రాజుల వైభవం:
 
ప్రాచీన చరిత్ర సంపదలకు నిలువెత్తు సాక్ష్యం ఈ కోట. 1500 అడుగుల ఈ గిరిదుర్గం శత్రుదుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడు ను శత్రుదుర్భేద్యం రాజ్యంగా తీర్చిదిద్దడం కాకుండా ప్రజాకాంక్ష పాలను కొనసాగించిన ఘనత రెడ్డి రాజులది. అయితే వారు కొండవీడు కోటని రాజధానిగా చేసుకుని క్రీస్తుశకం 1325 నుండి 1420 వరకు పరిపాలించడం జరిగింది. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్ వరకు విస్తరింపజేసి వీరులుగా మారారు. రెడ్డిరాజుల పాలన కాలం లో  వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్య, స్వర్ణయుగంగా భాసిల్లింది.
 
కొండవీడు కోట ని ఎలా చేరుకోవాలి:
 
ఇది గుంటూరు జిల్లా ఎడ్లపల్లి మండలంలో ఉంది అని చెప్పుకున్నాం కదా..! ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట- గుంటూరు మధ్య జాతీయ రహదారి నెంబర్ ఐదు  నుంచి బోయపాలెం మీదుగా కొండవీటికి వెళ్లొచ్చు. లేదంటే గుంటూరు నరసరావుపేట మార్గం లో ఫిరంగిపురం చేరుకుని అక్కడి నుంచి ఈ కోట దగ్గరికి వెళ్లి పోవచ్చు. ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఉన్నాయి కాబట్టి సులువుగా వెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు పైకి వెళ్లడానికి సులువుగా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు. ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కట్టడాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిందే..! పైగా ఇదంతా చూడడానికి చాలా సరదాగా ఉంటుంది. అక్కడికి వెళ్లి మంచిగా ఫోటోలు తీసుకుని కుటుంబంతో కలిసి సరదాగా గడపవచ్చు.