BREAKING NEWS

సహజసిద్ధంగా ఏర్పడిన అక్కమహాదేవి గుహలు..!

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా...? అయితే శ్రీశైలం అడవుల్లో ఉన్న అక్కమహా దేవి గుహల గురించి తెలుసుకోవాల్సిందే..! అక్క మహా దేవి గుహలు నల్లమల్ల శ్రేణి లోని కొండల పై శ్రీశైలంకు సుమారు పది కిలో మీటర్ల దూరం లో ఉన్నాయి. వీటి గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే...! ఇక్కడ గుహ లో ఏర్పడిన సహజ శివలింగ దర్శనం ఒక అద్భుతం అని మనం చెప్పవచ్చు.
 
నిజంగా ప్రతి ఒక్కరు దీనిని సందర్శించాల్సిందే...! అయితే అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది..?, ఇక్కడ ఏం చూడాలి..?, నిజంగా దీనికి ఉన్న మహిమ ఏంటి...? ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.
 
అక్క మహా దేవి గుహలు నల్లమల్ల అడవుల్లో కొండల పై శ్రీశైలం కి  పది కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ గుహలు ఎప్పుడో పూర్వం నాటివి అని తెలియజేసే ఆధారాలు కూడా ఉన్నాయి. పట్టణ చరిత్ర లో ఈ గుహలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి అని మనం చెప్పాలి. ఇది ఇలా ఉండగా ఈ గుహలకు 12వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్క మహా దేవి అక్కడ ఉన్న గుహల లోపలి భాగాల లో గల సహజ శివ లింగం కు ఆమె పూజలు చేయడం కారణంగా ఆ గృహాలకు ఈ పేరు వచ్చింది.
 
అక్కమహా దేవి గుహల గురించి పలు విశేషాలు:
 
అక్క మహా దేవి గుహలు సహజంగా ఏర్పడ్డాయి. కృష్ణా నదికి ఎగువ భాగం లో ఇవి ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రధాన గుహకు సహజంగా ఏర్పడిన ఒక అద్భుతమైన ఆర్చ్ కూడా ఉంది. గృహ తో పాటు ఆ ఆర్చిని కూడా సహజంగా  ఉండడం మరో గొప్ప విషయం. పైగా అది చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు దానిని చూసి ఆనందిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న గుహల లో ఉండే రాళ్లు ఎప్పటివో బహు పురాతనమైనవి. పైగా ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
 
నిజంగా వీటిని చూడటం ఆనందంగా ఉంటుంది. ఎంతో మంది వీటిని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. సెలవు దొరికినప్పుడు మీరు కూడా వెళ్లి చూడొచ్చు. నిజంగా ఇవి ప్రతి ఒక్కరూ చూడదగ్గవి.
 
మధురమైన అనుభవాన్ని ఇచ్చే అక్కమహాదేవి గుహలు:
 
ఈ గుహలు చూడడానికి చాలా బాగుంటాయి. ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం అనే మనం చెప్పాలి. సుమారు 150 అడుగుల పొడవు ఉండే ఈ గుహలు ఎంతో మంచి అనుభవాన్ని చేస్తాయనే చెప్పాలి. చాలా మంది వీటిని చూడడానికి ఇష్ట పడతారు పైగా ఈ ప్రయాణం చాలా బాగుంటుంది.
 
అక్కమహా దేవి గురించి కొన్ని విషయాలు:
 
సాధారణంగా అక్కమహాదేవి అనే పేరు వినగానే మనకు ఈ గుహలు గుర్తొస్తాయి. విశాలమైన ఈ గుహల్లో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసిందని అంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే అక్కమహా దేవి ఒక భక్తురాలు మాత్రమే కాదు. సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి.
 
అలానే ఈమె గొప్ప భక్తురాలు మాత్రమే కాదు రచయిత్రి కూడా. కన్నడలో ఆమె 400 పైగా వచనాలు రాశారు. అయితే ప్రతి వచనం లో కూడా చెన్న మల్లికార్జున అనే మకుటం కనిపించడం వల్లే అవి అక్కమహా దేవి రాసిన వచనాలుగా భావిస్తారు. ఆమె రాసిన రచనల్లో శివుడు గురించి ఆరాధన కనిపిస్తుంది. అలానే ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టంగా కనబడతాయి.
 
కొండల్లో గుహల్లో వెళుతూ ఉంటే ఈ ప్రాంతం చాలా భయంకరంగా ఉండేది. అలాంటి ప్రాంతం లో ఒక వివస్త్రగా ఉన్న సన్యాసులు సంచరించడం అంటే మాటలు కాదు. కానీ ఆమె భక్తి ముందు భయానికి చోటు లేదు. పైగా ఆమె తపస్సు చేయడానికి వెనుకడుగు వేయలేదు. నిజంగా వీటిని చూస్తే ఆమెకి ఉన్న భక్తి ఎంతో మనకి అర్థమవుతుంది.
 
ఇక్కడ ఉన్న ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామి గా పూజలందుకుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల లో శ్రీశైలం ఒకటి అని చెప్పాలి. అలాగే ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఈ విధంగా జ్యోతిర్లింగం శక్తి పీఠం ఉన్న అద్భుత ఆలయం ఈ శ్రీశైలం. ఇలా శ్రీశైలం లోని పాతాళగంగ మెట్ల నుంచి 10 కిలో మీటర్ల దూరంలో కృష్ణా నదిలో పడవ లో ప్రయాణించి కొండ పైకి వెళితే అక్కమహా దేవి గుహలు ఉంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు ని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. పైగా ఈ ప్రయాణం ఎంతో బాగుంటుంది. కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ఎంతో మంది ఆసక్తి తో వస్తారు.
 
అక్కమహాదేవి గుహలు భూమికి 200 అడుగుల ఎత్తులో 200 అడుగుల పొడవు 16 అడుగుల వెడల్పు తో ఉంటుంది. సహజ శిలాతోరణం అద్భుతమనే చెప్పాలి. పరమశివుని భర్తగా భావించిన గొప్ప భక్తురాలు ఈ అక్కమహాదేవి.