BREAKING NEWS

మహాబలిపురం గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

ప్రసిద్ధి చెందిన ప్రదేశాల లో మహా బలిపురం చెప్పుకోదగ్గ ప్రదేశం మరియు మహాబలిపురం తప్పక చూడదగ్గ ప్రదేశం. నిజంగా దీనిని పల్లవుల అద్భుత సృష్టి అనే చెప్పాలి. ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా సమయం దొరికితే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించడం. కుటుంబ సమేతంగా వెళ్లి ఈ చారిత్రిక కట్టడాలని చూడడం చాల బాగుటుంది. ఈ శిల్పకళా కనువిందు చేస్తుంది.
 
తమిళనాడు లోని కాంచీ పురం జిల్లా లో మహాబలిపురం ఉంది. చెన్నై నుండి దాదాపు 50 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఈ మహాబలిపురానికి ఒకప్పుడు మామల్లపురంగా పిలిచేవారు. 7 నుండి 10 వ శతాబ్ద కాలం లో పల్లవ రాజుల కాలం లో పేరు మోసిన ఓడరేవు మహాబలిపురం. ఈ ఆలయం గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి, కట్టడాల గురించి అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
బలి చక్రవర్తి పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. దీని కారణంగా దీనికి మహాబలిపురం అనే పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే మహాబలిపురం అంటేనే సముద్ర తీరం లో వెలసిన ఆలయం. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకుల విదేశీ నిపుణులు పిలిపించి స్వదేశీ కళాకారుల సహాయం తో ఈ అద్భుతమైన రాతి కట్టడం నిర్మించడం జరిగింది. నిజంగా ఇది ఎంత గొప్ప విషయమో కదా..! ఇక్కడ ప్రసిద్ధి గాంచిన ఏకశిలా దేవాలయాల అద్భుత పతనానికి ఎంతటి వారైనా పరవశించి పోవాల్సిందే.
 
మహాబలిపురానికి ఎలా చేరుకోవాలి..?
 
ఈ పట్టణాన్ని చేరుకోవాలంటే తరచు బస్సు సౌకర్యం ఉంటుంది. ఇది హైదరాబాద్ నుండి 12 గంటల దూరం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు దారి లో విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, నెల్లూరు కామాక్షమ్మ ఆలయం, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తో పాటుగా చెన్నై లో వివిధ ప్రదేశాలు కూడా మీరు చూడొచ్చు. నిజంగా ఇవి అన్ని కూడా చాల ముఖ్యమైన ప్రదేశాలు. వీలు ఉంటే దారిలో చూసుకుని రావొచ్చు. ఆలయాలు, చారిత్రక కట్టడాలని సందర్శించడం చాల ఆనందంగా ఉంటుంది.
 
మహాబలిపురం ఆలయ చరిత్ర:
 
మహాబలిపురానికి మామల్లాపురం అనే పేరు కూడా ఉంది. ఆనాటి పల్లవుల రాజుల పేరు మీద ఈ పట్టణం కట్ట బడిందని చరిత్రకారులు అంటున్నారు. అలాగే దీనికి మహా బలిపురం అనే పేరు రావడానికి మరో కథనం కూడా ఉంది అది ఏమిటి అనే విషయానికి వస్తే... బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడమే దీనికి కారణం అని అంటూ ఉంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలం లోనూ ఈ ప్రాంతం సువర్ణ యుగాన్ని చూసింది. అయితే పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించుకుని కొంత కాలం పాలించే వారు అయితే అప్పుడు కట్టించినవే ఈ ఆలయాలు. ఈ శిల్పకళా సంపదకి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఇలా అప్పటి నుంచి దీనిని తీర్చిదిద్దుకునే వచ్చారు.
 
మహాబలిపురం ఆలయ విశేషాలు:
 
మహాబలిపురం లో రాయల గోపురం, పాండవుల రధాలు ప్రత్యేక ఆకర్షనీయంగా ఉంటాయి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ ఆలయాలని దర్శించుకుంటూ వుంటారు. యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీనిని ప్రకటించింది. మహాబలిపురం బంగాళాఖాతానికి అభి ముఖంగా కోరమండల్ తీరం లో ఉంది.
 
ఈ ప్రదేశం లో అనేక కళలు, పరవస్తు శిల్ప సంపద, సాహిత్యం మరియు అనేక ఇతర సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందాయి. మహాబలిపురం చుట్టు పక్కల కూడా ఆకర్షణలు పల్లవుల కాలం లో ఉన్నట్టే కనిపిస్తాయి. ఇక్కడ పల్లవ రాజులు సహజవనరులను గ్రహించి వాటిని పూర్తిగా వినియోగించారు. ఈ నగర నిర్మాణం కోసం ఎంత గానో శ్రమించారు ఇలా ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది.
 
 మహాబలిపురం లో అద్భుతమైన ప్రదేశాలు:
 

మహాబలిపురం లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. సమయం దొరికినప్పుడు వీటిని తప్పక దర్శించండి. కొండ రాతి గుహలు, వెండి రంగు ఇసుక బీచ్, సర్వే చెట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలానే వీటితో పాటుగా పుణ్య క్షేత్రాలు, పురాతన దేవాలయాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం తో పాటు ఇక్కడ చూడడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు వున్నాయి. 
 
పల్లవరాజుల కళాతృష్ణకు మహాబలిపురం ఒక నిదర్శనంగా ఉంటుంది సుమారు 18 వ శతాబ్దం వరకు మహాబలిపురం ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలియదు. దండయాత్రల భయం తో పల్లవరాజులు తమ పట్టణాభివృద్ధి ఎంతో రహస్యంగా ఉంచేవారు. పల్లవ రాజులు నరసింహ మరియు రాజ సింహాలు ఈ నిర్మాణాల శిల్ప నైపుణ్యతను కాపాడేందుకు అభివృద్ధి చేయడానికి ఎంత గానో చూపించడం జరిగింది. అలా ఆనాటి శిల్పకళ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది.